బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!

ప్రముఖ దేశీయ టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో, భారత మార్కెట్లో విక్రయిస్తున్న పల్సర్ రేంజ్ మోటార్‌సైకిళ్లు మంచి స్పోర్టీ డైనమిక్స్‌కు ప్రసిద్ధి చెందిన మోడళ్లు. బజాజ్ పల్సర్ సిరీస్‌లో అత్యంత పాపులర్ అయిన మోడళ్లలో ఒకటైన పల్సర్ ఎన్ఎస్ 160 మోడల్ ఇటీవల ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 ఇటీవల నో-హ్యాండ్స్ వీలీతో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఈ రికార్డుతో ఇప్పుడు ఈ బైక్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఎస్సిఐ) లో స్థానం దక్కించుకుంది. ఈ ఘనతను సాధించిన వ్యక్తి హృషికేష్ మాండ్కే.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!

నో-హ్యాండ్స్ వీలీ అంటే, బైక్‌ని వెనుక చైక్రంపై గాలిలోకి లేపిన తర్వాత కొంత దూరం పాటు హ్యాండిల్ బార్‌ను పట్టుకోకుండా బైక్‌ను కంట్రోల్ చేస్తూ రైడ్ చేయటం. హృషికేష్ మాండ్కే ఈ స్టంట్ కోసం స్టాక్ మోడల్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 మోడల్‌ను ఉపయోగించారు.

MOST READ:బజాజ్ ఆటో లాంచ్ చేసిన కొత్త బైక్; పూర్తి వివరాలు

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!

అయితే, ఈ బైక్‌లో వీలీకి అనువుగా ఉండేందుకు గాను వెనుక పిలియన్ రైడర్ సీటులో స్వల్ప మార్పు చేశారు. పిలియన్ రైడర్ సీట్ ఎత్తును బాగా పెంచారు. దీని వలన రైడర్ వీలీ చేసేటప్పుడు వెనుకకు పడిపోకుండా ఉండటం సాధ్యమవుతుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!

హృషికేష్ మాండ్కే మొత్తం 186.8 మీటర్ల దూరం పాటు చేతులతో హ్యాండిల్ బార్‌ను ముట్టుకోకుండా నో-హ్యాండిల్ వీలీ చశారు. గతంలో ఈ రికార్డు కోసం నెలకొల్పడిన దూరం కేవలం 89 మీటర్లు మాత్రమే. ఇప్పుడు ఈ ప్రపంచ రికార్డును హృషికేష్ మాండ్కే పల్సర్ ఎన్ఎస్ 160తో బ్రేక్ చేశారు.

MOST READ:చిట్టి చిట్టి రోబో కాదు, పిజ్జా డెలివరీ రోబో, తెలుసా.. అయితే ఇది చూడండి

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!

హృషికేష్ మాండ్కే ఇటీవల భారతదేశంలో ఫాస్టెస్ట్ క్వార్టర్-మైల్ వీలీ రికార్డును కూడా నెలకొల్పిన విషయం తెలిసినదే. బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 బైక్‌తో అతను ఈ రికార్డు సాధించాడు. ఈ రికార్డుతో పల్సర్ ఎన్ఎస్200 బైక్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఎఫ్ఎమ్ఎస్‌సిఐ ఇండియన్ నేషనల్ రికార్డ్స్‌లోకి ప్రవేశించింది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!

ఈ పాపులర్ స్ట్రీట్-నేక్డ్ మోటార్‌సైకిల్‌తో అతను కేవలం 23.68 సెకన్లలోనే క్వార్టర్-మైల్ వీలీని పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. ఎఫ్‌ఎంఎస్‌సిఐ (ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా) నుండి వచ్చిన సీనియర్ ప్రతినిధులు మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి వచ్చిన ఒక న్యాయాధికారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

MOST READ:2021 టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ రివ్యూ.. భారత మార్కెట్లో పవర్‌పుల్ ఎస్‌యూవీ

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!

ఇదివరకు చెప్పుకున్నట్లుగా నో-హ్యాండ్స్ వీలీ కోసం ఉపయోగించిన బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 షోరూమ్ స్టాక్ కండిషన్‌లో ఉంటుంది. కాకపోతే, స్టంట్ చేసేటప్పుడు రోడ్డుపై గీతలు పడకుండా ఉండేందుకు దీని వెనుక నంబర్ ప్లేట్, వెనుక మడ్‌గార్డ్‌లను తొలగించారు.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!

కోవిడ్-19 నేపథ్యంలో ఈ కార్యక్రమ నిర్వాహకులు అవసరమైన అన్ని ప్రోటోకాల్స్‌ను పాటించారు. హాజరైన ప్రతి ఒక్కరి భద్రతను నిర్ధారించారు మరియు రైడర్‌కు అవసరమైన అన్ని భద్రతా పరికరాలు మరియు సేఫ్టీ గేర్లను కూడా అందించారు. ఈ స్టంట్‌లో పాల్గొన్న రైడర్ డాట్ మరియు ఇసిఇ సర్టిఫైడ్ హెల్మెట్‌తో పాటు సిఇ సర్టిఫైడ్ సేఫ్టీ గేర్‌ను ధరించాడు.

MOST READ:బ్రేకింగ్ న్యూస్; బెంగళూరులో తిరగాలంటే మీ బైక్‌కి ఇది తప్పని సరి.. లేకుంటే?

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!

ఈ స్టంట్‌లోని డేటాను ఏఆర్ఏఐ ధృవీకరించబడిన రేస్‌లాజిక్ విబాక్స్ పెర్ఫార్మెన్స్ బాక్స్ జిపిఎస్ - ఆధారిత డేటా లాగింగ్ పరికరాలను ఉపయోగించి రీడింగులను తీసుకున్నారు.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!

ఇక బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 విషయానికి వస్తే, ఇందులో 160.3 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 17.2 బిహెచ్‌పి శక్తిని మరియు 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 14.6 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!

ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో సర్దుబాటు చేయగల మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను ఉపయోగించారు. ఇందులో ముందు వైపు 260 మిమీ మరియు వెనుక వైపు 230 మిమీ డిస్క్ బ్రేక్‌లను ఉపయోగించారు.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!

ప్రయాణీకుల భద్రత కోసం ఇందులో సింగిల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా కంపెనీ అందిస్తుంది. మార్కెట్లో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 బైక్ ధర రూ.1.11 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఇది ఈ విభాగంలో టివిఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి, యమహా ఎఫ్‌జెడ్-ఎస్‌వి3, హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, సుజుకి జిక్సర్ వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది.

Most Read Articles

English summary
Bajaj Pulsar NS160 Breaks The Longest No-hands Wheelie World Record, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X