బిఎస్6 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ బైక్ వస్తోంది: డీటేల్స్

జర్మన్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్, త్వరలోనే భారత మార్కెట్లో తమ కొత్త ఎస్1000ఆర్ సూపర్ బైక్ యొక్క బిఎస్-6 వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త వెర్షన్‌లో ఇంజన్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ కూడా ఉండనున్నాయి.

బిఎస్6 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ బైక్ వస్తోంది: డీటేల్స్

బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ ఇండియా తమ సోషల్ మీడియా ఛానెళ్ల ద్వారా కొత్త ఎస్1000ఆర్ లాంచ్‌ను ధృవీకరించింది. అయితే, ఈ కొత్త వెర్షన్ మోటార్‌సైకిల్ యొక్క ఖచ్చితమైన విడుదల తేదీకి సంబంధించి మాత్రం కంపెనీ ఎలాంటి టైమ్‌లైన్‌ను వెల్లడించలేదు.

బిఎస్6 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ బైక్ వస్తోంది: డీటేల్స్

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ నేక్డ్ రోడ్‌స్టర్‌లో అనేక స్టైలింగ్ మరియు మెకానికల్ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. ఇది కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ మరియు ఎఫ్900ఆర్ మోడళ్ల మాదిరిగానే కొత్త హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంటుంది.

బిఎస్6 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ బైక్ వస్తోంది: డీటేల్స్

ఈ బైక్‌లోని ఫ్యూయెల్ ట్యాంక్, రేడియేటర్ కవర్స్ మరియు బెల్లీ పాన్‌లను కూడా రీడిజైన్ చేశారు. ఈ మార్పులతో ఇది పాత వెర్షన్ కంటే మరింత షార్ప్‌గా కనిపిస్తుంది. త్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ బైక్‌లో స్టైలింగ్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా ఇంజన్ అప్‌గ్రేడ్ కూడా ఉంటుంది.

బిఎస్6 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ బైక్ వస్తోంది: డీటేల్స్

ఈ నేక్డ్ రోడ్‌స్టెర్ ఇప్పుడు అప్‌డేటెడ్ బిఎస్6 కంప్లైంట్ 999సిసి, ఇన్‌లైన్-ఫోర్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 165 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 9,250 ఆర్‌పిఎమ్ వద్ద 115 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బిఎస్6 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ బైక్ వస్తోంది: డీటేల్స్

కొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ మొత్తం బరువు 199 కిలోలుగా ఉంటుంది. ఈ బైక్ బరువును తగ్గించాలనుకునే వారు ఫోర్జ్డ్ అల్లాయ్ వీల్స్ మరియు కార్బన్-ఫైబర్ హూప్స్ వంటి ఆప్షనల్ యాక్ససరీలను ఉపయోగించి, బైక్ బరువును మరింత తగ్గించుకోవచ్చు.

బిఎస్6 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ బైక్ వస్తోంది: డీటేల్స్

ఇక ఈ బైక్‌లో లభించబోయే ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో పూర్తి-ఎల్ఈడి లైటింగ్ మరియు 6.5 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్ల గురించి చెప్పుకుంటే, ఇందులో మూడు రైడింగ్ మోడ్‌లు (రెయిన్, రోడ్ మరియు డైనమిక్), యాంటీ-వీలీ కంట్రోల్, కార్నరింగ్ సామర్థ్యంతో కూడిన ఏబిఎస్ ప్రో మరియు డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

బిఎస్6 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ బైక్ వస్తోంది: డీటేల్స్

ఈ కొత్త మోడల్‌లో చేసిన మార్పుల చేర్పుల కారణంగా, దీని ధర మునుపటి కంటే కాస్తంత ఎక్కువగా ఉండొచ్చని అంచనా. భారత మార్కెట్లో ఇదివరకు బిఎస్4 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ మోటార్‌సైకిల్‌ను రూ.16.70 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకు విక్రయించే వారు.

బిఎస్6 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ బైక్ వస్తోంది: డీటేల్స్

బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ ఈ ఏడాది భారత మార్కెట్ కోసం పలు కొత్త మోడళ్లను విడుదల చేయాలని యోచిస్తోంది. ఇటీవల అప్‌డేటెడ్ జి310 ట్విన్ బైక్‌లను ప్రారంభించిన, బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ ఈ బైక్‌ల విషయంలో గొప్ప విజయాన్ని సాధించింది.

Most Read Articles

English summary
BMW Motorrad To Launch New BS6 Complaint S1000R In India Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X