భారత్‌లో విడుదలైన 3 కొత్త BS-6 సిఎఫ్‌మోటో బైక్స్; ధర & వివరాలు
భారతమార్కెట్లో సిఎఫ్‌మోటో మూడు కొత్త బైక్స్ లాంచ్ చేసింది. అవి 650 ఎన్‌కె, 650 జిటి మరియు 650 ఎమ్‌టి బైక్స్. ఇవి బిఎస్ 6 అడగరు ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయడం జరిగింది. సిఎఫ్‌మోటో విడుదల చేసిన ఈ కొత్త బైక్స్ యొక్క ప్రారంభ ధర ఎక్స్‌షోరూమ్ ప్రకారం రూ. 4.29 లక్షలు. ఈ బైక్స్ కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో బుక్ చేయవచ్చు.

కంపెనీ విడుదల చేసిన ఈ బైక్ యొక్క ధరల విషయానికి వస్తే, సిఎఫ్‌మోటో 650 ఎన్‌కె ధర రూ. 4.29 లక్షలు, 650 జిటి ధర రూ. 5.29 లక్షలు కాగా 650 ఎమ్‌టి బైక్ ధర రూ. 5.59 లక్షల వరకు ఉంటుంది. సిఎఫ్‌మోటో బైక్స్ ధరలు మునుపటి మోడల్స్ కంటే ఎక్కువగా ఉంటాయి, కావున ఇప్పుడు సిఎఫ్‌మోటో 650 ఎన్‌కె, 650 ఎమ్‌టి బిఎస్ 6 ధరలు రూ. 30,000 పెరిగాయి. అదేవిధంగా సిఎఫ్‌మోటో 650 జిటి బిఎస్ 6 ధర రూ. 10,000 వరకు పెరిగింది.

కొత్త సిఎఫ్‌మోటో బైక్స్ మూడు 2 కొత్త కలర్ ఆప్సన్స్ తో అందుబాటులో ఉన్నాయి. సిఎఫ్‌మోటో 650 ఎన్‌కె బైక్ పెర్ల్ వైట్, ఏథెన్స్ బ్లూ కలర్స్ లో అందుబాటులో ఉండగా, 650 జిటి బైక్ రాయల్ బ్లూ మరియు పెర్ల్ వైట్ కలర్స్ లో అందుబాటులో ఉంది. ఇక 650 ఎమ్‌టి బైక్ విషయానికి వస్తే ఇది కాన్సెప్ట్ బ్లాక్ మరియు నెబ్యులా బ్లూ అనే కలర్స్ లో అందుబాటులో ఉంది. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

సిఎఫ్ మోటో యొక్క మూడు మోటార్ సైకిళ్ళు ఒకే 649.3 సిసి, 2-సిలిండర్ ఇన్లైన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటాయి. ఈ ఇంజిన్ 8250 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 55.6 బిహెచ్‌పి మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 54.4 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త బైక్స్ లో ఇంజిన్ పవర్ డెలివరీ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఈ బైక్‌లలోని చాలా ఫీచర్స్ దాని మునుపటి బైక్ మోడల్స్ నుంచి స్వీకరించినవే. కావున ఈ మూడు 650 సిసి మోటార్ సైకిళ్ళు మరియు అవే ఫీచర్లు మరియు భాగాలను కలిగి ఉంటాయి. దీనిని మీరు ఇక్కడ గమనించవచ్చు.

ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు డ్యూయల్-ఛానల్ ఎబిఎస్ వంటివి అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఫ్యూయెల్ ట్యాంక్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం టిఎఫ్‌టి డిస్ప్లే, డిఆర్‌ఎల్‌లతో ట్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్‌లు, స్ప్లిట్ సీట్లు, సింగిల్ సైడెడ్ ఎగ్జాస్ట్ వంటివి కూడా ఉన్నాయి.

ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే, వీటి ముందు భాగంలో 38 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుక భాగంలో ప్రీలోడ్ కోసం అడ్జస్ట్ చేయగల కాంటిలివర్-టైప్ మోనో-షాక్ సెటప్ ఉంటుంది. అదే విధంగా బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 300 మిమీ డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక భాగంలో 240 మిమీ సింగిల్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








