Benelli ఆవిష్కరించిన కొత్త బైక్ Leoncino 125: భారత్‌కు వస్తుందా?

ప్రముఖ ద్విచక్ర వాహనతయారీ సంస్థ బెనెల్లీ (Benelli) ఇటలీలోని మిలాన్‌లో జరుగుతున్న EICMA మోటార్‌సైకిల్ షోలో కొత్త 2022 Benelli Leoncino 125 ప్రదర్శించింది. ఈ కొత్త మోటార్ సైకిల్ 2022 కాళ్ళ యూరోపియన్ మార్కెట్లో అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. EICMA మోటార్‌సైకిల్ షోలో ప్రదర్శించబడిన ఈ కొత్త బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Benelli ఆవిష్కరించిన కొత్త బైక్ Leoncino 125: భారత్‌కు వస్తుందా?

2022 Benelli Leoncino 125 బైక్ చూడచక్కగా చాలా ఆకర్షణీయంగా ఉంది.నివేదికల ప్రకారం ఈ బైక్ కేవలం యూరోపియన్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. అయితే భారతీయ మార్కెట్లో అడుగుపెడుతుందా.. లేదా అనేదాని మీద ఎటువంటి అధికారిక సమాచారం లేదు, కానీభారతీయ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం మాత్రం చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

Benelli ఆవిష్కరించిన కొత్త బైక్ Leoncino 125: భారత్‌కు వస్తుందా?

కొత్త 2022 Benelli Leoncino 125 బైక్ గ్రే మరియు గ్రీన్ కలర్ ఆప్సన్స్ లో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఈ బైక్ ఆధునిక డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. కావున ఈ బైక్ మార్కెట్లో మంచి ఆదరణ పొందే అవకాశం ఉంటుంది.

Benelli ఆవిష్కరించిన కొత్త బైక్ Leoncino 125: భారత్‌కు వస్తుందా?

బెనెల్లీ లియోన్‌సినో 125 బైక్ డిజైన్ విషయానికి వస్తే, ఇది దాని లియోన్‌సినో 250 మరియు బెనెల్లీ లియోన్‌సినో 125 మాదిరిగానే ఉంటుంది. కంపెనీ యొక్క ఈ బైకులు భారతీయ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. బెనెల్లీ లియోన్‌సినో 125 ఆకర్షణీయమైన రెట్రో-స్క్రాంబ్లర్ రూపాన్ని పొంది ఉంటుంది. ఈ బైక్ సైజులో చిన్నదే అయినా అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

Benelli ఆవిష్కరించిన కొత్త బైక్ Leoncino 125: భారత్‌కు వస్తుందా?

ఈ బైక్ BS6 అవతార్‌తో అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ లైట్‌తో ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ వంటివి ఉన్నాయి. బెనెల్లీ తన కొత్త డిజైన్ ఫిలాసఫీతో ఈ బైక్‌ను డిజైన్ చేసింది, ఇది ఆకర్షణీయమైన లుక్‌తో పాటు మంచి పనితీరుని కూడా అందిస్తుంది.

ఈ బైక్‌లోని 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 12.8 బిహెచ్‌పి పవర్ మరియు 10 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి పనితీరుని అందించడం వల్ల వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Benelli ఆవిష్కరించిన కొత్త బైక్ Leoncino 125: భారత్‌కు వస్తుందా?

ఈ బైక్‌ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, కంపెనీ ఈ బైక్ యొక్క ముందువైపు అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్‌ను అందించింది. అంతే కాకూండా ఈ బైక్ యొక్క ముందు మరియు వెనుక చక్రాల వద్ద ఒకే డిస్క్ బ్రేక్‌తో అమర్చబడి ఉంటుంది. బ్రేకింగ్‌ను మెరుగుపరచడానికి, కంపెనీ ఇందులో కాంబి బ్రేక్ సిస్టమ్‌ను అందించింది. కావున ఇవి చాలా షార్ప్ గా పనిచేస్తాయి.

Benelli ఆవిష్కరించిన కొత్త బైక్ Leoncino 125: భారత్‌కు వస్తుందా?

2022 Benelli Leoncino 125 బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. ఫ్రంట్ ఫెండర్ కూడా లయన్ మోటిఫ్‌ను పొందింది, ఇది బెనెల్లీ యొక్క పెద్ద ఇంజన్ బైక్‌లలో ఇవ్వబడింది. ఈ బైక్‌లో సింగిల్ పీస్ సీట్, సైడ్ స్లంగ్ ఎగ్జాస్ట్ మరియు రియర్ ఫెండర్ మౌంటెడ్ నంబర్ ప్లేట్ కూడా ఉన్నాయి. కావున ఇది చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది.

Benelli ఆవిష్కరించిన కొత్త బైక్ Leoncino 125: భారత్‌కు వస్తుందా?

బెనెల్లీ కంపెనీ భారతీయ మార్కెట్లో తన బైక్ శ్రేణిలో క్రూయిజర్, రెట్రో మరియు అడ్వెంచర్ బైక్‌లను చేర్చింది. కంపెనీ ఈ ఏడాది జూలైలో బెనెల్లీ 502సి బైక్ విడుదల చేసింది. ఈ క్రూయిజర్ బైక్ ఇటాలియన్ డిజైనింగ్‌కు ఒక ఉదాహరణ మరియు గొప్ప లుక్స్ మరియు అప్పీల్‌తో అందించబడింది. దేశీయ విపణిలో బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ ధర రూ.4.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Benelli ఆవిష్కరించిన కొత్త బైక్ Leoncino 125: భారత్‌కు వస్తుందా?

ఈ క్రూయిజర్ బైక్‌ను బయటి నుండి కనిపించే ట్రేల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మించారు. కంపెనీ దీనిని క్రూయిజర్ బైక్ అని చెబుతున్నప్పటికీ, చూడటానికి ఇది నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్‌లా ఉంటుంది. ఈ బైక్‌లో చాలా తక్కువ సీటింగ్ స్పేస్ ఉంటుంది. బహుశా ఇది ఒక్క రైడర్ కోసం మాత్రమే డిజైన్ చేయబడినట్లుగా ఉంది.

ఈ బైక్‌లో మజిక్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, పూర్తి ఎల్‌ఈడి లైటింగ్, సౌకర్యవంతమైన సస్పెన్షన్ సెటప్, డబుల్ బారెల్ స్టీల్ ఎగ్జాస్ట్ పైప్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ యొక్క బాహ్య రూపకల్పన అన్ని వైపుల నుండి మజిక్యులర్‌గా కనిపిస్తుంది మరియు ఇది మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుంది.

Benelli ఆవిష్కరించిన కొత్త బైక్ Leoncino 125: భారత్‌కు వస్తుందా?

ఇంజన్ విషయానికి వస్తే, ఈ బైక్‌లో శక్తివంతంమైన 502 సిసి ట్విన్ సిలిండర్, డిఓహెచ్‌సి ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 47.5 బిహెచ్‌పి శక్తిని మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 45 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో వాటర్ కూలింగ్ టెక్నాలజీ ఇవ్వబడింది.

Benelli ఆవిష్కరించిన కొత్త బైక్ Leoncino 125: భారత్‌కు వస్తుందా?

బెనెల్లీ 502సి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి: మ్యాట్ కాగ్నాక్ రెడ్ మరియు మ్యాట్ బ్లాక్. ఈ బైక్‌పై దూర ప్రయాణాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఇందులో పెద్ద 21 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్‌ను ఏర్పాటు చేసింది. ఈ బైక్ 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది, ఇది తేలికపాటి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది.

Benelli ఆవిష్కరించిన కొత్త బైక్ Leoncino 125: భారత్‌కు వస్తుందా?

బెనెల్లీ ఇండియా భారతదేశంలో 42 డీలర్‌షిప్‌లను నిర్వహిస్తోంది. కంపెనీ ఇటీవల జమ్మూలో తన 42 వ డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. బెనెల్లీ యొక్క ఈ జమ్మూ షోరూమ్ అత్యాధునిక సౌకర్యాలతో అమర్చబడింది. కంపెనీ క్లాసిక్ రెట్రో, అడ్వెంచర్ మరియు టూరర్ బైక్ రేంజ్ ఇందులో అందుబాటులోకి వచ్చింది. ఇంపీరియల్ 400, లియోన్సినో 125, టిఆర్‌కె 502, టిఆర్‌కె 502ఎక్స్ బైక్‌లు ఈ షోరూంలో అందుబాటులో ఉన్నాయి. మొత్తానికి భారాతీయ మార్కెట్లో కంపెనీ మంచి ఆదరణ పొందుతూ ముందుకు సాగుతోంది. రానున్న కాలంలో కంపెనీ మరిన్ని కొత్త బైకులను మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Benelli leoncino 125 unveiled at eicma engine features details
Story first published: Saturday, November 27, 2021, 9:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X