మీకు తెలుసా.. Bounce Infinity E1 స్కూటర్‌లోని టాప్ 5 ఫీచర్స్.. ఇవే

భారతీయ మార్కెట్లో బౌన్స్ ఎట్టకేలకు తన ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన ఇన్ఫినిటీ E1 విడుదల చేసింది. అయితే ఈ స్కూటర్ మిగిలిన కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే కూడా ఛార్జింగ్ సమయాన్ని మరింత అధిగమించడానికి ఒక అద్భుతమైన పరిష్కారం అందించింది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లోని టాప్ 5 ఫీచర్స్ గురించి మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

మీకు తెలుసా.. Bounce Infinity E1 స్కూటర్‌లోని టాప్ 5 ఫీచర్స్.. ఇవే

Bounce Infinity E1 ఎక్స్టీరియర్:

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ గా ఉన్నప్పటికీ చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఇందులో హ్యాండిల్‌బార్, ఇంటిగ్రేటెడ్ ట్రైయాంగిల్ రియర్ ఫుట్‌పెగ్‌లు, రియర్ డిస్క్ బ్రేక్ మరియు రియర్ వీల్ మౌంటెడ్ హబ్ వంటి ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది. కావున ఇది చూడచక్కగా ఉంటుంది. అంతే కాకూండా ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్శించడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.

మీకు తెలుసా.. Bounce Infinity E1 స్కూటర్‌లోని టాప్ 5 ఫీచర్స్.. ఇవే

స్పేస్:

మార్కెట్లో విడుదలైన ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్ బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ప్రజారహదారిపైన ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉండేవిధంగా రూపొందించబడింది.

కావున ఈ స్కూటర్ లో మంచి ఫుట్ స్పేస్, క్నీ రూమ్ మరియు పిలియన్ కోసం తగినంత స్థలం ఇందులో అందుబాటులో ఉంటాయి. కొత్త బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అండర్ సీట్ స్టోరేజీ కెపాసిటీ ఇందులో కేవలం 12-లీటర్లు మాత్రమే ఉంటుంది, కావున ఇది అన్ని సందర్భాలలోనూ సరిపోయే విధంగా ఉండదు.

మీకు తెలుసా.. Bounce Infinity E1 స్కూటర్‌లోని టాప్ 5 ఫీచర్స్.. ఇవే

Bounce Infinity E1 ఫీచర్స్:

భారతేదేశంలో విడుదలవుతున్న కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. కావున Bounce Infinity E1 కూడా వాటికి ఏ మాత్రం తీసిపోకుండా ఉండే అనేక ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో LED లైటింగ్ సెటప్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్‌లు, LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్లు, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్ వంటి ఉంటాయి.

మీకు తెలుసా.. Bounce Infinity E1 స్కూటర్‌లోని టాప్ 5 ఫీచర్స్.. ఇవే

అంతే కాకుండా ఇందులో రిమోట్ ట్రాకింగ్, జియోఫెన్సింగ్, రివర్సింగ్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్, టో అలర్ట్ మరియు యాంటీ థెఫ్ట్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఒక ప్రత్యేక "డ్రాగ్" మోడ్ కూడా ఉంది, ఇది పంక్చర్ విషయంలో క్రీప్ మోడ్‌లో స్కూటర్‌ను ఉపయోగించడానికి వినియోగదారుని అనుమతిస్తుంది. కావున ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

మీకు తెలుసా.. Bounce Infinity E1 స్కూటర్‌లోని టాప్ 5 ఫీచర్స్.. ఇవే

Bounce Infinity E1 పవర్ ట్రైన్:

కంపెనీ ఈ స్కూటర్‌లో 48వి IP67 సర్టిఫైడ్ వాటర్‌ప్రూఫ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించింది. కావున ఈ స్కూటర్‌ను ఏదైనా సాధారణ ఎలక్ట్రిక్ సాకెట్ నుండి ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్ లో ఉండే బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ (0% నుంచి 100%) చేసుకోవడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.

మీకు తెలుసా.. Bounce Infinity E1 స్కూటర్‌లోని టాప్ 5 ఫీచర్స్.. ఇవే

బౌన్స్ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ 83 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది కేవలం 8 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. బౌన్స్ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 65 కిమీగా రేట్ చేయబడింది మరియు ఎకో మోడ్‌లో 85 కిమీల పరిధిని కలిగి ఉంది.

మీకు తెలుసా.. Bounce Infinity E1 స్కూటర్‌లోని టాప్ 5 ఫీచర్స్.. ఇవే

బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ లోని అత్యంత ఆసక్తికరమైన ఫీచర్ దాని 2 kWh మార్చుకోగల బ్యాటరీ ప్యాక్. Bounce Infinity యాప్‌ని ఉపయోగించి ఏదైనా Bounce Infinity ఛార్జింగ్ స్టేషన్‌లో బ్యాటరీ ప్యాక్‌ని మార్చుకోవచ్చు. ఇది వినియోగదారుల సమయాన్ని చాలావరకు ఆదా చేస్తుంది.

మీకు తెలుసా.. Bounce Infinity E1 స్కూటర్‌లోని టాప్ 5 ఫీచర్స్.. ఇవే

Bounce Infinity E1 ప్రైస్:

బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 68,999 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అయితే ఈ స్కూటర్ కొనుగోలు చేసేవారికి FAME II సబ్సిడీ కూడా అందుతుంది. కావున స్కూటర్ ధర చాలావరకు తగ్గుతుంది. ఈ స్కూటర్‌ను 'బ్యాటర్ యాజ్ ఎ సర్వీస్'ని ఎంచుకోవడం ద్వారా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. 'బ్యాటరీగా సర్వీస్'ని ఎంచుకోవడం ద్వారా, వినియోగదారులు బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 36,000 కంటే తక్కువ మొత్తంతో పొందవచ్చు.

మీకు తెలుసా.. Bounce Infinity E1 స్కూటర్‌లోని టాప్ 5 ఫీచర్స్.. ఇవే

మొత్తానికి కొత్త Bounce Infinity E1 స్కూటర్ భారతీయ మార్కెట్లో విడుదలైంది. అయితే ఇది మార్కెట్లో ఎలాంటి బుకింగ్స్ పొందుతుంది, ఎలాంటి ఆదరణ పొందుతుంది అనే విషయం త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
Bounce infinity e1 electric scooter top five things to know
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X