బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌‌తో కూడిన టూవీలర్స్: హీరో, టీవీఎస్, సుజుకి, యమహా

వాహనాలలో బ్లూటూత్ కనెక్టివిటీ అనేది ఒకప్పుడు హై-ఎండ్ కార్లలో మాత్రమే కనిపించే ఓ కాస్ట్లీ మరియు లగ్జరీ టెక్నాలజీ ఫీచర్. కానీ, ఇప్పుడు ఈ ఫీచర్ ఎంట్రీ లెవల్ టూవీలర్లలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. మనదేశంలో హీరో మోటోకార్ప్, టీవీఎస్, సుజుకి మరియు యమహా వంటి టూవీలర్ బ్రాండ్లు తమ ఉత్పత్తులలో ఈ బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీని అందిస్తున్నాయి.

బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌‌తో కూడిన టూవీలర్స్: హీరో, టీవీఎస్, సుజుకి, యమహా

టూవీలర్లలో బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీ అనేది సదరు టూవీలర్ మరియు యూజర్ యొక్క స్మార్ట్‌ఫోన్‌లోని వివిధ ఫీచర్లను యాక్సెస్ చేసుకోవటానికి అనుమతిస్తుంది. ఉదాహరణకు, కాల్ ఆన్సర్ / రిజెక్ట్, ఎస్ఎమ్ఎస్ అలెర్ట్, బ్యాటరీ స్టేటస్, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇలా అనేక ఫీచర్లను ఈ బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీ సాయంతో కంట్రోల్ చేయవచ్చు.

బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌‌తో కూడిన టూవీలర్స్: హీరో, టీవీఎస్, సుజుకి, యమహా

మరి మనదేశంలో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌తో లభిస్తున్న కొన్ని మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్ల వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌‌తో కూడిన టూవీలర్స్: హీరో, టీవీఎస్, సుజుకి, యమహా

హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ ఇటీవల గ్లామర్ ఎక్స్‌టెక్ అనే మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. హీరో మోటోకార్ప్ నుండి లేటెస్ట్‌గా బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ పొందిన బైక్ ఇది. ఇవి కాకుండా, కంపెనీ విక్రయిస్తున్న హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్, ఎక్స్‌పల్స్ 200, ఎక్స్‌పల్స్ 200టి బైక్‌లలో కూడా బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ లభిస్తుంది.

బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌‌తో కూడిన టూవీలర్స్: హీరో, టీవీఎస్, సుజుకి, యమహా

ఈ మోడళ్లలో బ్లూటూత్ కనెక్టివిటీ కోసం ప్రత్యేకమైన ఎల్ఈడి డిస్‌ప్లే ఉంటుంది. రైడర్స్ బ్లూటూత్ ద్వారా తమ స్మార్ట్‌ఫోన్‌ను బైక్‌తో కనెక్ట్ చేయవచ్చు. ఈ ఫీచర్ సాయంతో కాల్ మరియు ఎస్ఎమ్ఎస్ అలెర్ట్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు.

బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌‌తో కూడిన టూవీలర్స్: హీరో, టీవీఎస్, సుజుకి, యమహా

టీవీఎస్ మోటార్ కంపెనీ

టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న అపాచి ఆర్‌టిఆర్ 200 4వి మోడల్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ లభిస్తుంది. ఈ బైక్‌లో, మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ని బ్లూటూత్ ద్వారా బైక్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో జత చేసుకోవచ్చు. దీని సాయంతో మీరు కాల్, వేగం మరియు ల్యాప్ సమయాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. ఈ టెక్నాలజీ కోసం టీవీఎస్ ఓ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ని కూడా ప్లేస్టోర్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని సాయంతో రైడర్లు తమ బైక్‌ను లైవ్‌గా ట్రాక్ చేసుకోవచ్చు.

బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌‌తో కూడిన టూవీలర్స్: హీరో, టీవీఎస్, సుజుకి, యమహా

టీవీఎస్ అందిస్తున్న మరొక బ్లూటూత్ ఎనేబల్డ్ టూవీలర్ 'ఎన్‌టార్క్ 125' స్కూటర్. యువతను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టిన ఈ స్పోర్టీయర్ స్కూటర్ 125సిసి విభాగంలో బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో 'స్మార్ట్ కనెక్ట్' స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ సాయంతో ఫోన్ నోటిఫికేషన్‌లు, ట్రిప్ రిపోర్ట్‌లు మరియు నావిగేషన్ వంటి సమాచారాన్ని పొందవచ్చు.

బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌‌తో కూడిన టూవీలర్స్: హీరో, టీవీఎస్, సుజుకి, యమహా

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా

సుజుకి అందిస్తున్న యాక్సెస్ 125 మరియు బర్గ్‌మాన్ స్ట్రీట్ స్కూటర్లలో కంపెనీ 2020 లోనే బ్లూటూత్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ రెండు స్కూటర్లలో కొత్త ఎల్‌సిడి డిస్‌ప్లే స్క్రీన్ ఉంటుంది. దీనిపై టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ మరియు ఎస్ఎమ్ఎస్ అలెర్ట్స్, వాట్సాప్ అలెర్ట్స్, మిస్డ్ కాల్ అలెర్ట్స్, కాలర్ ఐడి, ఓవర్-స్పీడ్ అలెర్ట్ మరియు ఫోన్ బ్యాటరీ స్థాయి వంటి ఫీచర్లను పొందవచ్చు. ఇందుకోసం కంపెనీ 'సుజుకి రైడ్ కనెక్ట్' అనే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.

బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌‌తో కూడిన టూవీలర్స్: హీరో, టీవీఎస్, సుజుకి, యమహా

యమహా మోటార్ ఇండియా

యమహా తాజాగా విడుదల చేసిన 150 సిసి బైక్ ఎఫ్‌జెడ్ ఎక్స్ మోడల్‌లో కూడా కంపెనీ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌ను జోడించింది. ఇదే కాకుండా, కంపెనీ తమ పాపులర్ ఎఫ్‌జెడ్ఎస్-ఎఫ్ఐ శ్రేణి మోడళ్లు, కొత్త ఫాసినో మరియు రే జెడ్ఆర్ స్కూటర్లలో కూడా కంపెనీ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌‌ను ఆఫర్ చేస్తోంది. యమహా త్వరలో తమ ఎమ్‌టి-15, ఆర్‌15, 250 సిసి రేంజ్ బైక్‌లలో కూడా కంపెనీ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది.

బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌‌తో కూడిన టూవీలర్స్: హీరో, టీవీఎస్, సుజుకి, యమహా

యమహా మోటార్ ఇండియా తమ వాహనాల్లో రెండు రకాల బ్లూటూత్ యాప్‌లను అందిస్తుంది, వీటిలో యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ ఎక్స్ మరియు వై-కనెక్ట్ అనేవి ఉన్నాయి. యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్-ఎక్స్ యాప్ ఆన్సర్ బ్యాక్, బ్యాటరీ వోల్టేజ్, పార్కింగ్ రికార్డ్, ఇ-లాక్, లొకేషన్ ట్రాకింగ్, రైడింగ్ హిస్టరీ మొదలైన ఫీచర్లను అందిస్తుంది. కాగా, వై-కనెక్ట్ కాల్ మరియు ఎస్ఎమ్ఎస్ అలెర్ట్స్, కనెక్ట్ చేయబడిన మొబైల్ ఫోన్ బ్యాటరీ స్థాయి వంటి నోటిఫికేషన్‌లను అందిస్తుంది.

Most Read Articles

English summary
Best Two-Wheelers In India With Bluetooth Connectivity Feature. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X