ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌కి కొత్త పల్సర్ 250 బైక్ ఫ్రీగా ఇవ్వనున్న బజాజ్.. కానీ ఒక్క షరతు.. అదేంటంటే?

భారతీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన బజాజ్ ఆటో (Bajaj Auto) ఇటీవల కాలంలో తన పల్సర్ 250సీసీ బైక్ శ్రేణిని విడుదల చేసింది. కంపెనీ కొత్త పల్సర్ శ్రేణిని పల్సర్ ఎఫ్250 మరియు ఎన్250 అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది. పల్సర్ ఎఫ్250 బైక్ సెమీ ఫెయిర్డ్ బైక్ అయితే పల్సర్ ఎన్250 అనేది నేక్డ్ లుక్‌లో అందించబడుతుంది. ఈ బైక్స్ విడుదలైనప్పటినుంచి కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌కి పల్సర్ 250 బైక్ ఫ్రీగా ఇవ్వనున్న బజాజ్.. కానీ ఒక్క షరతు.. అదేంటంటే?

కంపెనీ ఈ బైకులను దేశవ్యాప్తంగా 2021 నవంబర్ 17 నుంచి డెలివరీ చేయడం ప్రారంభించింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Bajaj Pulsar N250 ధర రూ. 1.38 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అదే విధంగా Bajaj Pulsar F250 ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌కి పల్సర్ 250 బైక్ ఫ్రీగా ఇవ్వనున్న బజాజ్.. కానీ ఒక్క షరతు.. అదేంటంటే?

ఇదిలా ఉండగా, ఇటీవల, ఒక ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వినియోగదారు సరదాగా బజాజ్‌ని కొత్త పల్సర్ 250ని ఉంచితంగా ఇవ్వమని సోషల్ మీడియాలో అభ్యర్థించారు. అయితే కంపెనీ అతని కోరిక తీర్చాలని నిర్ణయించుకుంది. కానీ దీనికి కొన్ని షరతులను కూడా పెట్టింది. ఈ పోస్ట్ ని కనీసం 2,50,000 లైక్‌లను పొందినట్లయితే తప్పకుండా ఉచితంగా అందిస్తామని తెలిపింది.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌కి పల్సర్ 250 బైక్ ఫ్రీగా ఇవ్వనున్న బజాజ్.. కానీ ఒక్క షరతు.. అదేంటంటే?

అయితే ప్రస్తుతం దీనిని 4,000 మంది మాత్రమే లైక్‌ చేశారు. అయితే కంపెనీ తెలిపిన 2,50,000 లైకులు వచ్చిన తరువాత కంపెనీ అతనికి ఈ కొత్త బైక్ అందించే అవకాశం ఉంటుంది.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌కి పల్సర్ 250 బైక్ ఫ్రీగా ఇవ్వనున్న బజాజ్.. కానీ ఒక్క షరతు.. అదేంటంటే?

కొత్త బజాజ్ 250 బైక్స్ ఆధునిక డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ తో అందించబడుతున్నాయి. ఇందులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్ మరియు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ వంటివి అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ఈ బైక్ ముందు భాగం అగ్రెసివ్ లుక్ లో ఉంటుంది. ఈ బైక్ యొక్క ప్రధాన హెడ్‌లైట్‌కి రెండు వైపులా లైట్లు ఉన్నాయి

ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌కి పల్సర్ 250 బైక్ ఫ్రీగా ఇవ్వనున్న బజాజ్.. కానీ ఒక్క షరతు.. అదేంటంటే?

కొత్త Bajaj Pulsar 250 బైక్స్ అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ఇందులోని టాకోమీటర్ దాని మునుపటి మోడల్ నుంచి తీసుకోబడింది. ఐతే కాకుండా ఈ బైక్ డిజిటల్ స్క్రీన్ కూడా పొందుతుంది. ఈ స్క్రీన్ బైక్ యొక్క పరిధి, గేర్ పొజిషన్ మరియు డిస్టెన్స్ టూ ఎంప్టీ వాటి సమాచారాన్ని అందిస్తుంది. అంతే కాకుండా ఇప్పుడు ఈ కొత్త అప్డేటెడ్ బైకులలో USB ఛార్జింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ బైక్‌ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ ఇప్పుడు 14 లీటర్లు, మరియు సీటు ఎత్తు 795 మిమీ వరకు ఉంది. మొత్తానికి ఈ బైక్ స్టైలిష్ గా మరియు వాహన వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌కి పల్సర్ 250 బైక్ ఫ్రీగా ఇవ్వనున్న బజాజ్.. కానీ ఒక్క షరతు.. అదేంటంటే?

Bajaj Pulsar 250 యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 249.07 సిసి సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను అందించింది. ఇది 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 24.1 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 21.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌కి పల్సర్ 250 బైక్ ఫ్రీగా ఇవ్వనున్న బజాజ్.. కానీ ఒక్క షరతు.. అదేంటంటే?

Bajaj Pulsar యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ఇందులో టెలీస్కోపిక్ ఫోర్క్స్ మరియు కొత్త మోనోషాక్ సస్పెన్షన్ అమర్చబడి ఉంటుంది, కావున ఇది సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ బైక్ అసిస్ట్ మరియు స్లీపర్ క్లచ్‌తో కూడా వస్తుంది, కావున ఇది వేగవంతమైన గేర్‌షిఫ్ట్‌లలో సహాయపడుతుంది.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌కి పల్సర్ 250 బైక్ ఫ్రీగా ఇవ్వనున్న బజాజ్.. కానీ ఒక్క షరతు.. అదేంటంటే?

ఈ కొత్త బైక్స్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 230 మిమీ డిస్క్ బ్రేక్ ఇవ్వబడింది. అంతే కాకుండా ఇందులో సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ బైక్‌కు దాదాపు 165 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా లభిస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌కి పల్సర్ 250 బైక్ ఫ్రీగా ఇవ్వనున్న బజాజ్.. కానీ ఒక్క షరతు.. అదేంటంటే?

Bajaj Pulsar 250 ముందువైపు 100/80 ప్రొఫైల్ టైర్లను మరియు వెనుకవైపు 17-ఇంచెస్ వీల్స్ తో 130/70 ప్రొఫైల్‌ను పొందుతుంది. ఈ బైక్ ఇప్పుడు టెక్నో గ్రే మరియు రేసింగ్ రెడ్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ యొక్క పనితీరు మునుపటికంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌కి పల్సర్ 250 బైక్ ఫ్రీగా ఇవ్వనున్న బజాజ్.. కానీ ఒక్క షరతు.. అదేంటంటే?

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త పల్సర్ 250 బైక్స్, Suzuki Gixxer SF 250, Yamaha FZ 25, KTM 250 డ్యూక్ మరియు Husqvarna Vitpilen 250 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కొత్త బజాజ్ 250 బైక్స్ దేశీయ మార్కెట్లో కంపెనీ యొక్క అమాంకాలను మరింత పెంచడానికి దోహదాపడే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Bajaj to give free pulsar 250 to this instagram user but condition applied
Story first published: Sunday, December 5, 2021, 8:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X