రైడింగ్‌కి సిద్ధమవ్వండి; కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎం 1000 ఆర్‌ఆర్ బైక్ వచ్చేసింది

బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో తన ఎం 1000 ఆర్‌ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ యొక్క స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 42 లక్షలు(ఎక్స్-షోరూమ్) కాగా, దాని హై-స్పెక్ వేరియంట్‌ ధర రూ. 45 లక్షలు (ఎక్స్‌షోరూమ్) వరకు ఉంటుంది. భారతమార్కెట్లో విడుదలైన ఈ కొత్త బిఎండబ్ల్యు ఎం 1000 ఆర్‌ఆర్ స్పోర్ట్స్ బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి; కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎం 1000 ఆర్‌ఆర్ బైక్ వచ్చేసింది

ఎం 1000 ఆర్‌ఆర్ స్పోర్ట్స్ బైక్ అనేది భారతదేశంలో మొట్టమొదటి హై పెర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ బైక్. సాధారణంగా కంపెనీ M సిరీస్ కింద పెర్ఫార్మెన్స్ కార్లను తయారు చేస్తుంది, కానీ ఇప్పుడు కంపెనీ ఈ సిరీస్‌లో శక్తివంతమైన బైక్‌లను కూడా తయారుచేస్తుంది.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి; కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎం 1000 ఆర్‌ఆర్ బైక్ వచ్చేసింది

బిఎండబ్ల్యు ఎం 1000 ఆర్‌ఆర్ స్పోర్ట్స్ బైక్ యొక్క రూపకల్పన ఎస్ 1000 ఆర్‌ఆర్ నుండి తీసుకోబడింది. కొత్త బిఎండబ్ల్యు ఎం 1000 ఆర్‌ఆర్ స్పోర్ట్స్ బైక్, ఎస్ 1000 ఆర్‌ఆర్ కన్నా 5 కేజీల తక్కువ బరువును కలిగి ఉంటుంది. కానీ దానికంటే శక్తివంతమైనది. ఈ బైక్ యొక్క ఏరోడైనమిక్స్ కూడా ఎస్ 1000 ఆర్ఆర్ కంటే మెరుగ్గా ఉంటాయి.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి; కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎం 1000 ఆర్‌ఆర్ బైక్ వచ్చేసింది

కొత్త బిఎండబ్ల్యు ఎం 1000 ఆర్‌ఆర్ స్పోర్ట్స్ బైక్ 999 సిసి 4-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 209 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తిచేస్తుంది. కొత్త బిఎండబ్ల్యు ఎం 1000 ఆర్‌ఆర్ స్పోర్ట్స్ బైక్ దాని ఎస్ 1000 ఆర్‌ఆర్ కన్నా 5 బిహెచ్‌పి ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి; కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎం 1000 ఆర్‌ఆర్ బైక్ వచ్చేసింది

కొత్త బిఎండబ్ల్యు ఎం 1000 ఆర్‌ఆర్ స్పోర్ట్స్ బైక్ బరువు ఇప్పుడు 192 కేజీలు. ఈ బైక్ వాహనదారునికి లేటెస్ట్ రేసింగ్ బైక్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి; కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎం 1000 ఆర్‌ఆర్ బైక్ వచ్చేసింది

ఈ బైక్‌ డ్యూయల్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్, ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్ వంటి వాటిని కలిగి ఉంది. అంతే కాకుండా ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. బిఎండబ్ల్యు ఎం 1000 ఆర్‌ఆర్ బైక్ లైట్ వైట్, రేసింగ్ బ్లూ మెటాలిక్ మరియు రేసింగ్ రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి; కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎం 1000 ఆర్‌ఆర్ బైక్ వచ్చేసింది

బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ కంపెనీ గత నెలలోనే ఆర్ నైన్ టి మరియు ఆర్ నైన్ టి స్క్రాంబ్లర్ అనే బైక్‌లను భారతదేశంలో విడుదల చేసింది. ఇందులో బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్ టి ధర రూ. 18.5 లక్షలు కాగా, ఆర్ నైన్ టి స్క్రాంబ్లర్ ధర రూ. 16.75 లక్షల వరకు ఉంటుంది.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి; కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎం 1000 ఆర్‌ఆర్ బైక్ వచ్చేసింది

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్ టి ఒక క్లాసిక్ రోడ్‌స్టర్ బైక్ కాగా, బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్ టి స్క్రాంబ్లర్, స్క్రాంబ్లర్ తరహా మోటార్‌సైకిల్. ఈ బైక్‌లను భారతీయ మార్కెట్లో కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సిబియు) గా లాంచ్ చేశారు, వీటి కారణంగా వాటి ధర చాలా ఎక్కువగా ఉంది. గత నెలలో కంపెనీ క్రూయిజర్ బైక్‌ను కూడా విడుదల చేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 క్లాసిక్‌ను భారతదేశంలో రూ .24 లక్షల ఎక్స్‌షోరూమ్‌తో ప్రవేశపెట్టారు. ఈ బైక్‌ను పూర్తి బిల్ట్ యూనిట్‌గా కూడా తీసుకువచ్చారు.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి; కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎం 1000 ఆర్‌ఆర్ బైక్ వచ్చేసింది

ఈ కొత్త బిఎండబ్ల్యు ఎం 1000 ఆర్‌ఆర్ స్పోర్ట్స్ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు, వాహనదారునికి చాలా మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. భారత మార్కెట్లో అమ్ముడవుతున్న అత్యంత వేగవంతమైన సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్‌లో ఎం 1000 ఆర్‌ఆర్ స్పోర్ట్స్ బైక్ కూడా ఒకటి.

More from DriveSpark

Article Published On: Thursday, March 25, 2021, 14:57 [IST]
English summary
BMW M 1000 RR Launched In India Starting At Rs 42 Lakh. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+