కంపారిజన్: బజాజ్ పల్సర్ 250 vs యమహా ఎఫ్‌జెడ్250 vs సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) ఇటీవలే మార్కెట్లో పల్సర్ ఎన్250 (Pulsar N250) మరియు పల్సర్ ఎఫ్250 (Pulsar F250) అనే రెండు మోటార్‌సైకిళ్లను విడుదల చేసిన సంగతి తెలిసినదే. ప్రధానంగా, యువతను లక్ష్యంగా చేసుకొని బజాజ్ ఈ రెండు మోడళ్లను ప్రవేశపెట్టింది.

కంపారిజన్: బజాజ్ పల్సర్ 250 vs యమహా ఎఫ్‌జెడ్250 vs సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250

ఈ కొత్త తరం 250 సిసి పల్సర్ బైక్ లలో పల్సర్ ఎన్250 అనేది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పల్సర్ ఎన్ఎస్200 (Pulsar NS200) మాదిరిగా నేక్డ్ వెర్షన్ కాగా, పల్సర్ ఎఫ్250 బైక్ అనేది ఇదివరకటి పల్సర్ 220ఎఫ్ (Pulsar 200F) మాదిరిగా ప్యానెళ్లతో నిండిన సెమీ-ఫెయిర్డ్ మోటార్‌సైకిల్. ఈ కొత్త 250 సిసి మోడళ్లు రెండూ కూడా ఈ విభాగంలో లభిస్తున్న ఇతర 250 సిసి బైక్ లతో పోటీ పడుతాయి.

కంపారిజన్: బజాజ్ పల్సర్ 250 vs యమహా ఎఫ్‌జెడ్250 vs సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250

కొత్త బజాజ్ పల్సర్ 250 మోడళ్లు ఈ విభాగంలో యమహా ఎఫ్‌జెడ్25 (Yamaha FZ25) మరియు సుజుకి జిక్సర్ 250 (Suzuki Gixxer 250) వంటి మోడళ్లతో నేరుగా పోటీ పడుతాయి. ఈ రెండింటిలో యమహా ఎఫ్‌జెడ్25 నేక్డ్ మోటార్‌సైకిల్ కాబట్టి, ఇది పల్సర్ ఎన్250 బైక్‌కి సరైన పోటీదారు అవుతుంది. అలాగే, సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250 బైక్ కు పోటీగా పల్సర్ ఎఫ్250 సెమీ ఫెయిర్డ్ బైక్ ఉంటుంది.

కంపారిజన్: బజాజ్ పల్సర్ 250 vs యమహా ఎఫ్‌జెడ్250 vs సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250

మరి ఈనాటి కథనంలో కొత్త బజాజ్ పల్సర్ 250 ఈ విభాగంలోని యమహా ఎఫ్‌జెడ్25 మరియు సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250 మోడళ్లతో ఏవిధంగా పోటీ పడుతుంది, ఈ రెండి మోడళ్ల మధ్య ప్రధాన తేడాలు మరియు సారూప్యతలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

కంపారిజన్: బజాజ్ పల్సర్ 250 vs యమహా ఎఫ్‌జెడ్250 vs సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250

బజాజ్ పల్సర్ 250 బైక్‌ల పూర్తి కొలతలు ఇంకా విడుదల కాలేదు. అయితే, ఈ కొత్త పల్సర్ బైక్‌లు 1351 మిమీ పొడవు గల వీల్‌బేస్‌ తో రూపొందించబడ్డాయి. వీల్‌బేస్ అనేది ముందు మరియు వెనుక చక్రాల మధ్య దూరం. వీల్‌బేస్ పరంగా చూస్తే, యమహా ఎఫ్‌జెడ్25 1340 మిమీ మరియు సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250 1360 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటాయి.

కంపారిజన్: బజాజ్ పల్సర్ 250 vs యమహా ఎఫ్‌జెడ్250 vs సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250

పల్సర్ 250 బైక్‌ల బరువును పోల్చి చూస్తే, పల్సర్ ఎన్250 బరువు 162 కిలోలు కాగా, యమహా ఎఫ్‌జెడ్25 బరువు 153 కిలోలుగా ఉంటుంది. తక్కువ బరువుతో కూడిన 250 సిసి నేక్డ్ బైక్ కావాలనుకునే వారు యమహా ఎఫ్‌జెడ్25 బైక్‌ను ఎంచుకోవచ్చు.

కంపారిజన్: బజాజ్ పల్సర్ 250 vs యమహా ఎఫ్‌జెడ్250 vs సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250

ఈ రెండు పల్సర్ 250 బైక్‌లను ట్యూబ్లర్ ఫ్రేమ్‌పై ఆధారపడి నిర్మించారు. కాగా, ఎఫ్‌జెడ్25 మరియు జిక్సర్ 250 మోడళ్లను డైమండ్ ఫ్రేమ్‌పై నిర్మించారు. ఇతర సాంకేతిక అంశాలను గమనిస్తే, 250 సిసి బైక్‌లు అన్నీ కూడా యూఎస్‌బి ఛార్జింగ్, ఎల్ఈడి హెడ్‌లైట్ మరియు టెయిల్‌లైట్ మరియు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను కలిగి ఉంటాయి.

కంపారిజన్: బజాజ్ పల్సర్ 250 vs యమహా ఎఫ్‌జెడ్250 vs సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250

కాకపోతే, ఈ నాలుగు మోటార్‌సైకిళ్లు కూడా ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా ఎలాంటి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లను అందించవు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, బజాజ్ ఆటో లేటెస్ట్ గా డిజైన్ చేసిన పల్సర్ 250 మోడళ్లలో కూడా ఇలాంటి స్మార్ట్ ఫీచర్ ను అందించకపోవడం. బజాజ్ ఆటో వీటిని సరసమైన ధరకే అందించాలనే ఉద్దేశ్యంతో, ఈ ఫీచర్లను ఆఫర్ చేయలేదనేది మా అభిప్రాయం.

కంపారిజన్: బజాజ్ పల్సర్ 250 vs యమహా ఎఫ్‌జెడ్250 vs సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250

అలాగే, ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను డిజిటల్ క్వాలిటీతో అందిస్తున్నారు, కొత్త పల్సర్ 250 బైక్‌లు సెమీ డిజిటల్ క్వాలిటీలో అందించబడతాయి. ఇంజన్ సెటప్ విషయానికి వస్తే, ఈ నాలుగు మోడళ్లు కూడా 249 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి. కానీ, వీటన్నింటిలో కంటే సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250 బైక్ గరిష్టంగా 26 బిహెచ్‌పి శక్తిని మరియు 22.2 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

కంపారిజన్: బజాజ్ పల్సర్ 250 vs యమహా ఎఫ్‌జెడ్250 vs సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250

ఈ సెగ్మెంట్లోని ఇతర మోడళ్లలోని ఇంజన్ సిస్టమ్‌లో 2-వాల్వ్ సెటప్ అందించబడింది. కానీ సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైక్‌ లో మాత్రం 4-వాల్వ్ సెటప్ ఉంటుంది. వీటిలో యమహా ఎఫ్‌జెడ్25 బైక్ ఇంజన్ గరిష్టంగా 20.8 పిఎస్ శక్తిని మరియు 20.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో వస్తుంది. కాగా, జిక్సర్ 250 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో వస్తుంది.

కంపారిజన్: బజాజ్ పల్సర్ 250 vs యమహా ఎఫ్‌జెడ్250 vs సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250

ఈ నాలుగు మోడళ్లలో ఫ్రంట్ సస్పెన్షన్‌లో పెద్దగా తేడాలేమీ లేవు. కానీ యమహా ఎఫ్‌జెడ్25 బైక్‌లో మాత్రమే వెనుక వైపు సస్పెన్షన్ 7-వే అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ లభిస్తుంది. కాబట్టి, ఈ 250 సిసి యమహా బైక్‌పై ప్రయాణ అనుభవం ఖచ్చితంగా మిగతా వాటితో పోలిస్తే భిన్నంగా ఉంటుంది.

కంపారిజన్: బజాజ్ పల్సర్ 250 vs యమహా ఎఫ్‌జెడ్250 vs సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250

ప్రయాణీకుల భద్రత కోసం ఎఫ్‌జెడ్25 మరియు జిక్సర్ 250 మోడళ్లలో డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ సేఫ్టీ ఫీచర్ అందించబడింది. కానీ కొత్త పల్సర్ 250 బైక్‌లు మాత్రం కేవలం సింగిల్-ఛానల్ ఏబిఎస్ తో మాత్రమే లభిస్తాయి.

కంపారిజన్: బజాజ్ పల్సర్ 250 vs యమహా ఎఫ్‌జెడ్250 vs సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250

ఇక చివరిగా ధరలను గమనిస్తే, బజాజ్ పల్సర్ 250 బైక్‌ల ధరు రూ. 1.38 లక్షల నుంచి రూ. 1.40 లక్షల మధ్యలో ఉంటాయి. అలాగే, యమహా ఎఫ్‌జెడ్25 బైక్ ధరలు రూ. 1.36 లక్షల నుండి రూ. 1.42 లక్షల మధ్యలో ఉంటాయి. కాగా సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్250 బైక్ ధరలు రూ. 1.71 లక్షల నుండి రూ. 1.84 లక్షల మధ్యలో ఉంటాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

Most Read Articles

English summary
Bajaj pulsar 250 vs yamaha fz25 vs suzuki gixxer sf250 comparison
Story first published: Saturday, October 30, 2021, 16:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X