రైడింగ్‌కి సిద్దమవ్వండి.. బెనెల్లీ నుంచి కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 2.51 లక్షలు

ఇటాలియన్ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ బెనెల్లీ (Benelli) భారత మార్కెట్లో ఎట్టకేలకు తన కొత్త ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ 'బెనెల్లీ టిఆర్‌కె 251' (Benelli TRK 251) విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త మోటార్‌సైకిల్‌ ప్రారంభ ధర రూ. రూ. 2.51 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త బెనెల్లీ టిఆర్‌కె 251 బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

రైడింగ్‌కి సిద్దమవ్వండి..బెనెల్లీ నుంచి కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 2.51 లక్షలు

బెనెల్లీ కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త టిఆర్‌కె 251 బైక్ యొక్క ఫ్రీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభంమయ్యాయి. దీనికి కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 6,000 చెల్లించి కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో లేదా సమీపంలోని బెనెల్లీ ఇండియా డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చు. డెలివెరీలు రానున్న కొత్త సంవత్సరంలో ప్రారంభమవుతాయి.

రైడింగ్‌కి సిద్దమవ్వండి..బెనెల్లీ నుంచి కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 2.51 లక్షలు

కొత్త బెనెల్లీ TRK 251 బైక్ లో లియోన్సినో 250 కి శక్తినిచ్చే అదే ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది. ఇది 250 సిసి సింగిల్-సిలిండర్, 4-వాల్వ్ ఇంజన్‌ని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 25.5 బిహెచ్‌పి పవర్ మరియు 21.2 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

రైడింగ్‌కి సిద్దమవ్వండి..బెనెల్లీ నుంచి కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 2.51 లక్షలు

కొత్త బెనెల్లీ TRK 251 బైక్ సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు వైపున USD ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్బర్‌ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క రెండు చక్రాలలో డిస్క్ బ్రేక్‌లు ఇవ్వబడ్డాయి. కావున ఇవి దాని పనితీరును మరింత మెరుగ్గా చేయడానికి డ్యూయల్ ఛానెల్ ABSని కూడా పొందుతుంది.

రైడింగ్‌కి సిద్దమవ్వండి..బెనెల్లీ నుంచి కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 2.51 లక్షలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బెనెల్లీ TRK 251 ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఫుల్లీ డిజిటల్ LCD డిస్‌ప్లేను పొందుతుంది. ఇది డ్రైవర్‌కు వివిధ రైడ్ సంబంధిత సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఎంట్రీ-లెవల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా పొందుతుంది. కావున మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

రైడింగ్‌కి సిద్దమవ్వండి..బెనెల్లీ నుంచి కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 2.51 లక్షలు

ఈ కొత్త బైక్ పెద్ద 18 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది, కావున బైక్ రైడర్ సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ఇది సహకరిస్తుంది. కావున లాంగ్ రైడ్ చేయడానికి ఇది చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. ఇది మంచి ఇంధన సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది.

రైడింగ్‌కి సిద్దమవ్వండి..బెనెల్లీ నుంచి కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 2.51 లక్షలు

కొత్త బెనెల్లీ TRK 251 బైక్ గ్లోసీ బ్లాక్, గ్లోసీ గ్రే మరియు గ్లోసీ వైట్ అనే మూడు కలర్ ఆప్సన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ యొక్క సీటు ఎత్తు 800 మిమీ అరకు ఉంటుంది. అంతే కాకుండా దీని గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిమీ వరకు ఉంటుంది. కావున ఎలాంటి రహదారిలో అయిన రైడ్ చేయడానికి ఇది అనుమతిస్తుంది.

రైడింగ్‌కి సిద్దమవ్వండి..బెనెల్లీ నుంచి కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 2.51 లక్షలు

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త బెనెల్లీ TRK 251 బైక్ కెటిఎమ్ 250 అడ్వెంచర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మరియు సుజుకి వి-స్టార్మ్ 250 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. భారతీయ మార్కెట్లో బెనెల్లి కంపెనీ కొత్త బైక్ విడుదల చేసింది, అయితే ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుందనే విషయం త్వరలో తెలుస్తుంది.

రైడింగ్‌కి సిద్దమవ్వండి..బెనెల్లీ నుంచి కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 2.51 లక్షలు

ఇదిలా ఉండగా కంపెనీ 2021 జులై నెలలో దేశీయ విపణిలో బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ బైక్ విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.4.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది, కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

రైడింగ్‌కి సిద్దమవ్వండి..బెనెల్లీ నుంచి కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 2.51 లక్షలు

ఈ బైక్‌లో మజిక్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, పూర్తి ఎల్‌ఈడి లైటింగ్, సౌకర్యవంతమైన సస్పెన్షన్ సెటప్, డబుల్ బారెల్ స్టీల్ ఎగ్జాస్ట్ పైప్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ యొక్క బాహ్య రూపకల్పన అన్ని వైపుల నుండి మజిక్యులర్‌గా కనిపిస్తుంది మరియు ఇది మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుంది.

రైడింగ్‌కి సిద్దమవ్వండి..బెనెల్లీ నుంచి కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 2.51 లక్షలు

ఇంజన్ విషయానికి వస్తే, ఈ బైక్‌లో శక్తివంతంమైన 502 సిసి ట్విన్ సిలిండర్, డిఓహెచ్‌సి ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 47.5 బిహెచ్‌పి శక్తిని మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 45 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో వాటర్ కూలింగ్ టెక్నాలజీ ఇవ్వబడింది.

Most Read Articles

English summary
Benelli trk 251 launched in india price features specifications details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X