Classic 350 బైక్ టైర్ల కోసం Royal Enfield తో చేతులు కలిపిన Ceat

భారతదేశపు ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ Royal Enfield కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన Classic 350 మోటార్‌సైకిల్ కోసం టైర్లను సరఫరా చేసేందుకు గాను ప్రముఖ టైర్ల తయారీ సంస్థ సియట్ టైర్స్ (Ceat Tyres) రాయల్ ఎన్‌ఫీల్డ్ తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు తెలిపింది.

Classic 350 బైక్ టైర్ల కోసం Royal Enfield తో చేతులు కలిపిన Ceat

ఈ భాగస్వామ్యంలో భాగంగా, Ceat Tyres తన జూమ్ ప్లస్ (Zoom Plus) మరియు జూమ్ ప్లస్ ఎఫ్ (Zoom Plus F) సిరీస్ టైర్లను కొత్త Royal Enfield Classic 350 బైక్ లో పరిచయం చేయనుంది. ఈ కొత్త 2021 Classic 350 బైక్ ముందు భాగంలో 19 ఇంచ్ టైర్లు మరియు వెనుక భాగంలో 18 ఇంచ్ టైర్లను ఉపయోగిస్తున్నారు.

Classic 350 బైక్ టైర్ల కోసం Royal Enfield తో చేతులు కలిపిన Ceat

ఇందులో స్పోక్ వీల్స్‌ పై ట్యూబ్ కలిగిన టైర్లను మరియు అల్లాయ్ వీల్స్‌ పై ట్యూబ్ లేని (ట్యూబ్‌లెస్) టైర్లను ఉపయోగించారు. ట్యూబ్‌లెస్ టైర్లను అల్లాయ్ వీల్స్‌ తో పాటు యాక్సెసరీస్‌ గా కూడా అందించబడుతున్నాయి. కావాలనుకుంటే, కస్టమర్‌లు వీటిని విడిగా కూడా కొనుగోలు చేయవచ్చు.

Classic 350 బైక్ టైర్ల కోసం Royal Enfield తో చేతులు కలిపిన Ceat

కొత్త మోడల్ లో మునుపటి మ్యాప్‌డెల్ కంటే విస్తృతమైన టైర్లను అమర్చారు. ఇది రోడ్డుపై బైక్ యొక్క పట్టు (గ్రిప్) మరియు బ్రేకింగ్ పనితీరును మరింత మెరుగుపరుస్తుందని కంపెనీ తెలిపింది. కొత్త 2021 Classic 350 పనితీరు కోసం ఈ టైర్లు ఆప్టిమైజ్ చేయబడ్డాయని కంపెనీ పేర్కొంది.

Classic 350 బైక్ టైర్ల కోసం Royal Enfield తో చేతులు కలిపిన Ceat

Royal Enfield ఇప్పటికే, ఈ కొత్త సియట్ టైర్లతో కంపెనీ తమ 2021 Classic 350 బైక్ రోడ్లపై పరీక్షించింది. ఈ పరీక్షలో కొత్త సియట్ టైర్లను అమర్చిన Classic 350 బైక్ మునుపటి కంటే మెరుగైన రోడ్ గ్రిప్, కార్నింగ్ మరియు బ్రేకింగ్ పనితీరును కనబరిచిందని కంపెనీ గుర్తించింది. ఇది రైడర్‌కు మునుపటి కంటే బైక్ నడపడంపై మరింత విశ్వాసాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

Classic 350 బైక్ టైర్ల కోసం Royal Enfield తో చేతులు కలిపిన Ceat

Royal Enfield ఇటీవలే కొత్త Classic 350 బైక్ ని భారత మార్కెట్లో విడుదల చేసింది మరియు ఇప్పుడు దాని డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ Classic 350 రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్. కంపెనీ గత మార్చి 2020 నుండి ఏప్రిల్ 2021 ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో 3.60 లక్షలకు పైగా క్లాసిక్ 350 మోటార్‌సైకిళ్లను విక్రయించింది.

Classic 350 బైక్ టైర్ల కోసం Royal Enfield తో చేతులు కలిపిన Ceat

కాగా, ఇప్పుడు లేటెస్ట్ టెక్ ఫీచర్లతో వచ్చిన ఈ కొత్త 2021 Classic 350 బైక్ విడుదలతో రాబోయే రోజుల్లో దీని అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొత్త ఇంజన్, డిజైన్ అప్‌డేట్‌లు మరియు కొత్త కనెక్టింగ్ ఫీచర్లతో Royal Enfield ఈ 2021 Classic 350 ని రూపొందించింది.

Classic 350 బైక్ టైర్ల కోసం Royal Enfield తో చేతులు కలిపిన Ceat

మార్కెట్లో కొత్త 2021 Royal Enfield Classic 350 మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ. 1.84 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 2.15 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది మొత్తం 11 కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి దీని ధరలు మారుతూ ఉంటాయి.

Classic 350 బైక్ టైర్ల కోసం Royal Enfield తో చేతులు కలిపిన Ceat

కంపెనీ అందిస్తున్న మీటియోర్ 350 (Meteor 350) ని రూపొందించిన J ప్లాట్‌ఫామ్ ఆధారంగానే ఈ కొత్త 2021 Classic 350 మోడల్ ని కూడా నిర్మించారు. కాబట్టి, ఈ రెండు మోడళ్లలోని ఇంజన్ మరియు కొన్ని రకాల ఫీచర్లు కూడా ఒకేలా ఉంటాయి. స్టైలింగ్ పరంగా చూస్తే, దీనిని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం పాత మోడల్ మాదిరిగానే ఉంచినట్లు అనిపిస్తుంది. కాకపోతే, ఇందులో చిన్నపాటి డిజైన్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

Classic 350 బైక్ టైర్ల కోసం Royal Enfield తో చేతులు కలిపిన Ceat

కొత్త 2021 Classic 350 లో పైలట్ లాంప్‌తో కూడిన కొత్త వృత్తాకారపు హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్ ఉన్నాయి. ఇందులో ఇన్‌స్టాల్ చేయబడిన కొత్త టర్న్ ఇండికేటర్ పరిమాణం మునుపటి కంటే కాస్తంత చిన్నదిగా ఉంటుంది. దీని హ్యాండిల్‌బార్ ను కూడా రైడర్ యొక్క రైడింగ్ సౌకర్యాన్ని పెంచడానికి సర్దుబాటు చేయబడ్డాయి మరియు సీటు డిజైన్ కూడా మెరుగుపరచబడింది.

Classic 350 బైక్ టైర్ల కోసం Royal Enfield తో చేతులు కలిపిన Ceat

ఈ బైక్ లో కొత్త క్రోమ్ ఫినిష్డ్ ఎగ్జాస్ట్ పైప్ మరియు 13 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ కూడా ఉంటుంది. ఇందులో కొత్తగా సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ను అమర్చారు. ఈ కన్సోల్ లో స్పీడోమీటర్ మరియు ట్రిప్ మీటర్‌ తో పాటుగా టర్న్-బై-టర్న్ నావిగేషన్ కోసం ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌ ను కూడా అమర్చారు. ఇది చిన్నపాటి గుండ్రటి డిస్‌ప్లేను కలిగి ఉండి, రైడర్ కు నావిగేషన్ సమాచారాన్ని అందిస్తుంది.

Classic 350 బైక్ టైర్ల కోసం Royal Enfield తో చేతులు కలిపిన Ceat

ఇక ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 Classic 350 మోటార్‌సైకిల్ లో Royal Enfield తమ లేటెస్ట్ 349 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి పవర్ ను మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 న్యూటన్ మీటర్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

Classic 350 బైక్ టైర్ల కోసం Royal Enfield తో చేతులు కలిపిన Ceat

Royal Enfield ఆగస్ట్ 2021 సేల్స్ రిపోర్ట్..

Royal Enfield గడచిన ఆగస్టు 2021 నెలలో మొత్తం 45,860 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఇందులో దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతులు కలిసి ఉన్నాయి. ఆగస్టు 2020 నెలలో కంపెనీ విక్రయించిన 50,144 యూనిట్లతో పోలిస్తే, గత నెల అమ్మకాలు 9 శాతం తక్కువగా ఉన్నాయి.

Most Read Articles

English summary
Ceat partners with royal enfield to supply tyres for classic 350 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X