మీ ఇంట్లోని పెద్దవారి కోసం ఏ స్కూటర్ అయితే బాగుంటుంది?

దేశంలో కోవిడ్-19 పరిస్థితుల అనంతరం ప్రజలు వ్యక్తిగత రవాణాకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. కరోనా వైరస్ ఇంకా పూర్తిగా అంతరించకపోవడం మరియు తాజా వ్యాప్తి భయం నేపథ్యంలో, ప్రజా రవాణా కన్నా వ్యక్తిగత రవాణానే సురక్షితమైనదని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ద్విచక్ర వాహనాలు ఆర్థికంగా సులువైన మరియు సురక్షితమైన ప్రయాణ అనుభూతిని కల్పిస్తాయి.

మీ ఇంట్లోని పెద్దవారి కోసం ఓ స్కూటర్ అయితే బాగుంటుంది?

మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉండి, వారి కోసం ఓ ఉత్తమమైన టూవీలర్ ఆప్షన్‌ను చూస్తున్నట్లయితే, అలాంటి వారికి స్కూటర్లు చక్కటి ఎంపికగా ఉంటాయి. మోటార్‌సైకిళ్లతో పోల్చుకుంటే, స్కూటర్లు నడపటానికి సులువుగా ఉండమే కాకుండా, చిన్నపాటి వస్తువులను తీసుకువెళ్లడానికి కూడా అనువుగా ఉంటాయి. కొంచెం వయసు పైబడిన వారు కూడా ఇలాంటి స్కూటర్లను చక్కగా నడిపేయవచ్చు.

మరి ఈ కథనంలో పెద్దవారి కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ స్కూటర్లు ఏవో తెలుసుకుందాం రండి.

మీ ఇంట్లోని పెద్దవారి కోసం ఓ స్కూటర్ అయితే బాగుంటుంది?

1. టీవీఎస్ జూపిటర్

టీవీఎస్ జూపిటర్ స్కూటర్ అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ స్కూటర్ ముఖ్యంగా పెద్దవారికి మరింత సౌకర్యంగా ఉంటుంది. ఇది 375 మిమీ పెద్ద లెగ్‌స్పేస్‌ను కలిగి ఉండి, ఆపరేట్ చేయడానికి సులువుగా ఉంటుంది. సీటు క్రింది భాగంలో అలాగే ముందు భాగంలోని లగేజ్ స్పేస్ చాలా సౌకర్యంగా అనిపిస్తుంది.

మీ ఇంట్లోని పెద్దవారి కోసం ఓ స్కూటర్ అయితే బాగుంటుంది?

టీవీఎస్ జూపిటర్ స్కూటర్‌లో 109సిసి ఇంజన్ ఉంటుంది, ఇది 7.37 బిహెచ్‌పి పవర్‌ను మరియు 8.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని మెటల్ బాడీ కారణంగా, ఈ స్కూటర్ చాలా ధృడంగా అనిపిస్తుంది. ఈ స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌ను కలిగి ఉంటుంది. మార్కెట్లో ఈ స్కూటర్ ధరలు రూ.66,470 నుండి రూ.75,717 (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

మీ ఇంట్లోని పెద్దవారి కోసం ఓ స్కూటర్ అయితే బాగుంటుంది?

2. హోండా యాక్టివా 6జి

హోండా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ యాక్టివా. ఈ స్కూటర్ యొక్క గొప్ప డిజైన్ మరియు ఆకర్షణీయమైన మైలేజ్ కారణంగా దీనిని ఇష్టపడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. హోండా యాక్టివా 6జి స్కూటర్‌లో 109.51 సిసి ఇంజన్ ఉంటుంది, ఇది 7.68 బిహెచ్‌పి పవర్‌ను మరియు 8.79 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మీ ఇంట్లోని పెద్దవారి కోసం ఓ స్కూటర్ అయితే బాగుంటుంది?

ఈ ఇంజన్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఈఎస్‌పి టెక్నాలజీ సహాయంతో దాని మైలేజ్ 10 శాతం వరకూ పెరిగుతుందని కంపెనీ పేర్కొంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, దీని ముందు మరియు వెనుక చక్రాలలో 130 మిమీ డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తాయి. ఇది సమర్థవంతమైన బ్రేకింగ్ అనుభవాన్ని ఇస్తుంది. మార్కెట్లో ఈ స్కూటర్ ధరలు రూ.69,962 నుండి రూ.73,225 (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

మీ ఇంట్లోని పెద్దవారి కోసం ఓ స్కూటర్ అయితే బాగుంటుంది?

3. హీరో మాస్ట్రో ఎడ్జ్ 110

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 స్కూటర్ సౌకర్యవంతమైన స్కూటర్. డిజైన్ పరంగా ఇది పైన తెలిపిన రెండు స్కూటర్ల కన్నా కూడా చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఈ స్కూటర్‌లో విశాలమైన సీటు ఉంటుంది, దీనిపై ఇద్దరు వ్యక్తులు సులభంగా కూర్చోవచ్చు. ఇందులో అల్లాయ్ వీల్స్‌తో పాటుగా సేఫ్టీ కోసం ఫ్రంట్ డిస్క్ మరియు రియర్ డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి రెండూ కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తాయి.

మీ ఇంట్లోని పెద్దవారి కోసం ఓ స్కూటర్ అయితే బాగుంటుంది?

హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 స్కూటర్‌లో 22-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్ ఉంటుంది. ఇంజన్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ 110.9 సిసి ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 8 బిహెచ్‌పి పవర్‌ను మరియు 8.75 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 ధరలు రూ.66,344 నుండి రూ.68,248 (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

మీ ఇంట్లోని పెద్దవారి కోసం ఓ స్కూటర్ అయితే బాగుంటుంది?

4. సుజుకి యాక్సెస్ 125

టీవీఎస్ జూపిటర్, హోండా యాక్టివా స్కూటర్ల మాదిరిగానే సుజుకి యాక్సెస్ 125 కూడా క్లాసీ లుకింగ్ స్కూటర్. ఈ స్కూటర్‌లో పవర్‌ఫుల్ 125సిసి ఇంజన్ ఉంటుంది. ఈ 4-స్ట్రోక్, ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఇంజన్ గరిష్టంగా 8.7 బిహెచ్‌పి శక్తిని మరియు 10 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మీ ఇంట్లోని పెద్దవారి కోసం ఓ స్కూటర్ అయితే బాగుంటుంది?

సింపుల్ డిజైన్‌తో కూడిన ఈ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ డిస్క్ మరియు డ్రమ్ బ్రేక్ వేరియంట్లలో లభిస్తుంది. పెద్దవారికి ఈ స్కూటర్ మంచి ఎంపిక అని నిరూపించగలదు. మార్కెట్లో సుజుకి యాక్సెస్ ధరలు రూ.58,249 నుండి రూ.86,328 (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

మీ ఇంట్లోని పెద్దవారి కోసం ఓ స్కూటర్ అయితే బాగుంటుంది?

5. యమహా ఫాసినో

యమహా ఫాసినో తేలికైన మరియు చాలా స్టైలిష్‌గా ఉండే 125సిసి స్కూటర్. యమహా అందిస్తున్న రే స్కూటర్ యవతను టార్గెట్ చేసుకొని ఉండే, ఫాసినో స్కూటర్ అన్ని వర్గాల వారికి అనువుగా ఉండేలా డిజైన్ చేయబడింది. ఈ స్కూటర్ బరువు కేవలం 99 కిలోలు మాత్రమే. తక్కువ బరువు కారణంగా, ఈ స్కూటర్ సెగ్మెంట్‌లోని ఇతర స్కూటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది.

మీ ఇంట్లోని పెద్దవారి కోసం ఓ స్కూటర్ అయితే బాగుంటుంది?

ఇంజన్ విషయానికి వస్తే, యమహా ఫాసినో స్కూటర్‌లో 125సిసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 8.2 బిహెచ్‌పి శక్తిని మరియు 9.7 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం ఈ స్కూటర్‌లో డిస్క్ బ్రేక్‌లు కూడా లభిస్తాయి. ఈ స్కూటర్ సైడ్ స్టాండ్ ఇంజన్ కటాఫ్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. అంటే సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు ఇంజన్ ఆన్ కాదు. ఈ స్కూటర్ యొక్క ఇంధన ట్యాంక్ సామర్థ్యం 5.2 లీటర్లు. మార్కెట్లో దీని ధరలు రూ.73,630 నుండి రూ.77,147 (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

మీ ఇంట్లోని పెద్దవారి కోసం ఓ స్కూటర్ అయితే బాగుంటుంది?

6. సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్

సుజుకి నుండి లభిస్తున్న మరొక పెద్ద స్కూటర్ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్. ఇదొక మాక్సి టైప్ స్కూటర్, ఇది చాలా అద్భుతమైన స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌లో పెద్ద సీట్ ఉంటుంది, ఇది సౌకర్యవంతమైన రైడ్ క్వాలిటీని అందిస్తుంది. కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఈ స్కూటర్ లీటరుకు 55 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఈ స్కూటర్‌లో 5.5 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది.

మీ ఇంట్లోని పెద్దవారి కోసం ఓ స్కూటర్ అయితే బాగుంటుంది?

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌లో డిస్క్ బ్రేక్, ఫుల్ ఎల్ఈడి లైటింగ్, విండ్ స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాలర్ అలర్ట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో ఈ స్కూటర్ ధరలు రూ.85,176 నుండి రూ.88,760 (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

మీ ఇంట్లోని పెద్దవారి కోసం ఓ స్కూటర్ అయితే బాగుంటుంది?

7. ఏథర్ 450ఎక్స్ - ఎలక్ట్రిక్ స్కూటర్

ఏథర్ 450ఎక్స్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది స్టైలిష్ డిజైన్ మరియు మోడ్రన్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ మరియు టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే వంటి లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లను కలిగి ఉంటుంది. పూర్తి చార్జ్‌పై ఈ స్కూటర్ 100-120 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

మీ ఇంట్లోని పెద్దవారి కోసం ఓ స్కూటర్ అయితే బాగుంటుంది?

మార్కెట్లో ఏథర్ 450ఎక్స్ స్కూటర్ ధర రూ.1,32,426 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఒకవేళ మీరు ప్రకృతి ప్రేమికులు అయినట్లయితే, మీ కోసం లేదా మీ ఇంటిలోని పెద్ద వారి కోసం ఈ క్లీన్ స్కూటర్‌ను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం నిరంతరాయంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలను పరిగణలోకి తీసుకుంటే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓ చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Best Scooters For Elder People In Your Home: TVS Jupiter, Honda Activa 6G, Yamaha Fascino And More. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X