Bajaj Pulsar 250 టీజర్ లాంచ్.. అక్టోబర్ 28 నుండి సేల్స్ షురూ..

బజాజ్ ఆటో (Bajaj Auto) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పల్సర్ 250 (Pulsar 250) మోడల్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. ఈ కొత్త మోడల్ కోసం కంపెనీ ఓ అఫీషియల్ టీజర్ ని కూడా విడుదల చేసింది. కొత్త బజాజ్ పల్సర్ 250 (Bajaj Pulsar 250) అమ్మకాలు అక్టోబర్ 28వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.

Bajaj Pulsar 250 టీజర్ లాంచ్.. అక్టోబర్ 28 నుండి సేల్స్ షురూ..

బజాజ్ పల్సర్ లో 250 సిసి మోడల్ రావడం ఇదే మొదటిసారి. పల్సర్ బ్రాండ్ లో కంపెనీ 125 సిసి మొదలుకొని 220 సిసి వరకూ వివిధ రకాల మోడళ్లను విక్రయిస్తోంది. కాగా, బజాజ్ నుండి రానున్న ఈ నెక్స్ట్ జనరేషన్ ఆల్-న్యూ పల్సర్ 250 మోటార్‌సైకిల్ సరికొత్త డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Bajaj Pulsar 250 టీజర్ లాంచ్.. అక్టోబర్ 28 నుండి సేల్స్ షురూ..

కొత్త 2022 బజాజ్ పల్సర్ 250 కోసం కంపెనీ విడుదల టీజర్ వీడియో సుమారు 62 సెకన్ల పాటు ఉంటుంది. ఈ వీడియో 1 వ తరం బజాజ్ పల్సర్ తో మొదలవుతుంది. టీజర్ వీడియో రాబోయే బజాజ్ పల్సర్ 250 యొక్క వివిధ సిల్హౌట్ షాట్‌ లను చూపించారు. అలాగే, ఈ వీడియోలో కొత్త పల్సర్ మోటార్‌సైకిల్ యొక్క కొన్ని ఫీచర్లు మరియు క్యారెక్టర్లను కూడా వెల్లడించారు.

Bajaj Pulsar 250 టీజర్ లాంచ్.. అక్టోబర్ 28 నుండి సేల్స్ షురూ..

కంపెనీ విడుదల చేసిన కొత్త బజాజ్ పల్సర్ 250 యొక్క అధికారిక టీజర్ ప్రకారం, ఇది సరికొత్త డిజైన్ మరియు ఎడ్జియర్ లైన్‌ లను కలిగి ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంతే కాకుండా, రాబోయే బాజాజ్ పల్సర్ 250 సాంప్రదాయ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక భాగంలో మోనో-షాక్, స్ప్లిట్ సీట్లు, సెమీ ఫెయిరింగ్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ను కలిగి ఉంటుంది.

ఈ టీజర్ లో ఇంజన్ యొక్క రెక్కలను పోలి ఉండే భాగాన్ని కూడా వెల్లడిస్తుంది. అంటే, దీని అర్థం రాబోయే కొత్త బజాజ్ పల్సర్ 250 ఆయిల్-కూల్డ్ లేదా ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ 250 సిసి ఇంజిన్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఒకవేళ అలా కాకపోతే, ఈ ఫిన్‌లు రేడియేటర్‌కు ఛానెల్‌లు కూడా అయి ఉండొచ్చు.

Bajaj Pulsar 250 టీజర్ లాంచ్.. అక్టోబర్ 28 నుండి సేల్స్ షురూ..

రాబోయే బజాజ్ పల్సర్ 250 బజాజ్ డొమినార్ 250 నుండి అదే పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగించుకోవచ్చని సమాచారం. దీని వలన బజాజ్ ఆటో తమ కొత్త పల్సర్ 250 కోసం కొత్త ఇంజన్ ను అభివృద్ధి చేసే ఖర్చును నివారిస్తుంది. అయితే, ఈ టీజర్ చిత్రాల నుండి, బజాజ్ తమ కొత్త పల్సర్ 250 ని ప్రస్తుతం విక్రయిస్తున్న మోటార్‌సైకిళ్ల లైనప్ తయారు చేస్తున్నట్లుగా పెరిమీటర్ ఫ్రేమ్‌ ని ఉపయోగించి తయారు చేస్తుందా లేక కొత్త ఫ్రేమ్ ని ఉపయోగిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Bajaj Pulsar 250 టీజర్ లాంచ్.. అక్టోబర్ 28 నుండి సేల్స్ షురూ..

కొత్త బజాజ్ పల్సర్ 250 ఈ బ్రాండ్ లైనప్ లోనే అత్యంత వేగవంతమైన పల్సర్ గా ఉంటుంది. అంటే, దీని అర్థం, కొత్త బజాజ్ పల్సర్ 250 లో 26 బిహెచ్‌పి కంటే ఎక్కువ పవర్ జనరేట్ కావచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. అయితే, కొత్త బజాజ్ పల్సర్ 250 ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బజాజ్ పల్సర్ 220ఎఫ్ మాదిరిగానే ఉన్నట్లుగా టీజర్ ద్వారా తెలుస్తోంది.

Bajaj Pulsar 250 టీజర్ లాంచ్.. అక్టోబర్ 28 నుండి సేల్స్ షురూ..

ఇందులో ముందు వైపు పెద్ద సెమీ ఫెయిరింగ్, వెనుక వైపు షార్ప్‌ టైల్ డిజైన్ మరియు పొడవైన వీల్‌బేస్‌ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ను ఇందులో చూడొచ్చు. బజాజ్ క్లెయిమ్ చేసినట్లుగా ఇది అత్యంత వేగవంతమైన పల్సర్ మరియు బజాజ్ పల్సర్ 220ఎఫ్ కి సరిపోయే సిల్హౌట్ అయితే, కొత్తగా రాబోయే బజాజ్ పల్సర్ 250, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బజాజ్ పల్సర్ 220ఎఫ్‌ రీప్లేస్ చేసే అవకాశం ఉంది.

కానీ, బజాజ్ ఆటో అలా చేయటం అంత సులువైన పనేం కాదు. బజాజ్ పల్సర్ 220ఎఫ్ ని రీప్లేస్‌మెంట్ చేయడం అంత తేలికైన పని కాదని, ఈ బైక్ ఇప్పటికీ చాలా మంది కస్టమర్ లకు ఇష్టమైనదని బజాజ్‌ ఆటోకి తెలుసు. బజాజ్ పల్సర్ 220 విజయానికి ప్రధాన కారణాలలో ఒకటి దాని VFM ప్రతిపాదన. ఒకవేళ బజాజ్ తమ రాబోయే బజాజ్ పల్సర్ 250ఎఫ్‌ మోడల్‌ తో దీన్ని ప్రతిబింబించగలిగితే, బజాజ్ చివరకు బజాజ్ పల్సర్ 20ఎఫ్‌ గుడ్‌బై చెప్పొచ్చు.

Bajaj Pulsar 250 టీజర్ లాంచ్.. అక్టోబర్ 28 నుండి సేల్స్ షురూ..

బజాజ్ ఆటో నుండి కొత్తహా రానున్న బజాజ్ పల్సర్‌ 250 లో కంపెనీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ ఫీచర్ ను అందించబోతోంది. అంతేకాకుండా, ఈ బైక్ రెండు చివర్లలో ఆకర్షణీయంగా కనిపించే ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లను కూడా ఉపయోగించనున్నారు. గతంలో వెల్లడైన స్పై చిత్రాలలో, ఈ మోటార్‌సైకిల్ పై కంపెనీ కొత్త అల్లాయ్ వీల్స్ ఉపయోగించినట్లు తెలుస్తోంది.

Bajaj Pulsar 250 టీజర్ లాంచ్.. అక్టోబర్ 28 నుండి సేల్స్ షురూ..

కొత్త పల్సర్ 250 రోడ్ బైక్ కాబట్టి, ఇది స్టైలిష్ అల్లాయ్ వీల్స్ మరియు ట్యూబ్‌లెస్ / రేడియల్ టైర్లను పొందుతుంది. ఈ పల్సర్ 250 బైక్ లో ప్రధానమైన మార్పు దాని ముందు భాగంలో కనిపిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ముందు భాగంలో ఉన్న హెడ్‌ల్యాంప్‌లకు ఇరువైపులా కంపెనీ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను కూడా ఆఫర్ చేయనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Bajaj pulsar 250 teaser out official launch on october 28 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X