బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 విడుదల; ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

ప్రముఖ దేశీయ టూవీలర్ బ్రాండ్ బజాజ్ ఆటో, భారత మార్కెట్లో విక్రయిస్తున్న పల్సర్ సిరీస్‌లో కంపెనీ తాజాగా మరో కొత్త మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 పేరుతో కంపెనీ ఓ సరికొత్త స్పోర్టీ వెర్షన్ 125సీసీ పల్సర్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 విడుదల; ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

భారత మార్కెట్లో ఈ కొత్త 2021 బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 మోటార్‌సైకిల్ ధర రూ.93,690 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. బజాజ్ పల్సర్ ఎన్ఎస్ (నేక్డ్ స్ట్రీట్) మోటార్‌సైకిల్ సిరీస్‌లో ఇదే అత్యంత సరసమైన మరియు తక్కువ సీసీ కలిగిన బైక్. ప్రత్యేకించి యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకొని కంపెనీ ఈ బైక్‌ను ప్రవేశపెట్టింది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 విడుదల; ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ సిరీస్‌లో కంపెనీ ఇప్పటికే పల్సర్ ఎన్ఎస్160 మరియు ఎన్ఎస్200 మోడళ్లను విక్రయిస్తోంది. మార్కెట్లో వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ.1.11 లక్షలు మరియు రూ.1.35 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఇప్పుడు కొత్తగా పల్సర్ ఎన్ఎస్125 వచ్చి చేరింది.

MOST READ:భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; కఠినమైన రూల్స్, వీటికి మాత్రమే మినహాయింపు

బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 విడుదల; ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 మోటార్‌సైకిల్‌లో బిఎస్6 కంప్లైంట్ 125సిసి డిటిఎస్-ఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 12 బిహెచ్‌పి పవర్‌ను మరియు ఈ విభాగంలోనే గరిష్టంగా 11 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్క ఇంజన్ మార్పు మినహా, డిజైన్ పరంగా ఇది చూడటాని అచ్చం పల్సర్ ఎన్ఎస్160 మాదిరిగానే ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 విడుదల; ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 మోడల్‌ను పెరిమీటర్ ఫ్రేమ్‌ను ఉపయోగించి తయారు చేశారు. ఇందులో ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని నైట్రోక్స్ మోనో షాక్ అబ్జార్బర్ అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు కూడా మంచి స్థిరత్వాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

MOST READ:మన హైదరాబాద్‌లో.. రెంట్ కట్టు నచ్చిన కారులో షికారు కొట్టు

బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 విడుదల; ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

ఈ బైక్ ముందు భాగంలో 80 / 100-17 సెక్షన్ టైర్ మరియు వెనుక భాగంలో 100 / 90-17 సెక్షన్ టైర్‌ను ఉపయోగించారు. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు 240 మిమీ డిస్క్ మరియు వెనుకవైపు 130 మిమీ డ్రమ్ బ్రేక్‌ను ఉపయోగించారు. అదే పల్సర్ ఎన్ఎస్160 మోడల్‌లో అయితే, వెనుక వైపు డిస్క్ బ్రేక్ లభిస్తుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 విడుదల; ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 బరువు 144 కిలోల బరువును కలిగి ఉంటుంది. ఇది పల్సర్ ఎన్ఎస్160 మోడల్ కన్నా 7 కిలోలు తేలికైనది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 179 మిమీ, సీట్ ఎత్తు 805 మిమీ మరియు వీల్‌బేస్ 1,353 మిమీగా ఉంటుంది.

MOST READ:అదిరిపోయే లుక్‌లో ఉన్న మాడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్; వివరాలు

బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 విడుదల; ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

డిజైన్ విషయానికి వస్తే బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 దాని బిగ్ బ్రదర్స్ మాదిరిగాన ఒకేరకమైన డిజైన్ స్టైల్‌ను కలిగి ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్, బాడీ ప్యానెల్స్, ఇంజన్ కౌల్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్, స్ప్లిట్ స్టైల్ సీట్ వంటి అన్ని డిజైన్ ఎలిమెంట్స్ చూడటానికి పల్సర్ ఎన్ఎస్160, ఎన్ఎస్200 మోడళ్ల మాదిరిగానే ఉంటాయి.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 విడుదల; ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

ధర పరంగా చూస్తే బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 బైక్‌ను రూ.93,690 ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేశారు. ఇది పల్సర్ ఎన్ఎస్160 ధర కన్నా రూ.16,000 తక్కువగా ఉంటుంది. అలాగే, స్టాండర్డ్ బజాజ్ పల్సర్ 125 ధర కన్నా రూ.20,000 ఎక్కువగా ఉంటుంది.

MOST READ:ఒకే ఛార్జ్‌తో 100 కి.మీ వెళ్లగల ఎలక్ట్రిక్ సైకిల్ ఇప్పుడు భారత్‌లో; ధర & వివరాలు

Most Read Articles

English summary
Bajaj Auto Launches Pulsar NS125 In India; Price, Specs And Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X