BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్ ప్రారంభం; త్వరలో విడుదల!

జర్మన్ లగ్జరీ టూవీలర్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ (BMW Motorrad) తమ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సిఈ 04 (BMW CE 04) ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్రకటించింది. కొత్త BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ 2017 లో 'కాన్సెప్ట్ లింక్' గా ఆవిష్కరించబడింది మరియు ఆ తర్వాత 2020లో ఇందులో ఉత్పత్తికి చేరువలో ఉన్న డెఫినిషన్ సిఈ 04 ను బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఆవిష్కరించింది. కాగా, ఇప్పుడు ఉత్పత్తికి సిద్ధమైన 2021 సిఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ ఆవిష్కరించింది.

BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్ ప్రారంభం; త్వరలో విడుదల!

మరికొద్ది రోజుల్లోనే కొత్త బిఎమ్‌డబ్ల్యూ సిఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కానుంది. కొత్త BMW CE 04 అనేది ఈ జర్మన్ కంపెనీ 2014 నుండి విక్రయిస్తున్న బిఎమ్‌డబ్ల్యూ సి ఎవల్యూషన్ (BMW C Evolution) ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సక్సెసర్ గా ఉంటుంది. బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ తమ సరికొత్త సిఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ ను 2022 ప్రారంభంలో యూరప్ మరియు ఇతర మార్కెట్ లలో విక్రయించనుంది.

BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్ ప్రారంభం; త్వరలో విడుదల!

బిఎమ్‌డబ్ల్యూసిఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ లో కంపెనీ 8.9 kWh బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించింది, ఇది స్కూటర్ లో శాశ్వతంగా కనెక్ట్ చేయబడిన ఎలక్ట్రిక్ మోటారుకు శక్తిని ఇస్తుంది. ఇందులోని లిక్విడ్ కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 20 బిహెచ్‌పిల శక్తిని జనరేట్ చేస్తుంది. హెవీ లోడ్‌పై ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 41.5 బిహెచ్‌పిల పూర్తి పవర్ అవుట్‌పుట్ ను అందిస్తుంది మరియు ఈ మోటార్ నిర్వహణ-రహిత (మెయింటినెన్స్ అవసరం లేని) బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా వెనుక చక్రానికి శక్తిని పంపిణీ చేస్తుంది.

BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్ ప్రారంభం; త్వరలో విడుదల!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని మోటార్ గరిష్టంగా 62 న్యూటన్ మీటర్ల టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్‌ కేవలం 2.6 సెకన్లలోనే గంటకు 0 నుండి 50 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు దీని గరిష్ట వేగాన్ని గంటకు 120 కిలోమీటర్లకు యాంత్రికంగా పరిమితం చేశారు. వరల్డ్ మోటార్‌సైకిల్ టెస్ట్ సైకిల్ (WMTC) టెస్టింగ్ ప్రోగ్రామ్ ప్రకారం, ఇందులోని 8.9 kWh బ్యాటరీ ప్యాక్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 130 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్ ప్రారంభం; త్వరలో విడుదల!

ఈ సరికొత్త రెట్రో మోడ్రన్ లుకింగ్ BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ రెండు విభిన్న ఛార్జింగ్ ఆప్షన్లను అందిస్తుంది. ఇందులో ఒకటి సాధారణ వాల్-మౌంటెడ్ హోమ్ ప్లగ్‌, 2.3kW ఛార్జింగ్ రేటుతో కూడిన హమో చార్జర్ సాయంతో దీని బ్యాటరీని మూడున్నర గంటల సమయంలో 0 నుండి 80 శాతం వరకూ ఛార్జ్ చేసుకోవచ్చు. క్విక్ చార్జింగ్ కోసం కస్టమర్‌లు బిఎమ్‌డబ్ల్యూ వాల్ బాక్స్‌ను ఎంచుకోవచ్చు లేదా CE 04 స్కూటర్‌ను పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్‌ల సాయంతో చార్జ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను 6.9 kW సామర్థ్యం కలిగిన ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం అరవై ఐదు నిమిషాల్లోనే 0 నుండి 80 శాతం వరకూ ఛార్జ్ చేసుకోవచ్చు.

BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్ ప్రారంభం; త్వరలో విడుదల!

బిఎమ్‌డబ్ల్యూ సిఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క విశిష్టమైన ఫీచర్, దాని యొక్క స్టాండ్‌అవుట్ డిజైన్. సిఈ 04 ఒరిజినల్ బ్లేడ్ రన్నర్ చిత్రంలో ఉపయోగించిన టూవీలర్ మాదిరిగా కనిపిస్తుంది. దీని డిజైన్ చూస్తుంటే, ఇది 1970 మరియు 1980 కాలంలోని వ్యక్తులను భవిష్యత్తులో స్కూటర్‌ని డిజైన్ చేయమని అడిగినప్పుడు, వారి ఆలోచనలకు ఆధునికతను జోడించినట్లుగా అనిపిస్తుంది. ఇంకోరకంగా చూస్తే, ఈ బిఎమ్‌డబ్ల్యూ సిఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ స్నోమొబైల్ లాగా కూడా కనిపిస్తుంది.

BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్ ప్రారంభం; త్వరలో విడుదల!

దీని ఓవరాల్ డిజైన్ బ్యాటరీ ప్యాక్ మరియు ఇ-స్కూటర్ యొక్క అండర్ బాడీలో ఉండే ఎలక్ట్రిక్ మోటారు చుట్టూ ఆధారపడి ఉంటుంది. బిఎమ్‌డబ్ల్యూ సిఈ 04 కర్వ్డ్ V-ఆకారపు ఎల్ఈడి హెడ్‌లైట్ యూనిట్‌తో కార్వ్ చేయబడిన ఫ్రంట్ ఎండ్‌ను కలిగి ఉంటుంది. సైడ్ నుండి చూసినప్పుడు, BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ స్టాండ్‌అవుట్ ఫీచర్లలో స్నాజీ అల్లాయ్ వీల్స్, హై ఫ్లోర్ సెక్షన్ మరియు ఇరుకైన బైక్ సీటు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్ ప్రారంభం; త్వరలో విడుదల!

ఇంకా ఇందులో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ మరియు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, కనెక్టివిటీ ఫీచర్లతో కూడిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పూర్తి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్‌లు మరియు ఎల్ఈడి టైల్‌లైట్ మొదలైనవి ఉన్నాయి. అంతేకాకుండా, ఇంటిగ్రేటెడ్ మ్యాప్‌లు, నావిగేషన్ మరియు ఇతర కనెక్టివిటీ ఫీచర్‌లతో కూడిన పెద్ద 10.25 ఇంచ్ టిఎఫ్‌టి కలర్ స్క్రీన్‌, యూఎస్‌బి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ మరెన్నో ఇతర స్మార్ట్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్ ప్రారంభం; త్వరలో విడుదల!

కొత్త BMW CE-04 ప్యూర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్‌బోర్డ్‌లో అనేక సాంకేతికతలు కూడా ఉన్నాయి. వీటిలో పలు ఎలక్ట్రానిక్స్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ యొక్క ప్రీమియమ్ హై-ఎండ్ మోటార్‌సైకిళ్లలో అందుబాటులో ఉండే కొన్ని రకాల ఫీచర్లకు సమానంగా ఉంటాయి. ఈ సాంకేతికతలలో ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ASC), డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ (DTC) మరియు స్కూటర్ ను సులువుగా వెనక్కి తిప్పడం రివర్స్ గేర్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్ ప్రారంభం; త్వరలో విడుదల!

కొత్త BMW CE-04 ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ 2022 ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్‌లో షోరూమ్‌లలోకి వస్తుందని ఆశిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లలో దీని బేస్ మోడల్ ధర సుమారు 12,000 డాలర్ల వరకూ ఉండొచ్చని అంచనా. కాగా, BMW Motorrad ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లోకి తీసుకువస్తుందా లేదా అనే విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. అయితే, భారతదేశంలో కూడా ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణను పరిగణలోకి తీసుకుంటే, ఈ కొత్త బిఎమ్‌బ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇక్కడి మార్కెట్లో విజయం సాధించే అవకాశాలు లేకపోలేదు.

More from DriveSpark

Article Published On: Monday, November 22, 2021, 17:33 [IST]
English summary
Bmw motorrad starts production of ce 04 electric scooter details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+