భారత్‌లో విడుదలైన బజాజ్ పల్సర్ డాగర్ ఎడ్జ్ ఎడిషన్; ధర & వివరాలు
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో తన ఉనికిని మరింత విస్తరించడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల కొత్త పల్సర్ ఎన్ఎస్ 125 బైక్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఇప్పుడు మరో కొత్త మోడల్స్ విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం..

బజాజ్ ఆటో ఇప్పుడు తన శ్రేణిలో పల్సర్ 150, పల్సర్ 180 మరియు పల్సర్ 220 ఎఫ్ బైకులను కొత్త డాగర్ ఎడిషన్‌లో విడుదల చేసింది. ఈ డాగర్ ఎడిషన్ మోడల్స్ కొత్త కలర్స్ మరియు కొత్త గ్రాఫిక్స్ లో ఉంటాయి. ఈ కొత్త మోడల్స్ కంపెనీ యొక్క అమ్మకాలను మరింత పెంచడానికి తోడ్పడతాయి.

ఈ కొత్త బైక్స్ వినియోగదారులను ఆకర్శించేవిధంగా ఉంటాయి. ఈ బైక్స్ మంచి డిజైన్ మరియు మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

బజాజ్ పల్సర్ 150 డాగర్ ఎడ్జ్ ఎడిషన్:
కొత్త బజాజ్ పల్సర్ 150 డాగర్ ఎడిషన్ పెర్ల్ వైట్ మరియు సఫైర్ బ్లూ కలర్ లో ఉటుంది. ఈ పెర్ల్ వైట్ కలర్ లో కూడా రెడ్ హైలెట్స్ అందించబడుతుంది. ఇందులో మడ్‌గార్డ్ మరియు రిమ్స్ కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఇందులో రెడ్-బ్లాక్ గ్రాఫిక్స్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు బెల్లీ పాన్ చూడవచ్చు.

సఫైర్ బ్లూ కలర్స్ ముడ్‌గార్డ్ మరియు రిమ్స్‌లో వైట్ హైలెట్స్ కలిగి ఉంటాయి. ఈ బైక్ ఇప్పుడు బ్లాక్ గ్రాఫిక్స్ తో ఆఫర్ చేయబడింది. ఈ కొత్త పల్సర్ 150 ధర రూ. 1,01,818 కాగా పల్సర్ 150 ట్విన్ డిస్క్ మోడల్ ధర 1,01,818 రూపాయల వరకు ఉంటుంది.

బజాజ్ పల్సర్ 150 డాగర్ ఎడ్జ్ ఎడిషన్ బైక్‌లో 149.5 సిసి ఫోర్-స్ట్రోక్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 13.8 బిహెచ్‌పి శక్తిని, 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 13.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

బజాజ్ పల్సర్ 180 డాగర్ ఎడ్జ్ ఎడిషన్:
బజాజ్ పల్సర్ 180 డాగర్ ఎడ్జ్ ఎడిషన్ కొత్త అదనపు వోల్కనో రెడ్ మరియు స్పార్కిల్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. దీని వోల్కనో రెడ్ కలర్ లో వైట్ అండ్ బ్లాక్ గ్రాఫిక్స్ కలిగి ఉండగా, స్పార్కిల్ బ్లాక్ కలర్ ఎడిషన్ లో రెడ్ గ్రాఫిక్స్ ఇవ్వబడ్డాయి.

పల్సర్ 180 డాగర్ ఎడిషన్ 178.6 సిసి ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 16.8 బిహెచ్‌పి మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 14.52 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బజాజ్ పల్సర్ 180 డాగర్ ఎడ్జ్ ఎడిషన్ ధర 1,09,651 రూపాయలు.

పల్సర్ 220 ఎఫ్ డాగర్ ఎడ్జ్ ఎడిషన్:
ఈ పల్సర్ 220 ఎఫ్ డాగర్ ఎడిషన్ వేరియంట్ 4 కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి పెర్ల్ వైట్, సఫైర్ బ్లూ, వోల్కనో రెడ్ మరియు స్పార్కిల్ బ్లాక్ కలర్స్. ఇవి అద్భుతమైన గ్రాఫిక్స్ డిజైన్ కలిగి ఉంటాయి. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి వాహనదారులను ఆకర్శించేవిధంగా ఉంటాయి.

పల్సర్ 220 ఎఫ్ డాగర్ ఎడ్జ్ ఎడిషన్ బైక్ లో 220 సిసి ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 20.1 బిహెచ్‌పి పవర్, 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.55 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కొత్త పల్సర్ 220 ఎఫ్ డాగర్ ఎడ్జ్ ఎడిషన్ ధర 1,28,250 రూపాయలు.


Click it and Unblock the Notifications








