బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ 1000 ఆర్‌ఆర్ టీజర్ లాంచ్; త్వరలోనే భారత్‌లో విడుదల

జర్మన్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్, భారత మార్కెట్లో తమ మొట్టమొదటి ఎమ్ (M) సిరీస్ పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ 1000 ఆర్‌ఆర్ టీజర్ లాంచ్; త్వరలోనే భారత్‌లో విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ 1000 ఆర్‌ఆర్ ఒక హై-పెర్ఫార్మెన్స్ మోటారుసైకిల్, అతి త్వరలోనే ఇది భారత మార్కెట్లో విడుదల కానుంది. అయితే, ఇందుకు సంబంధించిన నిర్దిష్టమైన లాంచ్ డేట్‌ను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ 1000 ఆర్‌ఆర్ గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ 1000 ఆర్‌ఆర్ టీజర్ లాంచ్; త్వరలోనే భారత్‌లో విడుదల

ఈ మోడల్ అతికొద్ది సమయంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ 1000 ఆర్‌ఆర్ మోడల్‌ను కంపెనీ విక్రయిస్తున్న పాపులర్ ఎస్ 1000 ఆర్ఆర్ స్పోర్ట్-బైక్ ఆధారంగా చేసుకొని రూపొందించారు. ఇది చూడటానికి ఎస్ 1000 ఆర్ఆర్ మాదిరిగానే ఉన్నప్పటికీ, ఇది కంపెనీ యొక్క సిగ్నేచర్ ఎమ్ పెర్ఫార్మెన్స్ పనితీరును కలిగి ఉంటుంది.

MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన జాగ్వార్ ఐ-పేస్ : ధర, ఫీచర్లు & వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ 1000 ఆర్‌ఆర్ టీజర్ లాంచ్; త్వరలోనే భారత్‌లో విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ (M) బ్యాడ్జ్‌తో వచ్చే వాహనాలన్నీ పెర్ఫార్మెన్స్ వాహనాలని గమనించాలి. మెర్సిడెస్ బెంజ్‌కు ఏఎమ్‌జి పెర్ఫార్మెన్స్ బ్రాండ్ ఎలాగో, బిఎమ్‌డబ్లూకి ఎమ్ ఒక పెర్ఫార్మెన్స్ బ్రాండ్. సాధారణ మోడళ్లను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ ఎమ్ సిరీస్ ద్వారా హై-పెర్ఫార్మెన్స్ లగ్జరీ కార్లను మరియు మోటార్‌సైకిళ్లను తయారు చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ 1000 ఆర్‌ఆర్ టీజర్ లాంచ్; త్వరలోనే భారత్‌లో విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ మోటార్‌సైకిల్‌లో ఉపయోగించిన ఇంజన్‌నే ఈ ఎమ్ 1000 ఆర్ఆర్ మోటార్‌సైకిల్‌లోనూ ఉపయోగించారు. అయితే, దాని పనితీరును పెంచడానికి బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ మరియు ఎమ్ డివిజన్‌లు ఇందులో ఇంజన్‌లో అనేక మార్పులు చేశాయి.

MOST READ:ఇండియన్ ఆర్మీలో చేరనున్న 1300 మహీంద్రా వెహికల్స్, ఇవే

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ 1000 ఆర్‌ఆర్ టీజర్ లాంచ్; త్వరలోనే భారత్‌లో విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ 1000 ఆర్ఆర్ బైక్‌లో ఉపయోగించిన 999 సిసి, లిక్విడ్-కూల్డ్, ఫోర్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 14,500 ఆర్‌పిఎమ్ వద్ద 212 పిఎస్ శక్తిని మరియు 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు బై-డైరెక్షనల్ షిఫ్టర్‌తో జతచేయబడి ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ 1000 ఆర్‌ఆర్ టీజర్ లాంచ్; త్వరలోనే భారత్‌లో విడుదల

ఈ హై-పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిల్‌లోని కొన్ని మెకానికల్ భాగాలను కూడా సవరించారు. ఇందులో ముందు వైపు ఇన్‌వెర్టెడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో అల్యూమినియం స్వింగార్మ్‌లను ఉపయోగించారు. ఇంకా ఇందులో డ్యూయల్-ఛానెల్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్ మరియు హిల్-స్టార్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

MOST READ:అర్ధరాత్రి స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కెటిఎమ్ బైక్ ఇచ్చిన వ్యక్తి, ఎందుకో తెలుసా?

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ 1000 ఆర్‌ఆర్ టీజర్ లాంచ్; త్వరలోనే భారత్‌లో విడుదల

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ 1000 ఆర్ఆర్‌లో రెయిన్, రోడ్, డైనమిక్, రేస్ మరియు రేస్ ప్రో అనే ఐదు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. అధిక పనితీరు కోసం ఈ మోటార్‌సైకిల్ బరువును తగ్గించేందుకు కంపెనీ ఇందులో కార్బన్-ఫైబర్ భాగాలను ఉపయోగించింది. ఫలితంగా దీని బరువు 192 కిలోలుగా ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ 1000 ఆర్‌ఆర్ టీజర్ లాంచ్; త్వరలోనే భారత్‌లో విడుదల

ప్రస్తుతం, బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ భారత మార్కెట్లో ఎస్ 1000 ఆర్‌ఆర్ మోడల్‌ను విక్రయిస్తోంది. ఇది ఎస్ 1000 ఆర్ఆర్ స్టాండర్డ్, ఎస్ 1000 ఆర్ఆర్ ప్రో మరియు ఎస్ 1000 ఆర్ఆర్ ప్రో ఎమ్ఎస్‌పోర్ట్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.

MOST READ:మీ టూవీలర్‌కి సైడ్ మిర్రర్ లేదా.. అయితే భారీ జరిమానా తప్పదు, జాగ్రత్త..!

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ 1000 ఆర్‌ఆర్ టీజర్ లాంచ్; త్వరలోనే భారత్‌లో విడుదల

మార్కెట్లో వీటి ధర రూ.19.50 లక్షల నుండి రూ.23.27 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. కొత్తగా రానున్న ఎమ్ 1000 ఆర్ఆర్ మోడల్‌ను ఈ ఎస్ 1000 ఆర్ఆర్ మోడల్‌కి ఎగువన ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ధర కూడా దాని స్టాండర్డ్ వెర్షన్ ధర కంటే అధికంగా ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
BMW Motorrad India Teases M 1000 RR; Launch Expected Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X