గుడ్ న్యూస్.. బజాజ్ డామినర్ 250 ఇప్పుడు కొత్త కలర్స్‌లో కూడా..
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన డామినార్ 250 బైక్ ని కొత్త పెయింట్ స్కీమ్ లో విడుదల చేసింది. ఇప్పుడు ఈ బజాజ్ డామినార్ 250 బైక్ అరోరా గ్రీన్ మరియు వైన్ బ్లాక్ అనే రెండు పెయింట్ స్కీమ్స్ లో గుర్తించబడింది. ఈ రెండు కొత్త కలర్ స్కీమ్స్ కొలంబియన్ మార్కెట్లలో గుర్తిచబడ్డాయి.

బజాజ్ డామినార్ 250 ప్రస్తుతం భారత మార్కెట్లో రెండు కలర్స్ లో లభిస్తుంది. అవి కాన్యన్ రెడ్ మరియు చార్‌కోల్ బ్లాక్ కలర్స్. భారతదేశంలో బజాజ్ కంపెనీ తన డామినార్ 250 ధరల పెరుగుదలను కూడా ప్రకటించింది. ఈ కొత్త సంవత్సరంలో పెరిగిన ధరల ప్రకారం ఈ మోటారుసైకిల్ యొక్క ప్రారంభ ధర 1,65,715 రూపాయలు (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ).

బజాజ్ డామినార్ 250 బైక్ 248 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 25 బిహెచ్‌పి మరియు 23.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్-అసిస్టెడ్ క్లచ్‌తో జతచేయబడుతుంది.

డామినార్ 250 బైక్ సస్పెన్షన్ మరియు హెడ్‌ల్యాంప్ వంటి మెకానికల్ హార్డ్‌వేర్ మరియు డిజైన్ ఎలిమెంట్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఎల్‌ఈడీ లైటింగ్, పుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్విన్-బారెల్ ఎగ్జాస్ట్, సింగిల్-పీస్ హ్యాండిల్ బార్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, 13-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ పైన సెకండరీ డిస్‌ప్లే, స్ప్లిట్ సీట్స్ వంటి ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.

ఈ బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో యుఎస్డి ఫోర్కులు మరియు వెనుక భాగంలో అడ్జస్టబుల్ మోనో-షాక్ చేత నిర్వహించబడతాయి. ఈ బైక్ యొక్క ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 230 మిమీ డిస్క్ బ్రేక్స్ కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ సపోర్ట్ కూడా ఉంటుంది.

బజాజ్ డామినార్ 250 బైక్ దేశీయ మార్కెట్లో కెటిఎమ్ డ్యూక్ 250, యమహా ఎఫ్జెడ్-25 మరియు సుజుకి గిక్సర్ 250 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. బజాజ్ డామినార్ 250 మంచి డిజైన్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఇతర ప్రత్యర్థులకు సరైన ప్రత్యర్థిగా నిలుస్తుంది.

బజాజ్ ఆటో కొత్త కలర్ ఆప్సన్స్ ప్రవేశపెట్టడం ద్వారా డామినార్ 400 మరియు డామినార్ 250 ల మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టం. ఈ రెండు మోటార్ సైకిళ్ళు కొలంబియాతో సహా అనేక అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ బైక్ కేవలం 10.5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 132 కి.మీ అని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త కలర్స్ ప్రవేశపెట్టడం ద్వారా అమ్మకాలు ఏవిధంగా జరుగుతాయో త్వరలో తెలుస్తాయి.


Click it and Unblock the Notifications








