ఒక్క ఛార్జ్‌తో 200 కిమీ వెళ్లే Corbett ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. త్వరపడండి

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో తమిళనాడుకు చెందిన బూమ్ మోటార్స్ (Boom Motors) కంపెనీ కార్బెట్ ఈవి (Corbett EV) అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభించింది. ఇది భారతీయ మార్కెట్లో అత్యంత బలమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అని కంపెనీ పేర్కొంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్‌ను దేశీయ మార్కెట్లో రూ. 89,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ 2021 నవంబర్ 12 నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఒక్క ఛార్జ్‌తో 200 కిమీ వెళ్లే Corbett ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. త్వరపడండి

ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త కార్బెట్ ఈవి (Corbett EV) ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి చాలా సింపుల్ గా మరియు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బూమ్ మోటార్స్ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో పరిచయం చేయబడింది. అవి సింగిల్ బ్యాటరీతో కూడిన కార్బెట్ 14 మరియు డబుల్ బ్యాటరీతో కూడిన కార్బెట్ 14-EX స్కూటర్స్.

ఒక్క ఛార్జ్‌తో 200 కిమీ వెళ్లే Corbett ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. త్వరపడండి

పూర్తిగా ఛార్జ్ చేసిన తరువాత, కార్బెట్ 14 స్కూటర్ 100 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అదే సమయంలో కార్బెట్ 14-EX స్కూటర్స్ దాదాపు 200 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. మొత్తానికి ఈ స్కూటర్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కావున ఇది నగర పరిస్థితుల్లో చాలా మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

ఒక్క ఛార్జ్‌తో 200 కిమీ వెళ్లే Corbett ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. త్వరపడండి

ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో, కార్బెట్ 14 గరిష్టంగా 3 కిలోవాట్ మరియు కార్బెట్ 14-EX 4 కిలోవాట్ శక్తిని ఉత్పత్తి చేయగలదు. రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు హై స్పీడ్ సెగ్మెంట్‌లో విడుదల చేయబడ్డాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల గరిష్ట వేగం వరుసగా 65 కిమీ/గం మరియు 75 కిమీ/గం వరకు ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 200 కిమీ వెళ్లే Corbett ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. త్వరపడండి

కార్బెట్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ ను సాధారణ ఛార్జర్‌తో ఛార్జ్ చేయడానికి 4 గంటలు సమయం పడుతుంది. అదే సమయంలో ఫాస్ట్ ఛార్జ్‌తో ఛార్జ్ చేయడానికి కేవలం 2.5 గంటలు మాత్రమే పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 30-లీటర్ల బూట్ స్పేస్ ఉంది. అంతే కాకుండా ఇందులోని స్టోరేజ్ స్పేస్‌ను పెంచడానికి యాక్ససరీస్ జోడించవచ్చు. ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 200 కిమీ వెళ్లే Corbett ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. త్వరపడండి

బూమ్ మోటార్స్ దేశీయ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ సీఈఓ తెలిపారు. ఇందులో భాగంగానే కంపెనీ కేవలం 18 నెలల్లో కార్బెట్ ఈ-స్కూటర్‌ను అంతర్గతంగా అభివృద్ధి చేసినట్లు కూడా బూమ్ మోటార్స్ అధికారికంగా తెలిపింది.

ఒక్క ఛార్జ్‌తో 200 కిమీ వెళ్లే Corbett ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. త్వరపడండి

కంపెనీ ఇప్పుడు తన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై 7 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. అయితే IoT-ప్రారంభించబడిన స్మార్ట్ బ్యాటరీ 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది. బ్యాటరీ జీవితకాలం ముగిసిన తర్వాత, బూమ్ మోటార్స్ దానిని కస్టమర్ నుండి తిరిగి కొనుగోలు చేస్తుంది మరియు అది రీసైకిల్ చేయబడుతుంది.

ఒక్క ఛార్జ్‌తో 200 కిమీ వెళ్లే Corbett ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. త్వరపడండి

బూమ్ మోటార్స్ తన కోయంబత్తూర్ ప్లాంట్‌లో ప్రతి సంవత్సరం 1,00,000 యూనిట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని మరియు కొత్త ప్లాంట్ కోసం స్థానాలను కూడా అన్వేషిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే కంపెనీ యొక్క మొత్తం సరఫరా గొలుసులో 90 శాతం వరకు తమిళనాడు వెలుపల ఉందని చెబుతోంది.

ఒక్క ఛార్జ్‌తో 200 కిమీ వెళ్లే Corbett ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. త్వరపడండి

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మరింత మన్నికైనదిగా ఉండటానికి, కంపెనీ ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో పోలిస్తే 40 శాతం తక్కువ భాగాలను ఉపయోగించింది. ఈ కారణంగా విచ్ఛిన్నమయ్యే అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుంది. కంపెనీ టీవీఎస్ గ్రూప్ యాజమాన్యంలోని KI మొబిలిటీతో భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉంది. దీని ద్వారా తన కస్టమర్‌లు దేశవ్యాప్తంగా 24,000 సర్వీస్ టచ్‌పాయింట్‌లను చేరుకోవడానికి అనుమతిస్తుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలమగా ఉంటుంది. కావున అద్భుతమైన సర్వీస్ వంటి వాటిని కూడా కొనుగోలుదారులు పొందవచ్చు.

ఒక్క ఛార్జ్‌తో 200 కిమీ వెళ్లే Corbett ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. త్వరపడండి

అయితే కంపెనీ యొక్క అమ్మకాల విషయానికి వస్తే, ఈ కొత్త కార్బెట్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని బూమ్ మోటార్స్ తెలిపింది. బుక్ చేసుకున్న కస్టమర్లకు 2022 జనవరి నాటికి 60 మంది డీలర్‌లను జోడించి, వచ్చే 6 నెలల్లో దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కార్బెట్ 14 స్కూటర్ ని కేవలం రూ. 1,699 మరియు కార్బెట్ 14-ఎక్స్ స్కూటర్ ని రూ. 2,499 నుండి EMI ప్లాన్‌లతో కొనుగోలు చేయవచ్చు.

ఒక్క ఛార్జ్‌తో 200 కిమీ వెళ్లే Corbett ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. త్వరపడండి

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వాణిజ్య ఉపయోగం కోసం డెలివరీ వంటి ప్రక్రియల కోసం చాలా అనుకూలంగా ఉంటాయి. కావున మంచి అమ్మకాలతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని మేము ఆశిస్తున్నాము. కంపెనీ ఇక బుకింగ్స్ ప్రారంభిస్తుంది కావున ఏ స్థాయిలో అమ్మకాలను జరపనుందో త్వరలో తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 11, 2021, 19:09 [IST]
English summary
Boom motors launches corbett ev with 200 kms of range price features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+