సిఎఫ్ మోటో 650ఎమ్‌టి, 650జిటి మరియు 650ఎన్‌కె బుకింగ్స్ ఓపెన్!

చైనాకి చెందిన ప్రముఖ టూవీలర్ బ్రాండ్ సిఎఫ్‌మోటో, గతంలో భారత మార్కెట్లో విక్రయించిన మోటార్‌సైకిళ్లను ఇప్పుడు కొత్తగా బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేసి, విపణిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

సిఎఫ్ మోటో 650ఎమ్‌టి, 650జిటి మరియు 650ఎన్‌కె బుకింగ్స్ ఓపెన్!

గడచిన మార్చి 2021 నెలలో సిఫ్ మోటో 300ఎన్‌కె మోడల్‌ను విడుదల చేసిన కంపెనీ, త్వరలోనే మరో మూడు కొత్త బిఎస్6 మోడళ్లను విడుదల చేయనుంది. సిఎఫ్ మోటో నుండి బిఎస్6 ఇంజన్ అప్‌గ్రేడ్‌తో 650ఎమ్‌టి, 650జిటి మరియు 650ఎన్‌కె మోడళ్లు విడుదల కానున్నాయి.

సిఎఫ్ మోటో 650ఎమ్‌టి, 650జిటి మరియు 650ఎన్‌కె బుకింగ్స్ ఓపెన్!

కంపెనీ ఇప్పటికే ఈ మోడళ్ల కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్న తరుణంలో, ఈ బైక్‌ల పట్ల ఆసక్తి గల కస్టమర్లు వీటిని కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్‌లను బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ.5,000 టోకెన్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది.

MOST READ:బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు

సిఎఫ్ మోటో 650ఎమ్‌టి, 650జిటి మరియు 650ఎన్‌కె బుకింగ్స్ ఓపెన్!

ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే కస్టమర్లు తమకు ఇష్టమైన మోటారుసైకిల్ కోసం కలర్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఇప్పటికే ఈ బైక్‌ల లాంచ్ గురించి ఈ చైనీస్ టూవీలర్ బ్రాండ్ అనేక సూచనలు కూడా ఇచ్చింది. కంపెనీ తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో సిఎఫ్ మోటో 650ఎన్‌కె మరియు 650జిటి టీజర్లను కూడా విడుదల చేసింది.

సిఎఫ్ మోటో 650ఎమ్‌టి, 650జిటి మరియు 650ఎన్‌కె బుకింగ్స్ ఓపెన్!

ఈ రెండు మోడళ్లతో పాటుగా కంపెనీ త్వరలో కంపెనీ సిఎఫ్‌మోటో 650ఎమ్‌టిని కూడా మార్కెట్లోకి విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, దేశంలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో, కంపెనీ ఈ మోటార్‌సైకిళ్లన్నింటినీ ఆన్‌లైన్ ప్రోగ్రాం ద్వారానే బహుశా ఈ నెలాఖరులోగా ప్రారంభివచ్చని తెలుస్తోంది.

MOST READ:వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్‌లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు

సిఎఫ్ మోటో 650ఎమ్‌టి, 650జిటి మరియు 650ఎన్‌కె బుకింగ్స్ ఓపెన్!

సిఫ్ మోటో 650జిటి, 650ఎన్‌కె మరియు 650ఎమ్‌టి మోటార్‌సైకిళ్లు మూడు ఒకే ప్లాట్‌ఫామ్ తయారైనప్పటికీ, ఇవి విభిన్నమైన డిజైన్ శైలిని కలిగి ఉంటాయి. అయితే, వీటిలో ఉపయోగించిన అనేక విడిభాగాలు, పరికరాలు మాత్రం ఒకేలా ఉంటాయి. బిఎస్ 6 వెర్షన్ సిఎఫ్ మోటో 650జిటి ఓవరాల్ డిజైన్ పరంగా చూడటానికి దాని బిఎస్ 4 వెర్షన్ మాదిరిగానే ఉంటుంది.

సిఎఫ్ మోటో 650ఎమ్‌టి, 650జిటి మరియు 650ఎన్‌కె బుకింగ్స్ ఓపెన్!

ఈ కొత్త మోడళ్లన్నీ ఇప్పుడు మరింత మెరుగైన, క్లీన్ ఇంజన్‌తో రానున్నాయి. కంపెనీ ఈ ఇంజన్‌ను బిఎస్6 (భారత్ స్టేజ్ 6) ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసింది. సిఎఫ్ మోటో 650జిటి (గ్రాండ్ టూరర్) పేరుకు తగినట్లుగానే రైడర్‌కు రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్‌ను ఆఫర్ చేస్తూ, సుదూర ప్రయాణాల్లో కూడా సౌకర్యంగా ఉండేలా ఉంటుంది.

MOST READ:కూరగాయల అమ్మకానికి కొత్త టయోటా ఫార్చ్యూనర్.. వినటానికి వింతగా ఉన్నా, ఇది నిజమే

సిఎఫ్ మోటో 650ఎమ్‌టి, 650జిటి మరియు 650ఎన్‌కె బుకింగ్స్ ఓపెన్!

సిఎఫ్ మోటో 650ఎన్‌కె పట్టణ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడానికి మరియు సరదాగా ప్రయాణించడానికి వీలుగా డిజైన్ చేసిన స్ట్రీట్ ఫైటర్ నేకెడ్ బైక్‌లా ఉంటుంది. అలాగే, సిఎఫ్ మోటో 650ఎమ్‌టి ఒక బలమైన అడ్వెంచర్ బైక్‌లా ఉంటుంది మరియు ఇందులో ఎక్స్‌టెన్సిబుల్ క్రాష్ ప్రొటెక్షన్, ఫాన్సీ అడ్జస్టహల్ యూఎస్‌డి ఫోర్కులు ఉంటాయి.

సిఎఫ్ మోటో 650ఎమ్‌టి, 650జిటి మరియు 650ఎన్‌కె బుకింగ్స్ ఓపెన్!

సిఎఫ్ మోటో 650ఎమ్‌టి భారత మార్కెట్లో కవాసకి వెర్సిస్ 650కి ప్రత్యక్ష పోటీని ఇస్తుంది. అదే సమయంలో, ఇది బెనెల్లి టిఆర్కె 502 మరియు హోండా సిబి 500 ఎక్స్ వంటి మోడళ్లకు కూడా పోటీగా నిలుస్తుంది. ఈ బైక్ హైవే రైడింగ్ కోసం మంచి ఆప్షన్‌గా ఉంటుంది మరియు ఇది కంపెనీ యొక్క అత్యధిక ప్రీమియం బైక్‌గా ఉంటుంది.

MOST READ:ఈ బైక్ ఏదో గుర్తించగలరా.. ఒక్కసారి చూసి ట్రై చేయండి

సిఎఫ్ మోటో 650ఎమ్‌టి, 650జిటి మరియు 650ఎన్‌కె బుకింగ్స్ ఓపెన్!

దీని ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 5 ఇంచ్ టిఎఫ్‌టి స్క్రీన్, 12 వోల్ట్ అవుట్‌లెట్, యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ మరియు మాన్యువల్ అడ్జస్టబల్ వైజర్ మొదలైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఈ మూడు మోడళ్లు ఒకేరకమైన ఇంజన్‌ను కలిగి ఉంటాయి. కాకపోతే, వీటి ట్యూనింగ్ వేర్వేరుగా ఉంటుంది.

సిఎఫ్ మోటో 650ఎమ్‌టి, 650జిటి మరియు 650ఎన్‌కె బుకింగ్స్ ఓపెన్!

బిఎస్ 4 వెర్షన్‌లలో ఉపయోగించిన అదే 649 సిసి, ట్విన్-సిలిండర్ ఇంజన్‌ను బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి ఇందులో ఉపయోగించనున్నారు. వీటిలో 650ఎన్‌కె మరియు 650ఎమ్‌టి ఇంజన్లు 61 బిహెచ్‌పి పవర్‌ను మరియు 58.5 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తాయి. అలాగే, 650జిటి మోడల్‌లోని ఇంజన్ 62.5 బిహెచ్‌పి పవర్‌ను మరియు 58.5 Nm ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

Most Read Articles

English summary
CFMoto Starts Booking For 650MT, 650GT And 650NK In India, Launch Expected Soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X