కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ బిఎస్6 టీజర్; త్వరలోనే ఇండియా లాంచ్!

జర్మన్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ మరొక కొత్త సూపర్‌బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ బిఎస్-6 వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ బిఎస్6 టీజర్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఈ మేరకు కంపెనీ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ మోటార్‌సైకిల్ టీజర్‌ను కూడా విడుదల చేసింది. ది కింగ్ ఆఫ్ అడ్వెంచర్! అనే ట్యాగ్‌లైన్‌తో కంపెనీ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ మోటార్‌సైకిల్ టీజర్‌ను లాంచ్ చేసింది.

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ బిఎస్6 టీజర్; త్వరలోనే ఇండియా లాంచ్!

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ అనేది ఒక అడ్వెంచర్ మోటార్‌సైకిల్. ఆఫ్-రోడ్ మరియు టూరింగ్ ప్రయోజనాల కోసం ఈ మోటార్‌సైకిల్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ స్టాండర్డ్ మరియు అడ్వెంచర్ అనే రెండు మోడళ్లలో అందుబాటులోకి రానుంది.

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ బిఎస్6 టీజర్; త్వరలోనే ఇండియా లాంచ్!

బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ వీటిని సిబియు (కంప్లీట్లీ బిల్ట్-అప్ యూనిట్లు)గా పూర్తిగా విదేశాల్లో తయారైన మోడళ్లను భారతదేశంలోనికి దిగుమతి చేసుకొని విక్రయించే అవకాశం ఉంది. ఫలితంగా, వీటి ధరలు కూడా సుమారు రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉంటాయని అంచనా.

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ బిఎస్6 టీజర్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఆర్ 1250 జిఎస్ బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ యొక్క ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్. మునుపటి మోడల్‌తో పోలిస్తే, ఈ కొత్త 2021 మోడల్‌లో కంపెనీ అనేక మార్పులు, చేర్పులు చేసింది. అప్‌గ్రేడ్ చేయబడిన డిజైన్, ఇంజన్, ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీ మరియు కొత్త రంగులతో ఇవి లభ్యం కానున్నాయి.

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ బిఎస్6 టీజర్; త్వరలోనే ఇండియా లాంచ్!

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ స్టాండర్డ్ వేరియంట్ ట్రిపుల్ బ్లాక్, లైట్ వైట్స, ర్యాలీ అనే మూడు కలర్లలో లభ్యం కానుంది. అలాగే, ఇందులోని అడ్వెంచర్ వేరియంట్ ట్రిపుల్ బ్లాక్, ఐస్ గ్రే మరియు ర్యాలీ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ బిఎస్6 టీజర్; త్వరలోనే ఇండియా లాంచ్!

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త 2021 మోడల్ బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ డిజైన్‌లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏమీ లేవు. ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ముందు భాగంలో, ప్రత్యేకంగా రూపొందించిన హెడ్‌ల్యాంప్, ఫ్రంట్ బీక్ మరియు సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్ ఉంటాయి.

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ బిఎస్6 టీజర్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఈ కొత్త మోటారుసైకిల్‌లో రీడిజైన్ చేసిన సీటింగ్ పొజిషన్ కారణంగా, రైడర్ ఇప్పుడు మరింత నిటారుగా మరియు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఇందులో సింగిల్-పీస్ రైజ్డ్ హ్యాండిల్ బార్, బాగా కుషన్ చేయబడిన సీట్లు, ఆఫ్-రోడ్ బయాస్డ్ గ్రిప్పీ ఫుట్‌పెగ్స్ మరియు రైడర్ మోకాలి విరామం (క్నీ రెస్ట్) కోసం సౌకర్యమైన ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్ ఉంటాయి.

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ బిఎస్6 టీజర్; త్వరలోనే ఇండియా లాంచ్!

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ ఆఫ్-రోడ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో రైడర్ చేతులకి రక్షణగా ఉండే నకల్ గార్డ్స్, క్రాష్ ప్రొటెక్టర్స్, టైర్ హగ్గర్స్, ఇంజన్ సంప్ గార్డ్ మరియు ఆప్షనల్ పన్నీర్ స్టోరేజ్ బాక్సులు మొదలైనవి ఉన్నాయి.

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ బిఎస్6 టీజర్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఈ బైక్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో బాక్సర్ కాన్ఫిగరేషన్‌లో ఉన్న ట్విన్-సిలిండర్ 1254సిసి ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ ఇప్పుడు యూరో 5 లేదా బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడింది. ఈ ఇంజన్ గరిష్టంగా 7,750 ఆర్‌పిఎమ్ వద్ద 134 బిహెచ్‌పి శక్తిని మరియు 6,250 ఆర్‌పిఎమ్ వద్ద 143 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది.

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ బిఎస్6 టీజర్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది మరియు ఇది స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో స్టాండర్డ్‌గా లభిస్తుంది. ఇది ఇత మోటార్‌సైకిళ్ల మాదిరిగా చైన్ డ్రైవ్‌తో కాకుండా షాఫ్ట్ డ్రైవ్‌తో పనిచేస్తుంది. ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి: ఎకో, రోడ్ మరియు రైన్.

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ బిఎస్6 టీజర్; త్వరలోనే ఇండియా లాంచ్!

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ మోటార్‌సైకిల్‌లో బిఎమ్‌డబ్ల్యూ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌తో కూడిన 6.5 ఇంచ్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఈ మోటారుసైకిల్ యొక్క అన్ని ఫీచర్లను స్విచ్ గేర్ మరియు ఈ టిఎఫ్‌టి డిస్‌ప్లే సిస్టమ్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు.

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ బిఎస్6 టీజర్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఇంకా ఇందులో యూఎస్‌బి సాకెట్, ఇంటిగ్రల్ ఏబిఎస్ ప్రో, హిల్ స్టార్ట్ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, సిక్స్-యాక్సిస్ ఐఎమ్‌యూ మరియు పూర్తి-ఎల్ఈడి లైటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులోని స్టాండర్డ్ వేరియంట్ 20 లీటర్ల ఇంధన ట్యాంక్‌తో వస్తుంది. మరియు అడ్వెంచర్ వేరియంట్ 30 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉండి, సదూర ప్రయాణాలకు అనువుగా ఉంటుంది.

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ బిఎస్6 టీజర్; త్వరలోనే ఇండియా లాంచ్!

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్‌లో ఇరువైపులా పూర్తిగా సర్దుబాటు చేయగల సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. కంపెనీ ఈ సస్పెన్షన్ సెటప్ కోసం ఆప్షనల్ ఎలక్ట్రానిక్ అడ్జస్టబల్ ఫీచర్‌ను కూడా అందిస్తుంది. స్టాండర్డ్ మోడల్‌ను టూరింగ్ ప్రయోజనం కోసం రూపొందించిన నేపథ్యంలో, ఇందులో అల్లాయ్ వీల్స్ ఉంటాయి. అలాగే, అడ్వెంచర్ వేరియంట్‌లో ఆఫ్-రోడ్ ప్రయోజనం కోసం స్పోక్డ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 జిఎస్ బిఎస్6 టీజర్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఈ బైక్ ముందు భాగంలో 37 మిమీ బిఎమ్‌డబ్ల్యూ టెలిలీవర్ యుఎస్‌డి ఫోర్కులు మరియు వెనుక భాగంలో సింగిల్ సైడ్ స్వింగార్మ్‌తో కూడిన మోనో-షాక్ యూనిట్ ఉంటాయి. అలాగే, బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు నాలుగు-పిస్టన్ రేడియల్ కాలిపర్‌లతో కూడిన డ్యూయల్ 305 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు రెండు-పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌తో కూడిన సింగిల్ 276 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి.

Most Read Articles

English summary
BMW Motorrad Teases New 2021 BMW R 1250 GS BS6, India Launch Expected Soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X