కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్: పూర్తి వివరాలు

ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత, స్క్రీన్ రచయిత మరియు డైరెక్టర్ అయిన 'కిరణ్ రావు' గురించి దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. కిరణ్ రావు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మాజీ భార్య. ఈమె చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కైవసం చేసుకుంది. కిరణ్ రావు డైరెక్టర్ గా మరియు అమీర్ ఖాన్ మాజీ భార్యగా మాత్రమే చాలామందికి తెలుసు, కానీ ఈమె తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలోని వనపర్తి సంస్థానం రాజా జే.రామేశ్వర్ రావు గారి మనవరాలు కూడా.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్: పూర్తి వివరాలు

ఇటీవల కిరణ్ రావుకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వెలువడ్డాయి. ఇందులో ఈమె ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన Bajaj (బజాజ్) కంపెనీ యొక్క Chetak (చేతక్) ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్: పూర్తి వివరాలు

కిరణ్ రావు కొనుగోలు చేసిన కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ టోపాజ్ బ్లూ కలర్‌తో వస్తుంది. ఈ స్కూటర్ యొక్క ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ పెయింట్ స్కీమ్ కంపెనీ అందించదు. అయితే ప్రత్యేక పెయింట్ స్కీమ్ కారణంగా, కిరణ్ రావు యొక్క బజాజ్ చేతక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్: పూర్తి వివరాలు

బైక్ మరియు స్కూటర్ తయారీదారు బజాజ్ ఆటో 14 సంవత్సరాల తర్వాత చేతక్ నేమ్‌ప్లేట్‌ను తిరిగి తీసుకువచ్చింది. అయితే ఈసారి కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చేతక్ నేమ్‌ప్లేట్‌ను ఉపయోగించింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో TVS iQube, Ather 450, Simple Energy One మరియు Ola S1 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్: పూర్తి వివరాలు

బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లో అర్బన్ మరియు ప్రీమియం అనే రెండు వేరియంట్లలో విక్రయిస్తోంది. Bajaj కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ అర్బన్ వేరియంట్ ధర రూ. 1.42 లక్షలు మరియు ప్రీమియం వేరియంట్ ధర రూ .1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూణే).

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్: పూర్తి వివరాలు

Bajaj Chetak ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా అద్భుతమైన డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ 3.8 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌తో 3 kWh IP-67 లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఇది రిమూవబుల్ బ్యాటరీ కాదు. అయితే ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న బజాజ్ చేతక్ యొక్క ప్రత్యర్థి ఎలక్ట్రిక్ స్కూటర్ TVS iQube మరియు Ather 450X లలో కూడా రిమూవబుల్ బ్యాటరీ లేదు.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్: పూర్తి వివరాలు

Bajaj Chetak ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి పూర్తి ఛార్జింగ్ తో ఎకో మోడ్‌లో 95 కిమీ రేంజ్ ఇస్తుంది. అదే సమయంలో, దీని గరిష్ట వేగం గంటకు 70 కిమీ వరకు ఉంటుంది. 5 ఆంపియర్ పవర్ సాకెట్ నుండి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటలు పడుతుంది.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్: పూర్తి వివరాలు

Bajaj Chetak ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే, ఈ ఐకానిక్ బ్రాండ్ రెట్రో మోడ్రన్ లుక్ తో ఉంటుంది. ముందు వైపు నుండి మోడ్రన్ స్కూటర్ లా మరియు సైడ్ నుండి రెట్రో క్లాసిక్ చేతక్ స్కూటర్ లా కనిపిస్తుంది. ఇందులో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్ ఉంటాయి.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్: పూర్తి వివరాలు

ఇంకా ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్ టచ్ యాక్టివేట్ స్విచ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్, యుఎస్‌బి పోర్ట్, అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్ మరియు లైవ్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను కంపెనీ పూణేలోని ప్లాంట్‌లో తయారు చేస్తోంది.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్: పూర్తి వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని అర్బన్ వేరియంట్ సిట్రస్ రష్ మరియు సైబర్ వైట్ అనే రెండు రకాల కలర్ ఆప్షన్స్‌లో, అదే విధంగా ప్రీమియం వేరియంట్ హజల్‌నట్, బ్రూక్లిన్ బ్లాక్, సిట్రస్ రష్, వెలుట్టో రొస్సో మరియు ఇండిగో మెటాలిక్ అనే ఐదు విభిన్న రంగుల్లో లభిస్తుంది.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్: పూర్తి వివరాలు

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూణేలోని కంపెనీ ప్లాంట్‌లో తయారు చేయబడుతుంది. ఇటీవల బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూణే మరియు బెంగళూరు కోసం మాత్రమే బుక్ చేయడం ప్రారంభించింది. Bajaj Chetak ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కేవలం రూ. 2,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Bollywood director and producer kiran rao buys new bajaj chetak electric scooter details
Story first published: Friday, October 22, 2021, 14:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X