హుడిబాబా.. బజాజ్ కాలిబర్ బైక్ తిరిగి మార్కెట్లోకి రాబోతోంది..

హుడిబాబా బైక్ గుర్తుందా..? ఈ కాలం కుర్రాళ్లకు దీని గురించి తెలియకపోవచ్చు కానీ, 1990 కాలానికి చెందిన కుర్రకారుకి మాత్రం ఇది కిర్రెక్కించే బైక్. అదే బజాజ్ కాలిబర్. అప్పట్లో టెలివిజన్ మరియు రేడియాలలో ఈ హుడిబాబా అడ్వర్టైజ్‌మెంట్ వింటుంటే, అదొక తెలియన్ వింత అనుభూతి కలిగేది.

హుడిబాబా.. బజాజ్ కాలిబర్ బైక్ తిరిగి మార్కెట్లోకి రాబోతోంది..

ఒకప్పటి కుర్రకారుకి బజాజ్ కాలిబర్ బైక్ ఇప్పటి ప్రీమియం బైక్‌లతో సమానం అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గంటకు 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్, లీటరు పెట్రోల్‌కి 90 కిలోమీటర్ల మైలేజ్, 115సీసీ ఇంజన్ మరియు 9.5 బిహెచ్‌పి పవర్.. ఇవన్నీ బజాజ్ కాలిబర్ మోటార్‌సైకిల్ ప్రత్యేకతలు.

హుడిబాబా.. బజాజ్ కాలిబర్ బైక్ తిరిగి మార్కెట్లోకి రాబోతోంది..

బజాజ్ ఆటో మరియు కవాసకి సంస్థలు 1990 కాలంలో భాగస్వాములుగా ఉండేవి. ఈ ఇరు కంపెనీల భాగస్వామ్యం నుండి మార్కెట్లోకి అనేక ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. అలాంటి వాటిలో అత్యంత పాపులర్ అయినది బజాజ్ కాలిబర్ లేదా కవాసకి కాలిబర్.

హుడిబాబా.. బజాజ్ కాలిబర్ బైక్ తిరిగి మార్కెట్లోకి రాబోతోంది..

బజాజ్ ఆటో 1998లో కాలిబర్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది మరియు ఆ సమయంలో ఇది యువతను చాలా బాగా ఆకట్టుకుంది. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వచ్చిన 'హుడిబాబా' ప్రకటనలు ఈ మోడల్ అమ్మకాలపై గొప్ప ప్రభావాన్ని చూపాయి.

హుడిబాబా.. బజాజ్ కాలిబర్ బైక్ తిరిగి మార్కెట్లోకి రాబోతోంది..

సరే ఆ హిస్టరీ అంతా అటుంచి, ప్రస్తుతానికి వచ్చేస్తే.. బజాజ్ ఆటో ఇప్పుడు తిరిగి కాలిబర్ బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. బజాజ్ ఆటో నుండి రాబోయే మరొక కొత్త ఎంట్రీ లెవల్ కమ్యూటర్ బైక్ కోసం ఈ పేరును ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.

హుడిబాబా.. బజాజ్ కాలిబర్ బైక్ తిరిగి మార్కెట్లోకి రాబోతోంది..

ఈ మేరకు బజాజ్ ఆటో 'కాలిబర్' అనే పేరును ట్రేడ్‌మార్క్ కోసం ధరఖాస్తు కూడా చేసుకుంది. బజాజ్ నుండి రాబోయే ఈ కొత్త బైక్, ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ విభాగంలో పోటీని మరింత కఠినతరం చేస్తుందని, ఇప్పటి ఈ విభాగంలో ఆదిపత్యం చలాయిస్తున్న హీరో మోటోకార్ప్ వంటి సంస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చని భావిస్తున్నారు.

హుడిబాబా.. బజాజ్ కాలిబర్ బైక్ తిరిగి మార్కెట్లోకి రాబోతోంది..

భారతదేశంలో 1990 చివర్లలో మరియు 2000 సంవత్సరం ప్రారంభంలో బజాజ్ కాలిబర్ 115 మోడల్ చాలా ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. ఈ బైక్‌లో బజాజ్ మరియు కవాసకి సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన 111.6సిసి ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9.5 బిహెచ్‌పి పవర్‌ను మరియు 9.10 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఈ ఇంజన్‌తో 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉండేది.

హుడిబాబా.. బజాజ్ కాలిబర్ బైక్ తిరిగి మార్కెట్లోకి రాబోతోంది..

కాగా, బజాజ్ ఆటో ధరఖాస్తు చేసుకున్న ట్రేడ్‌మార్క్ అప్లికేషన్ ప్రకారం, 'బజాజ్ కాలిబర్' నేమ్‌ప్లేట్‌ను ద్విచక్ర వాహనం, త్రీ-వీలర్ లేదా విద్యుత్ శక్తితో కూడిన ద్విచక్ర వాహనం (ఎలక్ట్రిక్ టూవీలర్) కోసం ఉపయోగించవచ్చు. అయితే, మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, బజాజ్ కాలిబర్‌ను ఎంట్రీ లెవల్ ఐసి (ఇంటర్నల్ కంబస్టియన్) ఇంజన్ పవర్డ్ కమ్యూటర్ బైక్‌గా విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

హుడిబాబా.. బజాజ్ కాలిబర్ బైక్ తిరిగి మార్కెట్లోకి రాబోతోంది..

ఒకవేళ ఇదే నిజమైతే, కొత్త బజాజ్ కాలిబర్ మోటార్‌సైకిల్‌లో బజాజ్ ప్లాటినా 110లో ఉపయోగించిన 115సిసి ఇంజన్‌ను కానీ లేదా పల్సర్ 125 మోడల్‌లో ఉపయోగించిన 125సిసి ఇంజన్‌ను కానీ ఉపయోగించే అవకాశం ఉంటుంది.

హుడిబాబా.. బజాజ్ కాలిబర్ బైక్ తిరిగి మార్కెట్లోకి రాబోతోంది..

ఇందులో ప్లాటినాలోని 115సిసి, ఎఫ్‌ఐ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ 8.5 బిహెచ్‌పి శక్తిని, 9.81 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, పల్సర్ 125లోని 124సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ 12 బిహెచ్‌పి పవర్‌ను మరియు 11 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి.

Article Published On: Friday, July 16, 2021, 12:28 [IST]
English summary
Bajaj Auto Might Launch New Commuter Motorcycle; Trademarks Caliber Name. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+