ఎట్టకేలకు భారత్‍లో విడుదలైన కొత్త Bajaj Pulsar 250 బైక్స్: ధర, ఫీచర్లు & వివరాలు

భారతీయ మార్కెట్లో Bajaj Auto (బజాజ్ ఆటో) రెండు సరికొత్త Bajaj Pulsar (బజాజ్ పల్సర్) బైకులను విడుదల చేసింది. ఇందులో ఒకటి Pulsar N250 బైక్ కాగా, మరొకటి Pulsar F250. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Bajaj Pulsar N250 ధర రూ. 1.38 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అదే విధంగా Bajaj Pulsar F250 ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దేశీయ విఫణిలో విడుదలైన ఈ కొత్త బైకుల గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

ఎట్టకేలకు భారత్‍లో విడుదలైన కొత్త Bajaj Pulsar 250 బైక్స్: ధర, ఫీచర్లు & వివరాలు

Bajaj కంపెనీ తన మొదటి బజాజ్ పల్సర్‌ను 20 సంవత్సరాల క్రితం తీసుకువచ్చింది, అయితే ఇప్పుడు కంపెనీ ఈ బ్రాండ్‌ను కొత్త అవతార్‌లో తీసుకువచ్చింది. ఈ రెండు బైకులు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కొత్త Bajaj Pulsar 250 బైకులు అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటాయి.

ఎట్టకేలకు భారత్‍లో విడుదలైన కొత్త Bajaj Pulsar 250 బైక్స్: ధర, ఫీచర్లు & వివరాలు

Bajaj Pulsar 250 బైకులు ఇప్పుడు ట్యూబ్‌లెస్ ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించబడ్డాయి. ఇది చూడటానికి చాలా ఏరోడైనమిక్‌గా రూపొందించింది. ఇందులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్ మరియు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ వంటివి అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ఈ బైక్ ముందు భాగం అగ్రెసివ్ లుక్ లో ఉంటుంది. ఈ బైక్ యొక్క ప్రధాన హెడ్‌లైట్‌కి రెండు వైపులా లైట్లు ఉన్నాయి, మీరు ఇక్కడ గమనించవచ్చు.

ఎట్టకేలకు భారత్‍లో విడుదలైన కొత్త Bajaj Pulsar 250 బైక్స్: ధర, ఫీచర్లు & వివరాలు

కొత్త Bajaj Pulsar 250 బైక్స్ అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ఇందులోని టాకోమీటర్ దాని మునుపటి మోడల్ నుంచి తీసుకోబడింది. ఐతే కాకుండా ఈ బైక్ డిజిటల్ స్క్రీన్ కూడా పొందుతుంది. ఈ స్క్రీన్ బైక్ యొక్క పరిధి, గేర్ పొజిషన్ మరియు డిస్టెన్స్ టూ ఎంప్టీ వాటి సమాచారాన్ని అందిస్తుంది.

ఎట్టకేలకు భారత్‍లో విడుదలైన కొత్త Bajaj Pulsar 250 బైక్స్: ధర, ఫీచర్లు & వివరాలు

ఇప్పుడు ఈ కొత్త అప్డేటెడ్ బైకులలో USB ఛార్జింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ బైక్‌ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ ఇప్పుడు 14 లీటర్లు, మరియు సీటు ఎత్తు 795 మిమీ వరకు ఉంది. మొత్తానికి ఈ బైక్ స్టైలిష్ గా మరియు వాహన వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‍లో విడుదలైన కొత్త Bajaj Pulsar 250 బైక్స్: ధర, ఫీచర్లు & వివరాలు

Bajaj Pulsar 250 యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 250 సిసి ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 24.5 బిహెచ్‌పి పవర్ మరియు 21.5 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ మంచి పనితీరుని అందిస్తుంది.

ఎట్టకేలకు భారత్‍లో విడుదలైన కొత్త Bajaj Pulsar 250 బైక్స్: ధర, ఫీచర్లు & వివరాలు

Bajaj Pulsar యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ఇందులో టెలీస్కోపిక్ ఫోర్క్స్ మరియు కొత్త మోనోషాక్ సస్పెన్షన్ అమర్చబడి ఉంటుంది, కావున ఇది సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ బైక్ అసిస్ట్ మరియు స్లీపర్ క్లచ్‌తో కూడా వస్తుంది, కావున ఇది వేగవంతమైన గేర్‌షిఫ్ట్‌లలో సహాయపడుతుంది.

ఎట్టకేలకు భారత్‍లో విడుదలైన కొత్త Bajaj Pulsar 250 బైక్స్: ధర, ఫీచర్లు & వివరాలు

ఈ కొత్త బైక్స్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 230 మిమీ డిస్క్ బ్రేక్ ఇవ్వబడింది. అంతే కాకుండా ఇందులో సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ బైక్‌కు దాదాపు 165 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా లభిస్తుంది.

ఎట్టకేలకు భారత్‍లో విడుదలైన కొత్త Bajaj Pulsar 250 బైక్స్: ధర, ఫీచర్లు & వివరాలు

Bajaj Pulsar 250 ముందువైపు 100/80 ప్రొఫైల్ టైర్లను మరియు వెనుకవైపు 17-ఇంచెస్ వీల్స్ తో 130/70 ప్రొఫైల్‌ను పొందుతుంది. ఈ బైక్ ఇప్పుడు టెక్నో గ్రే మరియు రేసింగ్ రెడ్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ యొక్క పనితీరు మునుపటికంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‍లో విడుదలైన కొత్త Bajaj Pulsar 250 బైక్స్: ధర, ఫీచర్లు & వివరాలు

బజాజ్ పల్సర్ 250 భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 18 మిలియన్ యూనిట్లు విక్రయించబడ్డాయి.దేశీయ మార్కెట్లో చాలా సంవత్సరాల నుంచి తిరుగులేని బైక్ గా ఎంతో ఆదరణ పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాలలో కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్‌లలో ఈ పల్సర్ ఒకటి. ఇంతటి ప్రజాదరణ పొందిన బైకును కంపెనీ ఇప్పుడు కొత్త అవతార్ లో తీసుకువచ్చింది. కావున ఈ బైక్ మరింత మంచి అమ్మకాలతో ముందుకు సాగుతుంది అని భావిస్తున్నాము.

ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో ఈ కొత్త బజాజ్ పల్సర్ బైక్ విడుదలయింది. అయితే ఈ కొత్త అవతార్ లో విడుదలైన ఈ బైక్ ఎలాంటి అమ్మకాలను పొందుతోందో అనే విషయం త్వరలో తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 28, 2021, 15:04 [IST]
English summary
Bajaj pulsar 250 launched price 1 38 lakh features engine variant update details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+