Bajaj Pulsar N250 vs F250: ఈ రెండు బైకులలో ఉన్న తేడాలేంటి.. మీకు తెలుసా..!!

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బజాజ్ ఆటో (Bajaj Auto) కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో రెండు కొత్త బైకులను విడుదల చేసింది. ఇందులో ఒకటి Pulsar N250 బైక్ కాగా, మరొకటి Pulsar F250. ఈ బైకులు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఈ రెండు బైకులు ఒకే కంపెనీ తయారు చేసినప్పటికీ కొన్ని తేడాలు లేకపోలేదు. అయితే ఈ కొత్త Pulsar N250 మరియు Pulsar F250 మధ్య తేడాలేంటి అనే విషయాలను పూర్తిగా ఇక్కడ తెలుసుకుందాం.

Bajaj Pulsar N250 vs F250: ఈ రెండు బైకులలో ఉన్న తేడాలేంటి.. మీకు తెలుసా..!!

భారతీయ మార్కెట్లో ఈ రెండు బైకులతో Pulsar N250 అనేది ఒక నేక్డ్ మోడల్, అయితే Pulsar F250 అనేది సెమీ ఫెయిర్డ్ బైక్. ఇవి రెండూ కూడా చాలా స్టైలిష్ గా చూడగానే ఆకర్షించే విధంగా ఉన్నాయి.

Bajaj Pulsar N250 vs F250: ఈ రెండు బైకులలో ఉన్న తేడాలేంటి.. మీకు తెలుసా..!!

డిజైన్:

Bajaj Pulsar N250 మరియు Pulsar F250 యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇవి అధునాతన డిజైన్ కలిగి ఉంటాయి. F250 బైక్ యొక్క ముందు భాగం ఫిక్స్‌డ్ హెడ్‌లైట్ పొజిషన్‌తో సెమీ ఫెయిర్‌గా ఉంచబడింది. ఇది పల్సర్ 220ఎఫ్‌లో కనిపించే విధంగానే ఉంటుంది. అంతే కాకూండా ఎల్ఈడీ ప్రొజెక్టర్ యూనిట్ హెడ్‌లైట్ క్లస్టర్ మధ్యలో ఉంచబడింది, మరియు హై బీమ్ మరియు లో బీమ్ కూడా ఒకే విధంగా విలీనం చేయబడ్డాయి. ఎగువ భాగంలో, రివర్స్-బూమరాంగ్ మరియు LED DRLలు కుడి మరియు ఎడమ వైపున ఉంచబడ్డాయి. విజర్ హెడ్‌లైట్ పైన ఉంచబడుతుంది. ఇది ముందు నుంచి వచ్చే గాలిని కొంతవరకు నిరోధించగలదు.

Bajaj Pulsar N250 vs F250: ఈ రెండు బైకులలో ఉన్న తేడాలేంటి.. మీకు తెలుసా..!!

ఇక Bajaj Pulsar N250 డిజైన్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో షార్ప్ మరియు స్టైలిష్ హెడ్‌లైట్ యూనిట్ ఇవ్వబడింది. హెడ్‌లైట్ క్లస్టర్ మధ్యలో LED ప్రొజెక్టర్ ఇవ్వబడింది. దీనితో పాటు LED DRLలు రెండు వైపులా ఇవ్వబడ్డాయి మరియు అనలాగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ హెడ్‌లైట్ పైన ఉంచబడింది. వెనుక భాగం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

మొత్తానికి ఈ రెండు బైకుల డిజైన్ అద్భుతంగా మరియు ఆకర్షనీయంగా ఉండి, తమకు తామే సాటి అని నిరూపిస్తున్నాయి.

Bajaj Pulsar N250 vs F250: ఈ రెండు బైకులలో ఉన్న తేడాలేంటి.. మీకు తెలుసా..!!

ధర:

భారతీయ విఫణిలో విడుదలైన ఈ కొత్త బైక్ యొక్క ధరల విషయానికి వస్తే,

Bajaj Pulsar N250 ధర రూ. 1.38 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Bajaj Pulsar F250 ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Bajaj Pulsar N250 vs F250: ఈ రెండు బైకులలో ఉన్న తేడాలేంటి.. మీకు తెలుసా..!!

సీటింగ్ పొజిషన్:

సాధారణంగా ఏ బైకులో అయినా సీటింగ్ పొజిషన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు రైడర్ కి అనుకూలంగా ఉంటేనే రైడర్ అద్భుతమైన రైడింగ్ అనుభూతిని పొందగలడు.

కంపెనీ యొక్క Bajaj Pulsar F250 బైక్ లో క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్‌ ఉంటుంది, కావున సీటింగ్ పొజిషన్ నిటారుగా ఉంటుంది. అంటే రైడర్ ఈ బైక్ రైడ్ చేసేటప్పుడు నిటారుగా కూర్చోవచ్చు.

Bajaj Pulsar N250 vs F250: ఈ రెండు బైకులలో ఉన్న తేడాలేంటి.. మీకు తెలుసా..!!

ఇక Bajaj Pulsar N250 బైక్ విషయానికి వస్తే, ఇందులో సింగిల్ పీస్ బార్ హ్యాండిల్ ఇవ్వబడింది. ఈ కారణంగా సీటింగ్ పొజిషన్ చాలా దూకుడుగా ఉంటుంది. కావున రైడర్ కొంచెం వంగి కూర్చోవలసి ఉంటుంది. అయితే మొత్తానికి ఈ రెండు బైకుల సీటింగ్ పొజిషన్ సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో కూడా రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది.

Bajaj Pulsar N250 vs F250: ఈ రెండు బైకులలో ఉన్న తేడాలేంటి.. మీకు తెలుసా..!!

Bajaj Pulsar F250 బైక్ లో లెన్స్ కొద్దిగా కప్పబడి ఉంటుంది. కానీ Bajaj Pulsar N250 బైక్ లో మాత్రం ప్రొజెక్టర్ లెన్స్ తెరిచి ఉంటుంది, దీని కారణంగా ఇది ప్రోట్రూషన్ లాగా కనిపిస్తుంది. కానీ ఆకర్షనీయంగా ఉంటాయి.

Bajaj Pulsar N250 vs F250: ఈ రెండు బైకులలో ఉన్న తేడాలేంటి.. మీకు తెలుసా..!!

బజాజ్ పల్సర్ 250 బరువు:

బైకుల యొక్క సామర్థ్యం అనేది కొంతవరకు దాని బరువు మీద కూడా ఆధారపడి ఉంటుంది. కావున చాలా కంపెనీలు ఇటీవల కాలంలో వాటి మునుపటి మోడల్స్ కంటే తక్కువ బరువుతో బైకులను విడుదల చేస్తున్నారు.

Bajaj Pulsar N250 vs F250: ఈ రెండు బైకులలో ఉన్న తేడాలేంటి.. మీకు తెలుసా..!!

కొత్త బజాజ్ పల్సర్ 250 బైక్స్ విషయానికి వస్తే, Bajaj Pulsar F250 బరువు 164 కేజీల అరకు ఉంటుంది. అదేవిధంగా Bajaj Pulsar N250 బైక్ బరువు 162 కేజీల అరకు ఉంటుంది. అంటే Pulsar N250 బరువు దాని Pulsar F250 బరువుకంటే కూడా 2 కేజీలు తక్కువగా ఉంటుంది.

Bajaj Pulsar N250 vs F250: ఈ రెండు బైకులలో ఉన్న తేడాలేంటి.. మీకు తెలుసా..!!

భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త బజాజ్ పల్సర్ 250 బైకులలో, Bajaj Pulsar F250 ఎక్కువ దూరం ప్రయాణించేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక Bajaj Pulsar N250 బైక్ నగరంలో రైడింగ్ చేసేవారికి, మరియు చిన్న చిన్న రోడ్లపైన ప్రయాణించేవారికి లేదా రోజువారీ ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Bajaj Pulsar N250 vs F250: ఈ రెండు బైకులలో ఉన్న తేడాలేంటి.. మీకు తెలుసా..!!

Bajaj Pulsar 250 బైక్స్ కేవలం రెండు కలర్ ఆప్సన్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అవి రేసింగ్ రెడ్ మరియు టెక్నో గ్రే కలర్స్. ఈ రెండు కలర్స్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే టెక్నో గ్రే కలర్ బైక్ మాత్రం చాలా మెరుగ్గా మరియు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Most Read Articles

English summary
Bajaj pulsar n250 vs pulsar f250 differences design handling price details
Story first published: Saturday, November 6, 2021, 12:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X