జనవరిలో టాప్ 10 టూవీలర్ బ్రాండ్స్ ఇవే.. హీరో మోటోకార్ప్‌దే అగ్రస్థానం

గడచిన జనవరి 2021లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 ద్విచక్ర వాహనాల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో ఎప్పటి మాదిరిగానే, దేశపు అగ్రగామి టూవీలర్ బ్రాండ్ హీరో మోటోకార్ప్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి రెండు స్థానాలను వరుసగా హోండా మరియు టీవీస్ కంపెనీలు సొంతం చేసుకున్నాయి.

జనవరిలో టాప్ 10 టూవీలర్ బ్రాండ్స్ ఇవే.. హీరో మోటోకార్ప్‌దే అగ్రస్థానం

భారతదేశపు ద్విచక్ర వాహన విభాగంలో హీరో మోటోకార్ప్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, గడచిన నెలలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. జనవరి 2021లో హీరో మోటోకార్ప్ మొత్తం 4.67 లక్షల యూనిట్లను విక్రయించింది. అయితే, జనవరి 2020 నెలలో అమ్మకాలతో పోలిస్తే ఇది 4.2 శాతం క్షీణించింది. ఆ సమయంలో కంపెనీ ఇది 4.88 లక్షల టూవీలర్స్‌ను విక్రయించింది.

జనవరిలో టాప్ 10 టూవీలర్ బ్రాండ్స్ ఇవే.. హీరో మోటోకార్ప్‌దే అగ్రస్థానం

ఈ జాబితాలో ద్వితీయ స్థానాన్ని హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా సొంతం చేసుకుంది. గతన నెలలో కంపెనీ 11.2 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. జనవరి 2021లో కంపెనీ మొత్తం 4.16 లక్షల యూనిట్లను విక్రయించింది. జనవరి 2020లో వీటి సంఖ్య 3.74 లక్షల యూనిట్లుగా ఉంది.

MOST READ:ఈ టైర్లు పంక్చర్ కావు.. ఇదేంటనుకుంటున్నారా.. వీడియో చూడండి

జనవరిలో టాప్ 10 టూవీలర్ బ్రాండ్స్ ఇవే.. హీరో మోటోకార్ప్‌దే అగ్రస్థానం

ఈ జాబితాలో టాప్ 3 స్థానంలో ఉన్నది చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ. గడచిన జనవరి 2021లో టీవీఎస్ మొత్తం 2.05 లక్షల యూనిట్లను విక్రయించింది. జనవరి 2020లో వీటి సంఖ్య 1.63 లక్షల యూనిట్లుగా ఉంది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 26 శాతం వృద్ధి చెందాయి.

జనవరిలో టాప్ 10 టూవీలర్ బ్రాండ్స్ ఇవే.. హీరో మోటోకార్ప్‌దే అగ్రస్థానం

దేశీయ టూవీలర్ బ్రాండ్ బజాజ్ ఆటో ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. గత నెలలో బజాజ్ ఆటో మొత్తం 1.57 లక్షల యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ వార్షిక అమ్మకాలతో పోలిస్తే, ఇది కేవలం కొన్ని వందల యూనిట్ల తేడాను మాత్రమే కలిగి ఉంది.

MOST READ:శిల్పా శెట్టి గ్యారేజ్‌లో చేరిన మరో ఖరీదైన లగ్జరీ కార్, ఇదే

జనవరిలో టాప్ 10 టూవీలర్ బ్రాండ్స్ ఇవే.. హీరో మోటోకార్ప్‌దే అగ్రస్థానం

చెన్నైకి చెందిన టూవీలర్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్, గడచిన జనవరి నెలలో టాప్ 5 స్థానంలో నిలిచింది. గత నెలలో కంపెనీ మొత్తం 64,372 యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 61,292 యూనిట్లుగా నమోదై 5 శాతం వృద్ధిని సాధించాయి.

జనవరిలో టాప్ 10 టూవీలర్ బ్రాండ్స్ ఇవే.. హీరో మోటోకార్ప్‌దే అగ్రస్థానం

ఇకపోతే, జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి గత నెలలో ఆరవ స్థానంలో నిలిచింది. జనవరి 2021లో సుజుకి మోటార్‌సైకిల్ మొత్తం 57,004 యూనిట్లను విక్రయించింది. జనవరి 2020లో వీటి సంఖ్య 56,012 యూనిట్లుగా ఉంది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు స్వల్పంగా 1.8 శాతం వృద్ధి చెందాయి.

Rank Two Wheeler OEM Jan'21 Jan'20 Growth (%)
1 Hero MotoCorp 4,67,753 4,88,069 -4.2
2 Honda 4,16,716 3,74,114 11.4
3 TVS 2,05,216 1,63,007 25.9
4 Bajaj Auto 1,57,404 1,57,796 -0.2
5 Royal Enfield 64,372 61,292 5.0
6 Suzuki 57,004 56,012 1.8
7 Yamaha 55,151 35,913 53.6
8 Piaggio 6,040 4,358 38.6
9 Kawasaki 161 151 6.6
10 Triumph 62 60 3.3
11 Mahindra Two Wheelers 26 23 13.0
12 Harley-Davidson 23 210 -89.0

Source: Autopunditz.com

MOST READ:ప్రమాదానికి గురైన శిల్పా శెట్టి భర్త కార్, కానీ కార్‌లో ఉన్నది మాత్రం అతడు కాదు.. ఇంకెవరు

జనవరిలో టాప్ 10 టూవీలర్ బ్రాండ్స్ ఇవే.. హీరో మోటోకార్ప్‌దే అగ్రస్థానం

గతేడాది జనవరి నెలతో పోలిస్తే యమహా గరిష్టంగా 53 శాతం వృద్ధిని సాధించింది. జనవరి 2020లో 35,913 యూనిట్లుగా ఉన్న కంపెనీ అమ్మకాలు జనవరి 2021లో 55,151 యూనిట్లకు పెరిగాయి. గత నెలలో పియాజ్జియో అమ్మకాలు 38 శాతం పెరిగి 4,358 యూనిట్ల నుండి 6,040 యూనిట్లకు పెరిగాయి.

జనవరిలో టాప్ 10 టూవీలర్ బ్రాండ్స్ ఇవే.. హీరో మోటోకార్ప్‌దే అగ్రస్థానం

ఇక ఈ జాబితాలో 9వ మరియు 10వ స్థానాలను వరుసగా కవాసకి మరియు ట్రైయంప్ బ్రాండ్‌లు దక్కించుకున్నాయి. గత నెలలో కవాసకి 161 యూనిట్లను విక్రయించగా, ట్రైయంప్ 62 యూనిట్లను విక్రయించి వరుసగా 6.6 శాతం మరియు 3.3 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

MOST READ:ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

Most Read Articles

English summary
Best Selling Two-Wheeler Brands In India In January 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X