భారత్‌లో సిఎఫ్ మోటో 300ఎన్‌కె బిఎస్ 6 లాంచ్ : ధర & వివరాలు

భారత మార్కెట్లో సిఎఫ్ మోటో 300 ఎన్‌కె బిఎస్ 6 ఎట్టకేలకు విడుదలైంది. ఈ కొత్త బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 2.29 లక్షలు (ఎక్స్‌షోరూమ్). సిఎఫ్ మోటో 300ఎన్‌కె బిఎస్ 6 యొక్క డిజైన్ దాదాపు బిఎస్ 4 మోడల్ నుండే తీసుకోబడింది. అయితే ఇంజిన్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడింది.

భారత్‌లో సిఎఫ్ మోటో 300ఎన్‌కె బిఎస్ 6 లాంచ్ : ధర & వివరాలు

సిఎఫ్ మోటో 300ఎన్‌కె బిఎస్ 6 భారత మార్కెట్లో కంపెనీ విడుదల చేసిన మొట్టమొదటి బిఎస్ 6 కంప్లైంట్ మోడల్. అయితే ఇది బిఎస్ 4 వెర్షన్‌తో సమానంగా ఉంది. దీని స్టైలింగ్ అదే విధంగా ఉంచబడింది. కానీ ఈ కొత్త మోడల్ కొన్ని అప్డేట్స్ కారణంగా క్రొత్త రూపాన్ని కలిగి ఉంటుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

భారత్‌లో సిఎఫ్ మోటో 300ఎన్‌కె బిఎస్ 6 లాంచ్ : ధర & వివరాలు

సిఎఫ్ మోటో 300ఎన్‌కె బిఎస్ 6 లో ఫుల్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, అడ్జస్టబుల్ రియర్ సెక్షన్, స్ప్లిట్ సీట్ సెటప్, అండర్ బెల్లి ఎగ్జాస్ట్, రియర్ ఫెండర్ పై నంబర్ ప్లేట్ మరియు 5 స్పోక్ అల్లాయ్ వీల్ వంటివి ఉన్నాయి.

MOST READ:తండ్రి పుట్టిన రోజు కానుకగా తనయుడు ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్!

భారత్‌లో సిఎఫ్ మోటో 300ఎన్‌కె బిఎస్ 6 లాంచ్ : ధర & వివరాలు

ఈ కొత్త బైక్ యొక్క కలర్ మరియు గ్రాఫిక్స్ పాత మోడల్ మాదిరిగానే ఉన్నాయి. ఇందులో అప్సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు సస్పెన్షన్ కోసం వెనుక మోనో షాక్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం, ఈ బైక్ రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌ కూడా కలిగి ఉంది.

భారత్‌లో సిఎఫ్ మోటో 300ఎన్‌కె బిఎస్ 6 లాంచ్ : ధర & వివరాలు

ఈ బైక్ లో ఉన్న ఇంజిన్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణం అనుకూలంగా అప్డేట్ చేయబడింది. కానీ దీనికి సంబంధించిన సమాచారం అధికారికంగా ప్రకటించబడలేదు. అయితే దీని పవర్ మరియు టార్క్‌లో పెద్ద మార్పులు ఉండే అవకాశం లేదని మేము భావిస్తున్నాము. కానీ ఈ బైక్ ప్రియులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు.

MOST READ:వాహ్.. కేవలం 18 గంటల్లో 25.54 కిమీ రోడ్డు పూర్తి.. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

భారత్‌లో సిఎఫ్ మోటో 300ఎన్‌కె బిఎస్ 6 లాంచ్ : ధర & వివరాలు

దీని బిఎస్ 4 మోడల్‌లో 292.4 సిసి, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ అమర్చారు, ఇది 33.5 బిహెచ్‌పి పవర్ మరియు 20.5 న్యూటన్ మీటర్ టార్క్‌ను అందించింది. కానీ ఈ కొత్త బిఎస్ 6 ఇంజిన్ ఏ విధమైన గణాంకాలను అందిస్తుందనే విషయం త్వరలో కంపెనీ వెల్లడిస్తుంది.

భారత్‌లో సిఎఫ్ మోటో 300ఎన్‌కె బిఎస్ 6 లాంచ్ : ధర & వివరాలు

సాధారణంగా 2020 ఏప్రిల్ నించి బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలు అమలులోకి వచ్చాయి. అయితే సిఎఫ్ మోటో కొత్త ప్రమాణాలకు అనుగుణంగా దాని మోడళ్లను ఇంకా నవీకరించలేదు. కానీ కంపెనీ ఇప్పుడు తన మొదటి బిఎస్ 6 మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇదే విధంగా తన ఇతర మోడళ్లను కూడా త్వరలో బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేసి తీసుకురాగలదు.

MOST READ:స్కూల్ బస్సులు యెల్లో కలర్‌లో ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి

Most Read Articles

English summary
CFMoto 300NK BS6 Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X