భారత మార్కెట్లో బిఎస్6 బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ విడుదల: ధర, ఫీచర్లు
ఇటాలియన్ సూపర్‍బైక్ కంపెనీ బెనెల్లి, భారత మార్కెట్లో తమ కొత్త 2021 మోడల్ బిఎస్6 టిఆర్‌కె 502ఎక్స్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. మీడిల్-వెయిట్ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ విభాగంలో వచ్చిన ఈ బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ ధర రూ.5.19 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బిఎస్6 బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ ధర దాని మునుపటి బిఎస్4 ధర కంటే రూ.31,000 తక్కువగా ఉంటుంది. కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను మెటాలిక్ డార్క్ గ్రే, వైట్ మరియు రెడ్ కలర్ స్కీమ్‌లలో విడుదల చేసింది. వీటి ధరలు ఇలా ఉన్నాయి:
* బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ - గ్రే : రూ.5.19 లక్షలు
* బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ - రెడ్ : రూ.5.29 లక్షలు
* బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ - వైట్ : రూ.5.29 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

మెటాలిక్ డార్క్ గ్రే కలర్‌తో పోల్చుకుంటే, రెడ్ మరియు వైట్ కలర్లలో లభించే బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ ధరలు రూ.10,000 ఎక్కువగా ఉంటాయి. పైన పేర్కొన్ని అన్ని ధరలు పరిచయ ధరలేనని, రాబోయే రోజుల్లో వీటిని పెంచుతామని కంపెనీ తెలిపింది.

బిఎస్4 మోడల్‌తో పోల్చుకుంటే ఈ బిఎస్6 మోడల్‌లో కంపెనీ పెద్దగా చెప్పుకోదగిన మార్పులేమీ చేయలేదు. ఇందులో అతిపెద్ద మార్పు ఇంజన్ రూపంలో వచ్చింది. ఈ బైక్‌లో 499 సిసి, పారలల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు.

ఈ ఇంజన్ ఇప్పుడు బిఎస్ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడింది. ఇందులోని ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 46.8 బిహెచ్‌పి శక్తిని మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 46 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఇక ఈ బైక్‌లోని ఇతర మార్పుల విషయానికి వస్తే, అవి చాలా సూక్ష్మమైనవి మరియు అవి ఈ ఏడాది జనవరిలో మార్కెట్లోకి విడుదలైన దాని రోడ్-బేస్డ్ వెర్షన్ యొక్క బిఎస్6 మోడల్‌తో సమానంగా ఉంటాయి.

బెనెల్లి టిఆర్‌కె 502ఎక్స్ మెరుగైన విజిబిలిటీ కోసం ఇందులో బ్యాక్‌లిట్ స్విచ్ గేర్‌ను ప్రవేశపెట్టారు, ఇప్పుడు ఇది రాత్రివేళల్లో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. ఇంకా ఇందులో అల్యూమినియం ఫ్రేమ్ నకల్ గార్డ్స్, కొత్త హ్యాండిల్ బార్ గ్రిప్స్ మరియు రీడిజైన్ చేయబడిన రియర్ వ్యూ మిర్రర్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ మోటార్‌సైకిల్‌లోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా సర్దుబాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఆరెంజ్ ఎల్‌సిడి మరియు వైట్ బ్యాక్‌లిట్ అనలాగ్ టాకోమీటర్‌ను కలిగి ఉంటుంది. ఇది మునుపటి కన్నా కాస్తంత భిన్నంగా అనిపిస్తుంది. ఈ రోడ్-స్పెక్ వెర్షన్ మోడల్‌లో ముందు వైపు 19 ఇంచ్ మరియు వెనుక వైపు 17 ఇంచ్ స్పోక్ వీల్స్‌ను ఉపయోగించారు. ఇవి 220 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందిస్తాయి.

పర్యటనలో ఉన్నప్పుడు ఇంధన స్తబ్దతను తగ్గించడానికి, ఈ బైక్‌లో 20 లీటర్ల పెద్ద ఇంధన ట్యాంక్ ఉంటుంది. అంతే కాకుండా, ఈ బైక్‌లో పెద్ద విండ్‌స్క్రీన్ మరియు కొత్త కాస్ట్ అల్యూమినియం రియర్ బాక్స్ బ్రాకెట్ కూడా ఉంటుంది. ఇది టూరింగ్ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది.

బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు రెండు పిస్టన్ కాలిపర్స్ ఫ్రంట్ అప్ ట్విన్ 320 మిమీ ఫ్లోటింగ్ డిస్కులు మరియు వెనుక వైపు సింగిల్ పిస్టన్ కాలిపర్‌తో 260 మిమీ డిస్క్ బ్రేక్‌లను ఉపయోగించారు. ఆసక్తిగల కస్టమర్లు రూ.10,000 అడ్వాన్స్ చెల్లించి ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








