BSA మోటార్‌సైకిల్స్ యొక్క మొదటి బైక్ 'గోల్డ్‌స్టార్ 650' ఆవిష్కణ: వివరాలు

బిఎస్ఏ మోటార్‌సైకిల్స్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా మార్కెట్లోకి మళ్ళీ అధికారికంగా ప్రవేశించనున్నట్లు తెలిపింది. అయితే కంపెనీ ఇప్పుడు కంపెనీ తన మొదటి మోటార్‌సైకిల్‌ను అధికారికంగా వెల్లడించింది. బర్మింగ్‌హామ్ స్మాల్ ఆర్మ్స్ లేదా BSA క్లాసిక్ లెజెండ్స్ యాజమాన్యంలోని మొదటి కొత్త తరం మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. దీనితో కంపెనీ అధికారికంగా తన పునరుద్ధరణను మళ్ళీ చాటుకుంది.

BSA మోటార్‌సైకిల్స్ యొక్క మొదటి బైక్ 'గోల్డ్‌స్టార్ 650' ఆవిష్కణ: వివరాలు

బర్మింగ్‌హామ్ UK లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ కొత్త BSA మోటార్‌సైకిల్‌ను ప్రదర్శించారు. కంపెనీ ఈ కొత్త BSA మోటార్‌సైకిల్‌ను గోల్డ్‌స్టార్ 650 పేరుతో విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఇది 2021 డిసెంబర్ 4 నుంచి 12 వరకు UK లోని బర్మింగ్‌హామ్‌లో జరగబోయే మోటార్‌సైకిల్ లైవ్ షోలో ఉంచే అవకాశం కూడా ఉంది.

BSA మోటార్‌సైకిల్స్ యొక్క మొదటి బైక్ 'గోల్డ్‌స్టార్ 650' ఆవిష్కణ: వివరాలు

ఈ BSA గోల్డ్‌స్టార్ 650 బైక్ సింగిల్ సిలిండర్, 650 సిసి ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. అయితే ఈ కొత్త బైక్ UK మరియు ఇతర దేశాల మార్కెట్‌లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. కావున ఇది ఆధునిక డిజైన్ కలిగి ఉంటుంది.

BSA మోటార్‌సైకిల్స్ యొక్క మొదటి బైక్ 'గోల్డ్‌స్టార్ 650' ఆవిష్కణ: వివరాలు

సాధారణ నివేదికల ప్రకారం, BSA మోటార్‌సైకిళ్ల విక్రయాలు 1970 వ సంవత్సరంలో నిలిచిపోయాయి. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ 2016 వ సంవత్సరం నుంచి ఇది మహీంద్రా అండ్ మహీంద్రా యాజమాన్యంలోకి చేరింది. బ్రిటీష్ హయాంలో భారతదేశానికి వచ్చిన ఈ ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ ఈ BSA.

BSA మోటార్‌సైకిల్స్ యొక్క మొదటి బైక్ 'గోల్డ్‌స్టార్ 650' ఆవిష్కణ: వివరాలు

క్లాసిక్ లెజెండ్స్ ఈ BSA మోటార్‌సైకిల్స్‌ను దాదాపు 28 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. భారతదేశంలో, మహీంద్రా గ్రూప్ ఇప్పటికే BSA మోటార్‌సైకిల్స్‌ను పూణేలో పరీక్షిస్తున్నట్లు గతంలో గుర్తించబడింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పటికే బయటపడ్డాయి. ఈ కొత్త శ్రేణి మోటార్‌సైకిళ్లను భారతదేశంలో క్లాసిక్ లెజెండ్స్ ఇప్పటికే అభివృద్ధి చేసినట్లుగా తెలుస్తోంది.

BSA మోటార్‌సైకిల్స్ యొక్క మొదటి బైక్ 'గోల్డ్‌స్టార్ 650' ఆవిష్కణ: వివరాలు

ఈ బైక్‌లను భారతదేశంలోని కంపెనీ యొక్క పితాంపూర్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అయితే వీటి ఉత్పత్తి మొదలైన తరువాత ఎగుమతులు వచ్చే ఏడాది ప్రారంభం నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. క్లాసిక్ లెజెండ్స్ ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని బాన్‌బరీలో టెక్నాలజీ మరియు డిజైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది, ఆ తర్వాత మిడ్‌లాండ్స్‌లోని BSA సౌకర్యం వద్ద కొత్త మోటార్‌సైకిళ్లను అసెంబ్లింగ్ చేసింది.

BSA మోటార్‌సైకిల్స్ యొక్క మొదటి బైక్ 'గోల్డ్‌స్టార్ 650' ఆవిష్కణ: వివరాలు

ఈ కొత్త BSA మోటార్‌సైకిల్ ప్రీమియం బైక్ సెగ్మెంట్‌లో ఉంచబడుతుంది. ఇది పాత BSA బైక్‌తో పాటు ఆధునిక అండర్‌పిన్నింగ్‌లతో కూడిన క్లాసిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది మొదట UKలో విక్రయించబడుతోంది, అయితే ఇది భారతదేశానికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది భారతీయ మార్కెట్లో అడుగుపెడితే, ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్శించే అవకాశం ఉంటుంది. కావున రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా కూడా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం, లేదు.

BSA మోటార్‌సైకిల్స్ యొక్క మొదటి బైక్ 'గోల్డ్‌స్టార్ 650' ఆవిష్కణ: వివరాలు

ఈ కొత్త BSA బైకులు కొత్త 650 సిసి రెట్రో థీమ్‌ను కొనసాగిస్తుంది. ఇది ఇంటిగ్రేటెడ్ DRLలు, LED టెయిల్ ల్యాంప్‌లు, టియర్ డ్రాప్ ఆకారపు ఇంధన ట్యాంక్ మరియు వైడ్ సెట్ హ్యాండిల్‌బార్‌లతో కూడిన రౌండ్ హెడ్‌ల్యాంప్‌ను పొందుతుంది. ఇది ముందు మరియు వెనుక భాగంలో విస్తృత ఫెండర్లను కూడా పొందుతుంది. ఇది పిరెల్లి టైర్లతో చుట్టబడిన స్పోక్డ్ వీల్స్‌ను ఉపయోగించనుంది. కావున ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

BSA మోటార్‌సైకిల్స్ యొక్క మొదటి బైక్ 'గోల్డ్‌స్టార్ 650' ఆవిష్కణ: వివరాలు

హెడ్‌ల్యాంప్‌ల నుండి ఇంధన ట్యాంక్ వరకు ఎగ్జాస్ట్ పైప్ మరియు ఇంజన్ కేసింగ్ వరకు క్రోమ్ యొక్క విస్తృతమైన వినియోగం ఉంటుంది, కావున ఇది మంచి దూకుడు డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో రైడర్ కి అనుకూలంగా ఉండే పొడవైన సీటు కూడా అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఇది లాంగ్ రైడ్స్ లో కూడా చాలా అనుకూలమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

BSA మోటార్‌సైకిల్స్ యొక్క మొదటి బైక్ 'గోల్డ్‌స్టార్ 650' ఆవిష్కణ: వివరాలు

త్వరలో విడుదల కానున్న కొత్త BSA గోల్డ్‌స్టార్ బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఈ కొత్త బైక్ 650 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. కావున ఇది 47 బిహెచ్‌పి పవర్ మరియు 40 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది మరియు మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది. ఈ బైక్ యొక్క ఇంజిన్ భవిష్యత్ ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడింది.

BSA మోటార్‌సైకిల్స్ యొక్క మొదటి బైక్ 'గోల్డ్‌స్టార్ 650' ఆవిష్కణ: వివరాలు

భారతీయ మార్కెట్లో కొత్త కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి, అయితే ఇప్పుడు ఈ కొత్త BSA గోల్డ్‌స్టార్ బైక్ భారతీయ తీరాలకు చేరుకున్నట్లైతే తప్పకుండా మంచి ప్రజాదరణ పొందే అవకాశం ఉంటుంది. ఈ బైక్ యొక్క ధర వంటి కొన్ని సమాచారాలు ఇంకా అందుబాటులో లేదు, అయితే ఈ వివరాలన్నీ కూడా త్వరలో కంపెనీ అందిస్తుంది.

Most Read Articles

English summary
Bsa motorcycle unveiled first bike could named goldstar 650 details
Story first published: Saturday, December 4, 2021, 12:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X