2020లో బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జోరు; అంతా 310 ట్విన్స్ మోడళ్ల పుణ్యమే!

జర్మన్ లగ్జీరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్, గడచిన 2020 క్యాలెండర్ ఇయర్‌లో మొత్తం 2,563 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి, అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 6.7 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొంది.

2020లో బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జోరు; అంతా 310 ట్విన్స్ మోడళ్ల పుణ్యమే!

గతేడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో, దేశంలో కష్టతరమైన మార్కెట్ పరిస్థితులు ఉన్నప్పటికీ, కంపెనీ వాటిని అధిగమించి ప్రోత్సాహకర వృద్ధిని నమోదు చేసింది. గత 2020 చివరి త్రైమాసికంలో (అక్టోబర్ - డిసెంబర్) కంపెనీ అనూహ్యంగా 51 శాతం వృద్ధిని నమోదు చేసింది.

2020లో బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జోరు; అంతా 310 ట్విన్స్ మోడళ్ల పుణ్యమే!

గడచిన 2020 సంవత్సరంలో బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ అమ్మకాలు ఒక్కసారిగా జోరందుకోవటానికి ప్రధాన కారణం, కంపెనీ విడుదల చేసిన బిఎస్6 జి310ఆర్ మరియు జి310జిఎస్ మోడళ్లే. అక్టోబర్ 2020లో విడుదలైన ఈ లో-బడ్జెట్ ప్రీమియం మోటార్‌సైకిళ్లు కంపెనీ అమ్మకాల పెరుగుదలకు తోడ్పడ్డాయి.

MOST READ:టెస్లా ప్రియులకు శుభవార్త.. టెస్లా ఇప్పుడు భారత్‌కి వచ్చేస్తుందోచ్

2020లో బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జోరు; అంతా 310 ట్విన్స్ మోడళ్ల పుణ్యమే!

భారతదేశంలో 2020 సంవత్సరానికి సంబంధించి మొత్తం బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ అమ్మకాల్లో 80 శాతం వాటాను ఈ రెండు మోడళ్లే కలిగి ఉన్నాయి. రెండు ఎంట్రీ లెవల్ మోడళ్లే కాకుండా, బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, ఆర్ 1250 జిఎస్ / జిఎస్‌ఎ మరియు ఎఫ్ 750 / 850 జిఎస్ వంటి ఇతర ఉత్పత్తులపై కూడా మోటారుసైకిల్ ఔత్సాహికులు ఎక్కువ ఇష్టాన్ని కనబరచారు.

2020లో బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జోరు; అంతా 310 ట్విన్స్ మోడళ్ల పుణ్యమే!

పైన పేర్కొన్న మోడళ్లే కాకుండా, బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ గతేడాది భారత మార్కెట్లో అనేక కొత్త మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టింది. వీటిలో ఎఫ్ 900 ఆర్, ఎఫ్ 900 ఎక్స్‌ఆర్, ఎస్ 1000 ఎక్స్‌ఆర్ మరియు ఆర్ 18 క్రూయిజర్ ఉన్నాయి.

MOST READ:డోనాల్డ్ ట్రంప్ వాడిన కారు వేలంలో పాల్గొంటున్న ఇండియన్, ఎవరో తెలుసా ?

2020లో బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జోరు; అంతా 310 ట్విన్స్ మోడళ్ల పుణ్యమే!

అమ్మకాలను పెంచుకునేందుకు, కస్టమర్లకు సులువైన యాజమాన్య విధానాలను అందించేందుకు బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ తమ వినియోగదారుల కోసం సౌకర్యవంతమైన ఫైనాన్స్ పరిష్కారాలను కూడా ప్రవేశపెట్టింది. గత 2020లో బ్రాండ్ అమ్మకాల పనితీరు మెరుగుపడటానికి ఇది కూడా సహాయపడింది.

2020లో బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జోరు; అంతా 310 ట్విన్స్ మోడళ్ల పుణ్యమే!

ఇక బిఎమ్‌డబ్ల్యూ 310 ట్విన్స్ విషయానికి వస్తే, ఈ జర్మన్ కంపెనీ గడచిన అక్టోబర్ నెల ఆరంభంలో వీటిని మార్కెట్లో విడుదల చేసింది. అప్పట్లో బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్ ధర రూ.2.45 లక్షలు మరియు బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్ ధర రూ.2.85 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)గా ఉండేవి.

MOST READ:పేస్ మాస్క్ విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ

2020లో బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జోరు; అంతా 310 ట్విన్స్ మోడళ్ల పుణ్యమే!

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఈ రెండు మోటార్‌సైకిళ్లను తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. ఇవి రెండూ 313 సిసి, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్ట్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉండి ఒకేరకమైన పవర్, టార్క్ గణాంకాలను ఉత్పత్తి చేస్తాయి.

2020లో బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ జోరు; అంతా 310 ట్విన్స్ మోడళ్ల పుణ్యమే!

ఈ ఇంజన్ గరిష్టంగా 33.1 బిహెచ్‌పి శక్తిని మరియు 28 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ముందు వైపు అప్-సైడ్ డౌన్ మరియు వెనుక వైపు మోనో షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఇంకా ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, ఇవి రెండూ డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

MOST READ:నిండు ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్.. ఎలా అనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

Most Read Articles

English summary
BMW Motorrad Registers Annual Growth Of 6.7% In 2020; Led By 310 Twins. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X