Pulsar 250 డెలివరీలు స్టార్ట్ చేసిన Bajaj.. ఫస్ట్ బైక్ డెలివరీ ఎక్కడంటే?

ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీదారు బజాజ్ ఆటో (Bajaj Auto) ఇటీవల కాలంలో రెండు కొత్త బైకులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఒకటి Pulsar N250 బైక్ కాగా, మరొకటి Pulsar F250. అయితే కంపెనీ ఇప్పుడు ఈ బైకులను డెలివరీ చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం కంపెనీ కొత్త బజాజ్ పల్సర్ F250 యొక్క మొదటి డెలివరీ 15 నవంబర్ 2021న పూణేలో అందించింది.

Pulsar 250 డెలివరీలు స్టార్ట్ చేసిన Bajaj.. ఫస్ట్ బైక్ డెలివరీ ఎక్కడంటే?

నివేదికల ప్రకారం, బజాజ్ కంపెనీ ఈ మొదటి బైక్ పూణేలోని చించ్వాడ్‌లోని శౌర్య బజాజ్ షోరూమ్ నుండి డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. భారతీయ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ మార్కెట్లో 20 సంవత్సరాల నాయకత్వాన్ని పురస్కరించుకుని, బజాజ్ ఆటో గత నెలలో సరికొత్త బజాజ్ పల్సర్ 250 విడుదల చేసింది.

Pulsar 250 డెలివరీలు స్టార్ట్ చేసిన Bajaj.. ఫస్ట్ బైక్ డెలివరీ ఎక్కడంటే?

బజాజ్ కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త బైకుల ధరల విషయానికి వస్తే, Bajaj Pulsar N250 ధర రూ. 1.38 లక్షలు కాగా Bajaj Pulsar F250 ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ రెండు బైకులు చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉన్నాయి. కావున ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించడంలో తప్పకుండా విజయం సాధిస్తాయి.

Pulsar 250 డెలివరీలు స్టార్ట్ చేసిన Bajaj.. ఫస్ట్ బైక్ డెలివరీ ఎక్కడంటే?

కొత్త బజాజ్ పల్సర్ 250 బైక్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది ట్యూబ్‌లెస్ ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించబడింది. దీనిని కంపెనీ ఇప్పటికే మరింత ఏరోడైనమిక్‌గా రూపొందించింది. వీటిలో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ వంటి వాటిని అందిస్తుంది. అంతే కాకుండా ఈ బైక్ ముందు భాగానికి అగ్రెసివ్ లుక్ ఇవ్వబడింది మరియు ప్రధాన హెడ్‌లైట్‌కి రెండు వైపులా లైట్లు ఇవ్వబడ్డాయి.

Pulsar 250 డెలివరీలు స్టార్ట్ చేసిన Bajaj.. ఫస్ట్ బైక్ డెలివరీ ఎక్కడంటే?

ఇక ఈ పల్సర్ 250 బైక్ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులోని టాకోమీటర్ నీడిల్ దాని మునుపటి మోడల్ నుండి తీసుకోబడింది. ఇందులో డిజిటల్ స్క్రీన్ కూడా చూడవచ్చు. ఈ స్క్రీన్ బైక్ యొక్క రేంజ్, గేర్ పొజిషన్ మరియు డిస్టెన్స్ టు ఎంప్టీ వంటి సమాచారాన్ని అందిస్తుంది. ఇవి మాత్రమే కాకుండా ఇందులో మొబైల్ USB ఛార్జింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

Pulsar 250 డెలివరీలు స్టార్ట్ చేసిన Bajaj.. ఫస్ట్ బైక్ డెలివరీ ఎక్కడంటే?

Bajaj Pulsar 250 యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 250 సిసి ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 24.5 బిహెచ్‌పి పవర్ మరియు 21.5 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ మంచి పనితీరుని అందిస్తుంది. ఈ బైక్‌లో 14 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది, అయితే ఈ బైక్ యొక్క సీటు ఎత్తు 795 మిమీ వరకు ఉంటుంది.

Pulsar 250 డెలివరీలు స్టార్ట్ చేసిన Bajaj.. ఫస్ట్ బైక్ డెలివరీ ఎక్కడంటే?

Pulsar 250 యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ఇందులో టెలీస్కోపిక్ ఫోర్క్స్ మరియు కొత్త మోనోషాక్ సస్పెన్షన్ అమర్చబడి ఉంటుంది, కావున ఇది సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ బైక్ అసిస్ట్ మరియు స్లీపర్ క్లచ్‌తో కూడా వస్తుంది, కావున ఇది వేగవంతమైన గేర్‌షిఫ్ట్‌లలో సహాయపడుతుంది.

Pulsar 250 డెలివరీలు స్టార్ట్ చేసిన Bajaj.. ఫస్ట్ బైక్ డెలివరీ ఎక్కడంటే?

ఇక ఈ బైక్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 230 మిమీ డిస్క్ బ్రేక్ ఇవ్వబడింది. అంతే కాకుండా ఇందులో సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ బైక్‌కు దాదాపు 165 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా లభిస్తుంది.

Pulsar 250 డెలివరీలు స్టార్ట్ చేసిన Bajaj.. ఫస్ట్ బైక్ డెలివరీ ఎక్కడంటే?

Bajaj Pulsar 250 ముందువైపు 100/80 ప్రొఫైల్ టైర్లను మరియు వెనుకవైపు 17-ఇంచెస్ వీల్స్ తో 130/70 ప్రొఫైల్‌ను పొందుతుంది. ఈ బైక్ ఇప్పుడు టెక్నో గ్రే మరియు రేసింగ్ రెడ్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ యొక్క పనితీరు మునుపటికంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది.

Pulsar 250 డెలివరీలు స్టార్ట్ చేసిన Bajaj.. ఫస్ట్ బైక్ డెలివరీ ఎక్కడంటే?

బజాజ్ పల్సర్ 250 భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 18 మిలియన్ యూనిట్లు విక్రయించబడ్డాయి. దేశీయ మార్కెట్లో చాలా సంవత్సరాల నుంచి ఇది తిరుగులేని బైక్ గా ఎంతో ఆదరణ పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాలలో కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్‌లలో ఈ పల్సర్ ఒకటి. ఈ కొత్త బైక్స్ వల్ల కంపెనీ యొక్క అమ్మకాలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Bajaj pulsar 250 series delivery starts first units delivered in pune details
Story first published: Wednesday, November 17, 2021, 18:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X