Pulsar 250 vs Dominar 250: డిజైన్, ఫీచర్లు, ఇంజన్ మరియు ధరల కంపారిజన్

బజాజ్ ఆటో తమ పాపులర్ పల్సర్ సిరీస్‌లో కొత్తగా రెండు 250సిసి బైక్స్ (ఎన్250 మరియు ఎఫ్250) మోడళ్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. బజాజ్ తొలిసారిగా తమ పల్సర్ బ్రాండ్ మోటార్‌సైకిల్ సుమారు 20 ఏళ్ల క్రితం భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి కంపెనీ తమ పల్సర్ బ్రాండ్‌ని క్రమ విస్తరిస్తూ, ఇప్పుడు ఇందులో అనేక రకాల మోడళ్లను వివిధ రకాల ఇంజన్ సామర్థ్యాలతో విక్రయిస్తోంది. బజాజ్ ఆటో సంస్థకు ఇప్పుడు పల్సర్ అనేది చాలా కీలకమైన బ్రాండ్ గా అవతరించింది.

Pulsar 250 vs Dominar 250: డిజైన్, ఫీచర్లు, ఇంజన్ మరియు ధరల కంపారిజన్

ప్రస్తుతం, పల్సర్ సిరీస్ లో 125 సిసి మొదలుకొని 250 సిసి వరకూ అనేక రకాల వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 250 సిసి మోడళ్లను కంపెనీ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసింది. బజాజ్ పల్సర్ లో మరింత శక్తివంతమైన స్పోర్టీ వేరియంట్లను కోరుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని కంపెనీ ఈ పల్సర్ ఎన్250 (Pulsar N250) మరియు పల్సర్ ఎఫ్250 (Pulsar F250) మోడళ్లను ప్రవేశపెట్టింది.

Pulsar 250 vs Dominar 250: డిజైన్, ఫీచర్లు, ఇంజన్ మరియు ధరల కంపారిజన్

కొత్త పల్సర్ 250 బైక్ లు బజాజ్ పల్సర్ చరిత్రలోనే ఓ కొత్త అధ్యాయానికి పునాది వేశాయని చెప్పవచ్చు. కంపెనీ వీటిని కొత్త ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్‌పై ఆధారంగా తయారు చేసింది. ఇవి పూర్తిగా కొత్త డిజైన్ శైలిని కలిగి ఉంటాయి. ఈ కొత్త పల్సర్ శ్రేణి మోటార్‌సైకిళ్లను రీట్యూన్ చేయబడిన 250 సిసి ఇంజన్‌తో పరిచయం చేశారు. వాస్తవానికి, ఇదే ఇంజన్ ను కంపెనీ అందిస్తున్న బజాజ్ డొమినార్ 250 (Bjaja Dominar 250) లో కూడా ఉపయోగిస్తున్నారు.

Pulsar 250 vs Dominar 250: డిజైన్, ఫీచర్లు, ఇంజన్ మరియు ధరల కంపారిజన్

ఇంజన్ పరంగా పల్సర్ 250 మరియు డొమినార్ 250 మోడళ్లు రెండూ ఒకేలా ఉన్నప్పటికీ, డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ఇవి రెండూ వేర్వేరుగా ఉంటాయి. మరి ఈ కొత్త పల్సర్ 250 బైకులు డొమినార్ 250 నుండి ఎలా విభిన్నంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..!

Bajaj Pulsar 250 vs Bajaj Dominar 250: డిజైన్

కొత్త బజాజ్ పల్సర్ 250 సిరీస్‌లో F250 సెమీ-ఫైర్డ్ బైక్ అయితే, N250 ఒక నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ స్టైల్ బైక్. కాగా, బజాజ్ డొమినార్ 250 అనేది టూరింగ్-ఓరియెంటెడ్ బైక్, ఇది చూడటానికి దాని బిగ్ బ్రదర్ డొమినార్ 400 ను పోలి ఉంటుంది. ఇదివరకు చెప్పుకున్నట్లుగా పల్సర్ 250 బైక్‌లను ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్‌పై నిర్మించారు. వీటిలో N250 బరువు 162 కిలోలుగా ఉంటే, మరియు F250 164 కిలోలుగా ఉంటుంది. బజాజ్ డొమినార్ 250 180 కిలోగ్రాముల బరువు ఉంటుంది దీనిని బీమ్ పెరిమీటర్ ఫ్రేమ్‌పై నిర్మించారు.

Pulsar 250 vs Dominar 250: డిజైన్, ఫీచర్లు, ఇంజన్ మరియు ధరల కంపారిజన్

డిజైన్ విషయానికి వస్తే, భారతదేశంలో బజాజ్ డొమినార్ ను తొలిసారిగా విడుదల చేసినప్పుడు, దాని 'పవర్-క్రూజర్' వైఖరి కారణంగా చాలా మంది దాని డిజైన్‌ను డుకాటి డయావెల్‌తో పోల్చారు. అంతేకాకుండా, బజాజ్ డొమినార్ 250 లో మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు చంకియర్-లుకింగ్ టెయిల్ సెక్షన్‌ కారణంగా, ఇది గాంభీరమైన లుక్ ని కలిగి ఉంటుంది.

Pulsar 250 vs Dominar 250: డిజైన్, ఫీచర్లు, ఇంజన్ మరియు ధరల కంపారిజన్

ఇక బజాజ్ 250 ట్విన్స్ (ఎన్250 మరియు ఎఫ్250) విషయయానికి వస్తే, ఇవి రెండూ కూడా ఇతర పల్సర్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే చాలా సాంప్రదాయిక డిజైన్‌ను కలిగి ఉంటాయి. వీటిపై షార్ప్ లైన్‌లు మరియు మరింత ట్రెడిషనల్‌గా కనిపించే వైఖరి ఉంటుంది. అయితే, సెమీ-ఫెయిరింగ్‌తో కూడిన కొత్త బజాజ్ ఎఫ్250 దాని నేక్డ్ కౌంటర్ బజాజ్ ఎన్250 కంటే కొంచెం పెద్దదిగా మరియు టూరింగ్-ఫ్రెండ్లీగా ఉన్నట్లు కనిపిస్తుంది.

Pulsar 250 vs Dominar 250: డిజైన్, ఫీచర్లు, ఇంజన్ మరియు ధరల కంపారిజన్

Bajaj Pulsar 250 vs Bajaj Dominar 250: ఫీచర్లు

ఈ రెండు బైక్‌లు కూడా ప్రధానంగా యవతను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టినవి కాబట్టి, వీటిలో కంపెనీ మంచి ఫీచర్లను జోడించింది. అయితే, కొత్తగా వచ్చిన బజాజ్ పల్సర్ 250 బైక్‌లు మాత్రం, ప్రస్తుతం మార్కెట్లో అత్యంత సరసమైన స్కూటర్లలో సైతం లభిస్తున్న బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌ను కోల్పోవడం కొంచెం విచారించదగిన విషయమే. ఇటీవలి కాలంలో టూవీలర్లలో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ ఓ సర్వసాధారమైన ఫీచర్‌గా మారిన విషయం తెలిసినదే. అలాంటిది, ఇంత ఖరీదైన పల్సర్ బైక్‌లలో కంపెనీ ఈ ఫీచర్‌ను అందించడం లేదు.

Pulsar 250 vs Dominar 250: డిజైన్, ఫీచర్లు, ఇంజన్ మరియు ధరల కంపారిజన్

ఇకపోతే, కొత్త పల్సర్ 250 బైక్‌లు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన బై-ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో వస్తాయి. కాగా, డొమినార్ 250 ఎల్ఈడి పైలట్ ల్యాంప్‌లతో కూడిన పూర్తి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌తో వస్తుంది. ఏదేమైనప్పటికీ, ఇవి రెండూ కూడా చీకటిలో తగినంత కాంతిని అందించగలవు.

Pulsar 250 vs Dominar 250: డిజైన్, ఫీచర్లు, ఇంజన్ మరియు ధరల కంపారిజన్

కొత్త బజాజ్ పల్సర్ 250 ట్విన్స్‌లో, టాకోమీటర్, స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ఇండికేటర్, సర్వీస్ రిమైండర్, గేర్-పొజిషన్ ఇండికేటర్, డిస్టెన్స్-టు-ఎంప్టీ ఫ్యూయల్ గేజ్, క్లాక్ మొదలైన ఫీచర్లను తెలియజేసే సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. అయితే, బజాజ్ డొమినార్ 250 మాత్రం పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. డొమినార్ 250 లో కూడా బ్లూటూత్ కనెక్టివీ ఫీచర్ లేకపోవడం గమనార్హం.

Pulsar 250 vs Dominar 250: డిజైన్, ఫీచర్లు, ఇంజన్ మరియు ధరల కంపారిజన్

Bajaj Pulsar 250 vs Bajaj Dominar 250: ఇంజన్

కొత్త బజాజ్ పల్సర్ F250 మరియు N250 బైక్‌లు 250 సిసి ఆయిల్ కూల్డ్ ఇంజన్‌తో లభిస్తాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 24 బిహెచ్‌పి పవర్‌ను మరియు 21.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్పర్ అసిస్ట్ క్లచ్‌తో కూడిన 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇక బజాజ్ డొమినార్ 250 విషయానకి వస్తే, ఇందులో 248.77 సిసి లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 26.6 బిహెచ్‌పి పవర్‌ను మరియు 23.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జచచేయబడి ఉంటుంది.

Pulsar 250 vs Dominar 250: డిజైన్, ఫీచర్లు, ఇంజన్ మరియు ధరల కంపారిజన్

ఈ రెండు ఇంజన్లను పోల్చిచూస్తే, పల్సర్ 250 బైక్‌ల కన్నా డొమినార్ 250 మెరుగైన (లిక్విడ్-కూల్డ్) మరియు మరింత శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉంది. అదనంగా, ఇది ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయంలో డొమినార్ 250 పల్సర్ 250 ట్విన్స్‌ను అధిగమించినట్లు అనిపించవచ్చు, కానీ 180 కిలోల బరువుతో, బజాజ్ డొమినార్ 250 బజాజ్ పల్సర్ ఎన్250 కంటే దాదాపు 18 కిలోలు ఎక్కువ బరువును మరియు బజాజ్ పల్సర్ ఎఫ్250 కంటే 16 కిలోలు ఎక్కువ బరువును కలిగి ఉందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.

Pulsar 250 vs Dominar 250: డిజైన్, ఫీచర్లు, ఇంజన్ మరియు ధరల కంపారిజన్

Bajaj Pulsar 250 vs Bajaj Dominar 250: మెకానికల్స్

బజాజ్ పల్సర్ F250 మరియు N250 బైక్‌లు రెండూ కూడా ముందు వైపు 37 మిమీ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక వైపు నైట్రోక్స్ మోనో షాక్‌ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ రెండు మోడళ్లలో ముందు వైపు 300 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 230 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి రెండూ సింగిల్ ఛానల్ ఏబిఎస్‌ను స్టాండర్డ్‌గా సపోర్ట్ చేస్తాయి.

Pulsar 250 vs Dominar 250: డిజైన్, ఫీచర్లు, ఇంజన్ మరియు ధరల కంపారిజన్

బజాజ్ డొమినార్ 250 విషయానకి వస్తే, ఇందులో కూడా ముందు వైపు 37 మిమీ ఇన్‌వెర్టెడ్ ఫోర్క్‌లు మరియు వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ ఉంటాయి. బ్రేకింగ్ సెటప్‌ను గమనిస్తే, ముందు వైపు 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 230 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి రెండ కూడా డ్యూయల్-ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి. బ్రేకింగ్ పరంగా పల్సర్ 250 మోడళ్లను డొమినార్ 250 డామినేట్ చేస్తుందని చెప్పొచ్చు.

Pulsar 250 vs Dominar 250: డిజైన్, ఫీచర్లు, ఇంజన్ మరియు ధరల కంపారిజన్

Bajaj Pulsar 250 vs Bajaj Dominar 250: ధర

చివరిగా ధరలను గమనిస్తే, ప్రస్తుతం మార్కెట్లో బజాజ్ డొమినార్ 250 ధర రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. కాగా, బజాజ్ పల్సర్ ఎన్250 ధర రూ. 1.38 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మరియు బజాజ్ పల్సర్ ఎఫ్250 ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. ధర పరంగా చూస్తే, పల్సర్ N250 కంటే బజాజ్ డామినార్ 250 ధర సుమారు రూ. 21,000 ఎక్కువగా ఉంటుంది. అయితే, డొమినార్ 250లో ఈ ధరను తగిన ఫీచర్లు మాత్రం లభిస్తాయని చెప్పొచ్చు.

Most Read Articles

English summary
Bajaj pulsar 250 vs bajaj dominar 250 design features engine price comparison
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X