సిఎఫ్ మోటో 300ఎన్‌కె బిఎస్6 మోటార్‌సైకిల్ డెలివరీలు ప్రారంభం!
చైనాకి చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్ బ్రాండ్ సిఎఫ్‌మోటో, గడచిన మార్చి నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ కొత్త బిఎస్6 వెర్షన్ 300ఎన్‌కె మోడల్ డెలివరీలను కంపెనీ ప్రారంభించింది. ఈ మోడల్‌ను ముందుగా బుక్ చేసుకున్న వారికి ప్రయారిటీ ప్రకారం డెలివరీలు చేస్తున్నారు.

భారత మార్కెట్లో సిఎఫ్ మోటో 300ఎన్‌కె బిఎస్6 వెర్షన్ ధర రూ.2.29 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. సిఎఫ్ మోటో 300ఎన్‌కె బిఎస్6 యొక్క డిజైన్ దాదాపుగా బిఎస్4 మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో కేవలం ఇంజన్‌ను మాత్రమే బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్‌గ్రేడ్ చేశారు.

సిఎఫ్‌మోటో 300ఎన్‌కె మోటారుసైకిల్‌లో ఇదివరకటి బిఎస్4 ఇంజన్‌నే బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేసి ఉపయోగించారు. ఇందులోని 292సిసి డిఓహెచ్‌సి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 33.5 బిహెచ్‌పి పవర్‌ను మరియు 20.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ స్టాండర్డ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్తగా ఈ 2021 మోడల్ సిఎఫ్ మోటో 300ఎన్‌కెలో ఇంజన్ అప్‌గ్రేడ్స్ మినహా పెద్దగా చెప్పుకోదగిన ఇతర మార్పులేవీ లేవు. ఇందులో పూర్తి ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మజిక్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, అడ్జస్టబుల్ రియర్ సెక్షన్, స్ప్లిట్ సీట్ సెటప్, అండర్ బెల్లి ఎగ్జాస్ట్, రియర్ ఫెండర్‌పై నంబర్ ప్లేట్ మరియు 5 స్పోక్ అల్లాయ్ వీల్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఈ కొత్త మోటార్‌సైకిల్‌లోని కలర్ ఆప్షన్స్ మరియు బాడీ గ్రాఫిక్స్ పాత మోడల్ మాదిరిగానే ఉంటాయి. ఇందులో ముందు వైపు అప్ సైడ్ డౌన్ (యూఎస్‌డి) టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు మోనో షాక్ సస్పెన్షన్ ఉంటాయి.

బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంటుంది. బిఎస్4 సిఫ్‌మోటో 300ఎన్‌కె మోటార్‌సైకిల్‌లో ఆఫర్ చేసిన రైడింగ్ మోడ్‌లను బిఎస్6 మోడల్‌లో కూడా కొనసాగిస్తున్నారు.

ఈ రైడింగ్ మోడ్‌లను స్విచ్ క్యూబ్ మరియు టిఎఫ్‌టి డిస్‌ప్లే ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉపయోగించి కంట్రోల్ చేయవచ్చు. సిఎఫ్ మోటో 300ఎన్‌కె ఈ విభాగంలో బజాజ్ డొమినాప్ 400 మరియు బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








