సిఎఫ్ మోటో 650జిటి బిఎస్6 టీజర్ రిలీజ్; త్వరలోనే ఇండియా లాంచ్!

చైనీస్ టూవీలర్ బ్రాండ్ సిఎఫ్‌మోటో, గతంలో భారత మార్కెట్లో విక్రయించిన మోటార్‌సైకిళ్లను ఇప్పుడు కొత్తగా బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేసి, విపణిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే, గడచిన మార్చి 2021 నెలలో సిఫ్ మోటో 300ఎన్‌కె మోడల్‌ను విడుదల చేసిన కంపెనీ, త్వరలోనే మరో కొత్త మోడల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.

సిఎఫ్ మోటో 650జిటి బిఎస్6 టీజర్ రిలీజ్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఈసారి సిఎఫ్ మోటో బ్రాండ్ నుండి 650జిటి మోడల్ మార్కెట్లోకి రాబోతోంది. ఇప్పటికే, కంపెనీ ఈ మోడల్‌కు సంబంధించి ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. కొన్ని వారాల ముందు కంపెనీ 650ఎన్‌కె మోడల్ టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఈ రెండు మోడళ్లు ఒకే బ్రీడ్‌కి చెందినప్పటికీ, వీటి డిజైన్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

సిఎఫ్ మోటో 650జిటి బిఎస్6 టీజర్ రిలీజ్; త్వరలోనే ఇండియా లాంచ్!

సిఫ్ మోటో 650ఎన్‌కె మోటార్‌సైకిల్‌లో ఉపయోగించిన అనేక విడిభాగాలు, పరికరాలు 650జిటి మోడల్‌లోనూ కనిపిస్తాయి. కొత్తగా వస్తున్న బిఎస్ 6 వెర్షన్ సిఎఫ్ మోటో 650జిటి డిజైన్ పరంగా చూడటానికి దాని బిఎస్ 4 వెర్షన్ మాదిరిగానే ఉంటుంది. అయితే, ఈ కొత్త మోటారుసైకిల్‌లో స్వల్ప మార్పులు ఉన్నాయి.

MOST READ:కరోనా ఎఫెక్ట్; అంబులన్సులుగా మారిన పోలీస్ వాహనాలు

సిఎఫ్ మోటో 650జిటి బిఎస్6 టీజర్ రిలీజ్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఈ కొత్త మోడల్ ఇప్పుడు మరింత మెరుగైన, క్లీన్ ఇంజన్‌తో రాబోతోంది. కంపెనీ ఈ ఇంజన్‌ను బిఎస్6 (భారత్ స్టేజ్ 6) ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసింది. సిఎఫ్ మోటో 650జిటి (గ్రాండ్ టూరర్) పేరుకు తగినట్లుగానే రైడర్‌కు రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్‌ను ఆఫర్ చేస్తూ, సుదూర ప్రయాణాల్లో కూడా సౌకర్యంగా ఉండేలా ఉంటుంది.

సిఎఫ్ మోటో 650జిటి బిఎస్6 టీజర్ రిలీజ్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఈ ప్రయోజనం కోసం సిఎఫ్ మోటో 650జిటి ప్రత్యేకమైన ఏరోడైనమిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. రైడర్‌పై గాలి ప్రభావాన్ని తగ్గించేందుకు ఇది ముందు వైపు పెద్ద ఫెయిరింగ్ మరియు విండ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. కొత్త 2021 సిఎఫ్‌మోటో 650జిటి బిఎస్6 మోటార్‌సైకిల్‌లో దాని బిఎస్ 4 వెర్షన్‌లో ఉపయోగించిన అదే ఇంజన్‌ను తాజా ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడెడ్ చేసి ఉపయోగించనున్నారు.

MOST READ:ట్రక్కు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణం ఇదే.. మీకు తెలుసా?

సిఎఫ్ మోటో 650జిటి బిఎస్6 టీజర్ రిలీజ్; త్వరలోనే ఇండియా లాంచ్!

బిఎస్ 4 వెర్షన్‌లోని ఇన్-లైన్ పారలల్-ట్విన్ 649సిసి ఇంజన్ గరిష్టంగా 66.68 బిహెచ్‌పి శక్తిని మరియు 56 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసేది. కాగా, అప్‌డేట్ చేయబడిన బిఎస్6 ఇంజన్‌లో కూడా పవర్, టార్క్ గణాంకాలు ఒకే విధంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇకపోతే, ఈ ఇంజన్ ఇదివరకిటి మాదిరిగానే 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

సిఎఫ్ మోటో 650జిటి బిఎస్6 టీజర్ రిలీజ్; త్వరలోనే ఇండియా లాంచ్!

సిఫ్ మోటో 650జిటి మోటార్‌సైకిల్‌లోని మెకానికల్స్‌ను గమనిస్తే, దీని ముందు భాగంలో కెవైబి నుండి గ్రహించిన టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇక బ్రేక్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుకవైపు ఒకే ఒక డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇది డ్యూయల్ ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తుంది.

MOST READ:ఫ్రీ వ్యాక్సిన్ సర్వీస్ ప్రారంభించిన ఎంజి మోటార్.. కేవలం వారికీ మాత్రమే

సిఎఫ్ మోటో 650జిటి బిఎస్6 టీజర్ రిలీజ్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఇంకా ఇందులో ట్యూబ్ లెస్ టైర్లతో కూడిన అల్లాయ్ వీల్స్ కూడా ఉంటాయి. ఈ మోటారుసైకిల్ యొక్క టూరింగ్ సామర్ధ్యాలను పెంచడానికి కంపెనీ ఇందులో భారీ 19 లీటర్ల లాంగ్-రేంజ్ ఫ్యూయెల్ ట్యాంక్‌ను ఆఫర్ చేస్తోంది. బిఎస్4 మోడల్‌తో పోలిస్తే, ఈ కొత్త 2021 మోడల్ సిఎఫ్ మోటో 650జిటిలో డిజైన్, ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది.

సిఎఫ్ మోటో 650జిటి బిఎస్6 టీజర్ రిలీజ్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఈ మోటారుసైకిల్‌లో ముందు వైపు ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లతో కూడిన ట్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్‌లు, టిఎఫ్‌టి డిస్‌ప్లేతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వివిధ రకాల రైడింగ్ మోడ్స్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి. మరికొన్ని వారాల్లో ఈ మోటార్‌సైకిల్ ధర మరియు ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

MOST READ:రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన హెల్మెట్.. ఎలా అనుకుంటున్నారా?

Most Read Articles

English summary
CFMoto Teases BS6 Complaint 650GT Ahead Of India Launch, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X