రైడర్స్ మనసు దోచే 'Bajaj Pulsar 250'.. రివ్యూ వీడియో

బజాజ్ పల్సర్ (Bajaj Pulsar), ఇది పరిచయం అవసర లేని పేరు. ఎందుకంటే దేశీయ మార్కెట్లో ఒకప్పటి నుంచి కూడా అత్యంత ఆదరణ పొందుతున్న బైకులలో ఈ 'బజాజ్ పల్సర్' బైకులు మొదటి స్థానంలో ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. కంపెనీ తన పల్సర్ బ్రాండ్‌ బైకులను ప్రపంచంలో దాదాపు 70 దేశాలలో విక్రయిస్తుంది. ఇందులో అనేక రకాలు మరియు మోడల్స్ ఉన్నాయి.

భారతీయ మార్కెట్లో ఇటీవల Bajaj Pulsar N250 మరియు Bajaj Pulsar F250 అనే రెండు బైకులు విడుదలయ్యాయి. వీటి దధరలు వరుసగా రూ. 1.38 లక్షలు మరియు రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అయితే ఇటీవల మేము ఈ బైక్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోటానికి పూణేలోని చకాన్ వద్ద బజాజ్ ప్లాంట్ లో కొత్త Pulsar 250 బైక్స్ రైడ్ చేసాము. ఈ బైక్స్ గురించి మరింత సమాచారం కోసం ఈ కింది వీడియో చూడండి.

Bajaj యొక్క ఈ రెండు బైకులు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. ఇందులో స్టైలిష్ హెడ్‌ల్యాంప్ యూనిట్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లో సెంటర్ స్టేజ్ టేకింగ్ ఎక్స్‌పోజ్డ్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ ఉంటుంది. హెడ్‌ల్యాంప్ యూనిట్ పైన అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇందులోని స్క్రీన్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్లు, ఫ్యూయెల్ లెవెల్, ఇన్స్టంట్ ఫ్యూయెల్ ఎఫిషియన్సీ, ​​డిస్టెన్స్ టు ఎంప్టీ వంటి సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. ఈ బైక్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కొత్త అప్డేటెడ్ బైకులలో USB ఛార్జింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

Bajaj Pulsar 250 బైక్స్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 250 సిసి ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 24.1 బిహెచ్‌పి పవర్ మరియు 21.5 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్ కూడా ఉంటుంది. ఈ బైక్ మంచి పనితీరుని అందిస్తుంది.

రైడర్స్ మనసు దోచే Bajaj Pulsar 250

Bajaj Pulsar 250 బైక్స్ కేవలం రెండు కలర్ ఆప్సన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అవి రేసింగ్ రెడ్ మరియు టెక్నో గ్రే కలర్స్. ఈ రెండు కలర్స్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే టెక్నో గ్రే కలర్ బైక్ మాత్రం చాలా మెరుగ్గా మరియు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మొత్తానికి ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఆధునిక కాలంలో ఈ బైక్ తప్పకుండా రైడర్ మనసు దోచే విధంగా తయారుచేయబడి ఉన్నాయని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Bajaj pulsar 250 review video engine performance details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X