Just In
- 8 hrs ago
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!
- 10 hrs ago
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- 12 hrs ago
భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు
- 13 hrs ago
మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ
Don't Miss
- News
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం
- Sports
PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్.. స్టన్నింగ్ క్యాచ్!వీడియోలు
- Movies
పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ.. కోవిడ్ 19 హీరో అంటూ..
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Lifestyle
Happy Ramadan 2021: ఈద్-ముబారక్ ప్రత్యేక సందేశాలను మీకిష్టమైన వారితో పంచుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
భారత మార్కెట్లో బజాజ్ ఆటో ఎబిఎస్ టెక్నాలజీతో కూడిన తన కొత్త ప్లాటినా 110 ను విడుదల చేసింది. కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ మోడల్ ధర ఇప్పుడు 65,920 రూపాయలతో (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) లభిస్తుంది. కొత్త ప్లాటినా 110 ఇప్పుడు ఎబిఎస్‌తో స్టాండర్డ్ గా అందించే ఏకైక మోడల్.

కొత్త బజాజ్ ప్లాటినా 110 ప్యాసింజెర్ మోటార్ సైకిల్ ఇప్పుడు దాని ముందు భాగంలో 240 మిమీ డిస్క్‌తో వస్తుంది. దీనికి సింగిల్-ఛానల్ ఎబిఎస్ సపోర్ట్ ఇస్తుంది. ఎబిఎస్ టెక్నాలజీతో పాటు, మోటారుసైకిల్ ఇప్పుడు కంఫర్టెక్ ప్యాకేజీతో కూడా వచ్చింది. ఇందులో క్విల్టెడ్ సీట్లు, స్ప్రింగ్-ఆన్-స్ప్రింగ్ సస్పెన్షన్ సెటప్, ట్యూబ్‌లెస్ టైర్లు, డిఆర్‌ఎల్‌లతో ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, న్యూ మిర్రర్స్ మరియు హ్యాండ్‌గార్డ్ ఉన్నాయి.

2021 బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ అదే 115 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7000 ఆర్‌పిఎమ్ వద్ద 8.4 బిహెచ్‌పి మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 9.81 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ మూడు కలర్ ఆప్సన్స్ తో లభిస్తుంది. అవి చార్‌కోల్ బ్లాక్, వోల్కనిక్ రెడ్ మరియు బీచ్ బ్లూ కలర్స్.
MOST READ:కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్

ఈ మోటార్ సైకిల్ విభాగంలో ఎబిఎస్ టెక్నాలజీని అందుకున్న మొట్ట మొదటి బైక్ ఈ బజాజ్ ప్లాటినా 110. భారతదేశం యొక్క వాహన భద్రతా నిబంధనలలో భాగంగా, 125 సిసి లేదా అంతకంటే ఎక్కువ ఇంజిన్ కలిగిన అన్ని ద్విచక్ర వాహనాలు తప్పనిసరిగా ఎబిఎస్‌ను కలిగి ఉండాలి. అయితే 110 సిసి మోటార్‌సైకిల్‌పై ఈ సేఫ్టీ టెక్‌ను చేర్చడం అనే కొత్త మార్పు.

బజాజ్ ఇటీవలే తన ప్లాటినా 100 మోడల్‌ను ఎలక్ట్రిక్-స్టార్ట్ తో పాటు అప్‌డేట్ చేసింది. కొత్త బజాజ్ ప్లాటినా 100 ఇఎస్ ధర రూ. 53,920, (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ). ఇది దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ప్లాటినా 100 కూడా ఎలక్ట్రిక్-స్టార్ట్ టెక్నాలజీని కలిగి ఉన్న ఏకైక మోటారుసైకిల్. ఈ విభాగంలో దాని ప్రత్యర్థులందరూ ఇప్పటికీ కిక్ స్టార్ట్ ఆప్సన్ మాత్రమే అందిస్తున్నారు.
MOST READ:మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్‌గా ఇచ్చారు, ఎందుకో తెలుసా!

భారత మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ కంపెనీ యొక్క అమ్మకాలను మెరుగుపరచడానికి చాలా సహాయపడే అవకాశం ఉంది. ఇది మంచి డిజైన్ కలిగి ఉండటంతో పాటు వాహనదారునికి మంచి రైడింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది.

బజాజ్ ప్లాటినా 110 ఇప్పుడు ఎబిఎస్‌ను ప్రామాణికంగా అందించబడుతున్న భారతదేశంలో అత్యంత సరసమైన ద్విచక్ర వాహనాల్లో ఒకటి. ప్లాటినా 110 ఎబిఎస్ ఈ విభాగంలో హీరో స్ప్లెండర్ మరియు టివిఎస్ రేడియన్ వంటి వాటికి ప్రత్యర్థిగా కొనసాగుతోంది. ఏది ఏమైనా ఈ కొత్త ఫీచర్స్ ఈ విభాగంలో చాలా ఉపయోగపడుతుంది.