మార్కెట్లో పెరిగిన బజాజ్ అవెంజర్ ధరలు; పూర్తి వివరాలు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన బజాజ్ ఆటో, భారత మార్కెట్లో ఎన్నో ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టి అత్యంత ప్రజాదరణ పొందింది. ఇటీవల కాలంలో కూడా బజాజ్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను కూడా మార్కెట్లో విడుదల చేసి తనకంటూ ఒక గుర్తింపును పొందుతోంది.

మార్కెట్లో పెరిగిన బజాజ్ అవెంజర్ ధరలు; పూర్తి వివరాలు

ఇదిలా ఉండగా బజాజ్ ఆటో ఇటీవల తన బ్రాండ్ యొక్క ద్విచక్ర వాహనాల ధరను భారత మార్కెట్లో పెంచినట్లు అధికారికంగా తెలిపింది. ఇందులో బజాజ్ అవెంజర్ 160 స్ట్రీట్ మరియు అవెంజర్ 220 క్రూయిస్ బైక్‌లు ఉన్నాయి.

మార్కెట్లో పెరిగిన బజాజ్ అవెంజర్ ధరలు; పూర్తి వివరాలు

కంపెనీ అధికారికంగా ప్రకటించిన ధరల విషయానికి వస్తే, ఇప్పుడు మార్కెట్లో బజాజ్ అవెంజర్ 160 స్ట్రీట్ ధర 1,07,30 రూపాయలు కాగా, అవెంజర్ 220 క్రూయిస్ బైక్ ధర 1,31,046 రూపాయల వరకు ఉంటుంది. ఈ బైక్స్ యొక్క పెరిగిన ధరలు తప్ప, ఇందులో ఎటువంటి మార్పులు చేయలేదని తెలుస్తుంది.

మార్కెట్లో పెరిగిన బజాజ్ అవెంజర్ ధరలు; పూర్తి వివరాలు

బజాజ్ అవెంజర్ 160 స్ట్రీట్ బైక్ విషయానైకి వస్తే, ఇందులో 160 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజిన్‌లో ఫ్యూయెల్ ఇంజెక్షన్ టెక్నాలజీ కూడా అందించబడింది. ఇందులో ఉన్న ఇంజిన్ 14.8 బిహెచ్‌పి పవర్ మరియు 13.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

మార్కెట్లో పెరిగిన బజాజ్ అవెంజర్ ధరలు; పూర్తి వివరాలు

ఇక బజాజ్ అవెంజర్ క్రూయిస్ 220 బైక్‌ విషయానికి వస్తే, ఇందులో 220 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ బిఎస్ 6 ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 18.7 బిహెచ్‌పి పవర్, 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 17.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

మార్కెట్లో పెరిగిన బజాజ్ అవెంజర్ ధరలు; పూర్తి వివరాలు

ఈ బైక్‌లోని ఇంజిన్ అప్ గ్రేడ్ మినహా, అవెంజర్ క్రూజ్ 220 బైక్‌లో ఇతర మార్పులు లేవు. డిజైన్ మునుపటిలా అలాగే ఉంచబడుతుంది. ఈ బైక్‌లో విండ్‌స్క్రీన్ మరియు క్రోమ్ యొక్క పొడవు చాలా వరకు ఉంటుంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

మార్కెట్లో పెరిగిన బజాజ్ అవెంజర్ ధరలు; పూర్తి వివరాలు

బజాజ్ కంపెనీ తన డామినార్ 250 బైక్ ధరను కూడా గణనీయంగా తగ్గించింది. కంపెనీ ఇటీవల డామినార్ 250 ధర రూ. 16,800 వరకు తగ్గింది. ఈ కారణంగానే ఇప్పుడు చిన్న డామినేటర్ మరింత సరసమైనదిగా మారింది.

మార్కెట్లో పెరిగిన బజాజ్ అవెంజర్ ధరలు; పూర్తి వివరాలు

బజాజ్ ఆటో ఇటీవల విడుదల చేసిన అమ్మకాల నివేదిక ప్రకారం, 2021 జూన్ నెలలో 3,10,578 యూనిట్లను మార్కెట్లో విక్రయించినట్లు ప్రకటించింది. 2020 లో ఇదే కాలంలో అమ్మిన యూనిట్ల కన్నా ఇది 22 శాతం ఎక్కువ. బజాజ్ ఆటో గతంలో 2020 జూన్‌లో 2,55,122 యూనిట్లను విక్రయించింది.

Most Read Articles

English summary
Bajaj Increases Prices For Avenger Range Of Bikes Again In 2021. Read in Telugu.
Story first published: Friday, July 9, 2021, 11:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X