బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు

ఇటాలియన్ ప్రీమియం టూవీలర్ బ్రాండ్ బెనెల్లీ, నేడు భారత మార్కెట్లో తమ సరికొత్త 502సి అర్బన్ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ ధర రూ.4.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు

బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ బైక్ తమ పాపులర్ ఇటాలియన్ డిజైనింగ్‌కు ఒక చక్కటి ఉదాహరణ అని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ అతి తక్కువ ప్యానెళ్లతో చాలా వరకూ నేక్డ్ మోటార్‌సైకిల్‌లా ఉంటుంది. ముందు వైపు నుండి చూస్తే ఈ బైక్ చాలా అగ్రెసివ్‌‌గా కనిపిస్తుంది.

బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు

ఈ క్రూయిజర్ బైక్‌ను బయటి నుండి కనిపించే ట్రేల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మించారు. కంపెనీ దీనిని క్రూయిజర్ బైక్ అని చెబుతున్నప్పటికీ, చూడటానికి ఇది నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్‌లా ఉంటుంది. ఈ బైక్‌లో చాలా తక్కువ సీటింగ్ స్పేస్ ఉంటుంది. బహుశా ఇది ఒక్క రైడర్ కోసం మాత్రమే డిజైన్ చేయబడినట్లుగా ఉంది.

బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు

తక్కువ సీట్ హైట్ కారణంగా బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ బైక్, రైడర్‌కు అల్ట్రా-కంఫర్టబుల్ రైడ్ అనుభూతిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో సింగిల్ పీస్ ఫ్లోటింగ్ సీట్ ఉంటుంది, దీని డిజైన్ చాలా ఏరోడైనమిక్‌గా ఉంటుంది.

బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు

ఈ బైక్‌లో మజిక్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, పూర్తి ఎల్‌ఈడి లైటింగ్, సౌకర్యవంతమైన సస్పెన్షన్ సెటప్, డబుల్ బారెల్ స్టీల్ ఎగ్జాస్ట్ పైప్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ యొక్క బాహ్య రూపకల్పన అన్ని వైపుల నుండి మజిక్యులర్‌గా కనిపిస్తుంది మరియు ఇది మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుంది.

బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు

ఇంజన్ విషయానికి వస్తే, ఈ బైక్‌లో శక్తివంతంమైన 502 సిసి ట్విన్ సిలిండర్, డిఓహెచ్‌సి ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 47.5 బిహెచ్‌పి శక్తిని మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 45 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో వాటర్ కూలింగ్ టెక్నాలజీ ఇవ్వబడింది.

బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు

బెనెల్లీ 502సి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి: మ్యాట్ కాగ్నాక్ రెడ్ మరియు మ్యాట్ బ్లాక్. ఈ బైక్‌పై దూర ప్రయాణాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఇందులో పెద్ద 21 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్‌ను ఏర్పాటు చేసింది. ఈ బైక్ 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది, ఇది తేలికపాటి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది.

బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు

ఈ బైక్‌లో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది మరియు అందులో స్పీడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయెల్ ఇండికేటర్‌తో సహా అనేక రకాల సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇంకా ఇందులో విస్తృతమైన హ్యాండిల్‌బార్‌తో పాటుగా ఫార్వర్డ్ సెట్ ఫుట్ పెగ్‌లు కూడా ఇవ్వబడ్డాయి.

బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు

మెకానికల్స్ విషయానికి వస్తే, బెనెల్లీ 502సి ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో సర్దుబాటు చేయగల మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. అలాగే, బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 280 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 240 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇవి రెండూ స్టాండర్డ్ డ్యూయెల్ ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ విడుదల: ధర, ఫీచర్లు

భారతదేశంలో బెనెల్లీ 502సి డెలివరీలు ఆగస్టు 4వ తేదీ నుండి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బెనెల్లీ ఇండియా అధికారిక డీలర్‌షిప్‌లలో ప్రారంభం కానున్నాయి. ఆసక్తిగల కస్టమర్లు రూ.10,000 టోకెన్ అమౌంట్‌ను చెల్లించి ఈ బైక్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కానీ లేదా సమీప బెనెల్లీ డీలర్‌షిప్‌లో కానీ ప్రీ-బుక్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Benelli Launches 502C Urban Cruiser Motorcycle In India; Price, Specs, Features And Engine Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X