హీరో స్ప్లెండర్ ప్లస్‌కి పోటీగా నిలిచిన 5 బైకులు, వివరాలు

భారత మార్కెట్లోని ద్విచక్ర వాహన విభాగంలో హీరో స్ప్లెండర్ అత్యధికంగా అమ్ముడవుతున్న మోటారు సైకిళ్ళలో ఒకటి. హీరో స్ప్లెండర్ అతి తక్కువ నిర్వహణ వ్యయంతో ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. ఈ కారణంగా హీరో స్ప్లెండర్ ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించగలిగింది.

హీరో స్ప్లెండర్ ప్లస్‌కి పోటీగా నిలిచిన 5 బైకులు, వివరాలు

బిఎస్ 6 హీరో స్ప్లెండర్ ప్లస్ 97.2 సిసి ఫ్యూయెల్ ఇంజెక్ట్, సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.91 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో బిఎస్ 6 హీరో స్ప్లెండర్ బేస్ (కిక్ స్టార్ట్) వేరియంట్ ధర రూ. 63,750 కాగా, సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ ధర రూ. 67,260 రూపాయలు.

హీరో స్ప్లెండర్ ప్లస్‌కి పోటీగా నిలిచిన 5 బైకులు, వివరాలు

హీరో స్ప్లెండర్ ప్లస్ మార్కెట్లో 100 సిసి బైక్ విభాగంలో అత్యధిక అమ్మకాలను కలిగి ఉన్నప్పటికీ, ఫీచర్స్ మరియు మైలేజ్ పరంగా హీరో స్ప్లెండర్ ప్లస్‌కు గట్టి పోటీనిచ్చే ఇతర కంపెనీల నుండి అనేక బైక్‌లు మార్కెట్లో ఉన్నాయి. హీరో స్ప్లెండర్ ప్లస్ యొక్క 5 ప్రధాన ప్రత్యర్థి బైకుల గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హీరో స్ప్లెండర్ ప్లస్‌కి పోటీగా నిలిచిన 5 బైకులు, వివరాలు

బజాజ్ ప్లాటినా 100 ఇఎస్:

బజాజ్ కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అత్యంత సరసమైన బైకులలో ప్లాటినా 100 ఇఎస్ ఒకటి. ఇది హీరో స్ప్లెండర్ కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుంది.

బజాజ్ ప్లాటినా 100 ఇఎస్ 100 సిసి ఎయిర్-కూల్డ్ డిటిఎస్ఐ ఇంజన్ ద్వారా 7.8 బిహెచ్‌పి పవర్ మరియు 8.3 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ప్లాటినా 100 ఇఎస్ ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 56,480 వరకు ఉంటుంది.

హీరో స్ప్లెండర్ ప్లస్‌కి పోటీగా నిలిచిన 5 బైకులు, వివరాలు

బజాజ్ సిటి 100:

బజాజ్ కంపెనీ యొక్క మరొక సరసమైన బైక్ మరియు ఎక్కువమంది వినియోగదారుల మనసు దోచిన బైక్ ఈ బజాజ్ సిటి 100. ఈ బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్‌కు గట్టి ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఈ బైక్ 115 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి 8.5 బిహెచ్‌పి పవర్ మరియు 9.81 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

హీరో స్ప్లెండర్ ప్లస్‌కి పోటీగా నిలిచిన 5 బైకులు, వివరాలు

బజాజ్ సిటి 100 బైక్ బరువు 118 కేజీల వరకు ఉంటుంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 10.5 లీటర్లు. బజాజ్ సిటి 100 కి 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. అయితే హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ కి మాత్రం 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి.

హీరో స్ప్లెండర్ ప్లస్‌కి పోటీగా నిలిచిన 5 బైకులు, వివరాలు

టీవీఎస్ రేడియన్:

భారత మార్కెట్లోకి హీరో స్ప్లెండర్ ప్లస్‌ సరైన ప్రత్యర్థిగా టీవీఎస్ రేడియన్‌ బైక్ తీసుకువచ్చారు. టీవీఎస్ రేడియన్ బైక్ 110 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ద్వారా 8.08 బిహెచ్‌పి పవర్ మరియు 8.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టీవీఎస్ రేడియన్ యొక్క పవర్ డెలివరీ హీరో స్ప్లెండర్ ప్లస్ కంటే కొంచెం ఎక్కువ.

హీరో స్ప్లెండర్ ప్లస్‌కి పోటీగా నిలిచిన 5 బైకులు, వివరాలు

టీవీఎస్ రేడియన్ బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్ కంటే పొడవైన వీల్ బేస్ మరియు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. టీవీఎస్ రేడియన్ బేస్ ఎడిషన్ ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 59,992 కాగా, టాప్-స్పెక్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 69,782 (ఎక్స్-షోరూమ్).

హీరో స్ప్లెండర్ ప్లస్‌కి పోటీగా నిలిచిన 5 బైకులు, వివరాలు

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్:

టీవీఎస్ కంపెనీ యొక్క స్టార్ట్ సిటీ ప్లస్ ప్రీమియం 110 సిసి కమ్యూటర్ మోటార్‌సైకిల్, ఇది హీరో స్ప్లెండర్ ప్లస్‌కు సరైన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది టీవీఎస్ రేడియన్ మాదిరిగా, స్టార్ సిటీ ప్లస్ కూడా 110 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7,350 ఆర్‌పిఎమ్ వద్ద 8.08 బిహెచ్‌పి మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ టార్క్ చేస్తుంది. ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది.

హీరో స్ప్లెండర్ ప్లస్‌కి పోటీగా నిలిచిన 5 బైకులు, వివరాలు

స్టార్ సిటీ ప్లస్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ రేడియన్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే, 172 మిమీతో, ఇది స్ప్లెండర్ ప్లస్ కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. డ్రమ్ బ్రేక్‌తో కూడిన బేస్ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ధర రూ. 68,475 కాగా, డిస్క్ బ్రేక్‌తో కూడిన టాప్-స్పెక్ మోడల్ ధర రూ .70,975 వరకు ఉంటుంది.

హీరో స్ప్లెండర్ ప్లస్‌కి పోటీగా నిలిచిన 5 బైకులు, వివరాలు

హోండా సిడి డ్రీం డీలక్స్:

హోండా సిడి డ్రీం డీలక్స్ బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ కి మంచి పోటీని అందిస్తుంది. ఇది స్ప్లెండర్ ప్లస్ కంటే కూడా మెరుగైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో హోండా సైలెంట్ ఎసిజి స్టార్ట్, ఇంజన్ కిల్ స్విచ్ వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

హీరో స్ప్లెండర్ ప్లస్‌కి పోటీగా నిలిచిన 5 బైకులు, వివరాలు

హోండా సిడి డ్రీమ్ డీలక్స్ 110 సిసి ఇంజన్ తో పనిచేస్తుంది, ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 బిహెచ్‌పి పవర్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 9.2 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌కు 4-స్పీడ్ గేర్‌బాక్స్ లభిస్తుంది. హోండా సిడి డ్రీమ్ డీలక్స్ యొక్క ధర రూ. 65,248 కాగా, డిఎల్‌ఎక్స్ వేరియంట్ ధర రూ. 66,248 వరకు ఉంటుంది.

Most Read Articles

English summary
5 Bikes Competing For The Hero Splendor Plus, Details. Read in Telugu.
Story first published: Wednesday, July 28, 2021, 14:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X