భారత మార్కెట్లో ఏబిఎస్ ఫీచర్‌తో లభిస్తున్న చవకైన మోటార్‌సైకిల్స్!

భారతదేశం ద్విచక్ర వాహనాలకు అతిపెద్ద మార్కెట్. ఇక్కడి మార్కెట్లో కొనుగోలుదారులు ధరతో పాటుగా బ్రాండ్, మైలేజ్ మరియు ఫీచర్స్ వంటి అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. భారత కమ్యాటర్ టూవీలర్ మార్కెట్లో 100సిసి నుండి 150సిసి మధ్యలో అనేక సరసమైన టూవీలర్లు అందుబాటులో ఉన్నాయి.

భారత మార్కెట్లో ఏబిఎస్ ఫీచర్‌తో లభిస్తున్న చవకైన మోటార్‌సైకిల్స్!

ఈ మోటార్‌సైకిళ్లు తక్కువ ధరను కలిగి ఉండటమే కాదు, ఫీచర్ల పరంగా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటాయి. ప్రత్యేకించి ఈ కథనంలో మనం చెప్పుకోబోయే టూవీలర్లు ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఫీచర్‌ను కలిగి ఉంటాయి. ఈ ఫీచర్ కలిగిన బైకులు బ్రేకింగ్ విషయంలో చాలా సమర్థవంతంగా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం రండి..!

భారత మార్కెట్లో ఏబిఎస్ ఫీచర్‌తో లభిస్తున్న చవకైన మోటార్‌సైకిల్స్!

1. బజాజ్ ప్లాటినా 110

బజాజ్ ప్లాటినా దేశంలోనే అత్యంత చౌకైన ఏబిఎస్ ఫీచర్ కలిగిన బైక్. ఈ బైక్‌లో కంపెనీ 115.45సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగిస్తోంది. ఇది 8.6 బిహెచ్‌పి పవర్‌ను మరియు 9.81 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత మార్కెట్లో ఏబిఎస్ ఫీచర్‌తో లభిస్తున్న చవకైన మోటార్‌సైకిల్స్!

బ్రేకింగ్ విషయానికి వస్తే, బజాజ్ ప్లాటినా 110 బైక్‌లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఫీచర్ ఉంటుంది. దీని ముందు చక్రంలో 240 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది మరియు వెనుక చక్రంలో 110 మిమీ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. మార్కెట్లో ఈ బైక్ ధర రూ.66,739 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

భారత మార్కెట్లో ఏబిఎస్ ఫీచర్‌తో లభిస్తున్న చవకైన మోటార్‌సైకిల్స్!

2. బజాజ్ పల్సర్ 150 నియాన్

బజాజ్ నుండి లభిస్తున్న 150 సిసి వెర్షన్ పల్సర్ 150 నియాన్ కూడా సింగిల్ ఛానెల్ ఏబిఎస్ ఫీచర్‌తో లభిస్తుంది. ఈ బైక్‌లో, 149.5 సిసి సామర్థ్యం గల సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 14 బిహెచ్‌పి పవర్‌ను మరియు 13.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

భారత మార్కెట్లో ఏబిఎస్ ఫీచర్‌తో లభిస్తున్న చవకైన మోటార్‌సైకిల్స్!

ఈ బైక్‌లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి కొన్ని ప్రీమియం ఫీచర్లు కూడా లభిస్తాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ వెనుక చక్రంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్ మరియు ముందు చక్రంలో 230 మిమీ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. మార్కెట్లో ఈ బైక్ ధరలు రూ.98,291 నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

భారత మార్కెట్లో ఏబిఎస్ ఫీచర్‌తో లభిస్తున్న చవకైన మోటార్‌సైకిల్స్!

3. హోండా యునికార్న్

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా నుండి లభిస్తున్న బెస్ట్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ యునికార్న్. ఈ బైక్‌లో 162.7 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 12.92 బిహెచ్‌పి పవర్‌ను మరియు 14 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత మార్కెట్లో ఏబిఎస్ ఫీచర్‌తో లభిస్తున్న చవకైన మోటార్‌సైకిల్స్!

హోండా యునికార్న్‌లో హాలోజన్ హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్, అనలాగ్ కన్సోల్, ఇంజన్ కిల్ స్విచ్, త్రీ పాడ్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ వెనుక చక్రంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్ మరియు ముందు చక్రంలో 240 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఇది సింగిల్ ఛానల్ ఏబిఎస్‌ను సపోట్ చేస్తుంది. మార్కెట్లో ఈ బైక్ ధర రూ.98,931 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

భారత మార్కెట్లో ఏబిఎస్ ఫీచర్‌తో లభిస్తున్న చవకైన మోటార్‌సైకిల్స్!

4. టీవీఎస్ అపాచి ఆర్‌టిఆర్ 160

దేశీయ టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ అందిస్తున్న పాపులర్ అపాచి ఆర్‌టిఆర్ 160 మోడల్ కూడా ఏబిఎస్ ఫీచర్‌తో లభిస్తుంది. ఈ బైక్‌లో 159.7 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 15.53 బిహెచ్‌పి పవర్‌ను మరియు 13.9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత మార్కెట్లో ఏబిఎస్ ఫీచర్‌తో లభిస్తున్న చవకైన మోటార్‌సైకిల్స్!

టీవీఎస్ అపాచి ఆర్‌టిఆర్ 160 బైక్‌లో ట్యూబ్ లెస్ టైర్లు, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, సింగిల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో ఈ బైక్ ధరలు రూ.1.06 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమవుతాయి.

భారత మార్కెట్లో ఏబిఎస్ ఫీచర్‌తో లభిస్తున్న చవకైన మోటార్‌సైకిల్స్!

5. బజాజ్ అవెంజర్ 160 స్ట్రీట్

బజాజ్ ఆటో అందిస్తున్న ఎంట్రీ లెవల్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ అవెంజర్ 160 స్ట్రీట్ మోడల్ కూడా సింగిల్ ఛానెల్ ఏబిఎస్ ఫీచర్‌తో అందుబాటులో ఉంది. ఈ బైక్‌లో అమర్చిన 160 సిసి సింగిల్ సిలిండర్ డిటిఎస్ఐ ఇంజన్ గరిష్టంగా 15 బిహెచ్‌పి పవర్‌ను మరియు 13.7 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

భారత మార్కెట్లో ఏబిఎస్ ఫీచర్‌తో లభిస్తున్న చవకైన మోటార్‌సైకిల్స్!

ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ క్రూయిజర్ బైక్‌లో అల్లాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్స్, సింగిల్ పాడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ ముందు భాగంలో 280 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. మార్కెట్లో ఈ బైక్ ధర రూ.1.08 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఢిల్లీగా ఉంది.

Most Read Articles

English summary
Best Bikes In India With ABS Feature Under Rs 70,000: Platina, Pulsar 150, Unicorn And More. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X