మరొక పాపులర్ బైక్ డిజైన్‌ని కాపీ కొట్టిన చైనీస్.. వీళ్లు ఇక మారరా..!?

ఏ వస్తువుకైనా నకిలీ వస్తువును సృష్టించడంలో చైనీయులను మించిన సిద్ధహస్తులు మరొకరు లేరనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. గతంలో కొన్ని ప్రముఖ సెల్‌ఫోన్స్ మరియు ఎలక్ట్రానిక్స్ వంటి పరికరాలను అచ్చుగుద్దినట్లు అలానే ఉండేలా నకిలీవి తయారు చేసిన చైనా కంపెనీలు ఇప్పుడు ఆటోమొబైల్స్‌పై పడ్డాయి.

మరొక పాపులర్ బైక్ డిజైన్‌ని కాపీ కొట్టిన చైనీస్.. వీళ్లు ఇక మారరా..!?

కొన్ని చైనా ఆటోమొబైల్ కంపెనీలు తక్కువ శ్రమతో, పక్కవాడి డిజైన్‌ను కాపీ కొట్టేసి, ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చేస్తున్నాయి. చాలా ఏళ్లుగా చైనాలో ఈ ధోరణిని కొనసాగుతోంది. కొందరు ధైర్యం చేసి సదరు నకిలీ కంపెనీలపై కాపీరైట్ కేసులు వేస్తుంటే, మరికొందరు మాత్రం మనకెందుకులే అనుకొని లైట్ తీసుకుంటున్నారు.

మరొక పాపులర్ బైక్ డిజైన్‌ని కాపీ కొట్టిన చైనీస్.. వీళ్లు ఇక మారరా..!?

మనదేశంలో లభిస్తున్న ప్రముఖ స్వీడిష్ టూవీలర్ బ్రాండ్ హస్క్వార్నా అందిస్తున్న 'స్వార్ట్‌పిలెన్ 250' మోడల్ డిజైన్‌ను చైనాకి చెందిన ఓ టూవీలర్ కంపెనీ కాపీ చేసింది. చైనాకి చెందిన ఎఫ్‌కె మోటార్స్ అనే టూవీలర్ కంపెనీ పీకెన్ టిటి250 పేరుతో ఈ బైక్‌ను విక్రయానికి తీసుకొచ్చింది.

మరొక పాపులర్ బైక్ డిజైన్‌ని కాపీ కొట్టిన చైనీస్.. వీళ్లు ఇక మారరా..!?

పీకెన్ టిటి250 బైక్ డిజైన్ మరియు స్టైల్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఇది హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 250 బైక్ డిజైన్ అచ్చుగుద్దినట్లుగా అలానే కాపీ చేసినట్లు స్పష్టమవుతుంది. వి-ఆకారపు బాడీ డిజైన్, సింగిల్ పీస్ సీట్, ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్, గుండ్రటి హెడ్‌ల్యాంప్, ముందు వైపు గోల్డ్ కలర్ యుఎస్‌డి ఫోర్కులు, గుండ్రటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి డిజైన్స్ ఎలిమెంట్స్ హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 250తో సరిపోలుతాయి.

మరొక పాపులర్ బైక్ డిజైన్‌ని కాపీ కొట్టిన చైనీస్.. వీళ్లు ఇక మారరా..!?

ఈ రెండు మోడళ్ల మధ్య స్వల్ప వ్యత్యాసాన్ని చూపేందుకు ఎఫ్‌కె మోటార్స్ తమ పీకెన్ టిటి250లో సీటు కింది భాగంలో ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు సింగిల్ సైడెడ్ స్వింగార్మ్స్‌ని ఉపయోగించింది. ఇందులో ఇరు వైపులా 17 ఇంచ్ స్పోక్ వీల్స్‌ని ఉపయోగించారు. మరియు ఇది ప్రత్యేకమైన తెలుపు రంగు బాడీ కలర్‌లో పెయింట్ చేయబడి ఉంది.

మరొక పాపులర్ బైక్ డిజైన్‌ని కాపీ కొట్టిన చైనీస్.. వీళ్లు ఇక మారరా..!?

పీకెన్ టిటి250 బైక్‌లో ముందు వైపు 110/70 సైజు టైరును మరియు వెనుక వైపు 150/60 సైజు టైరును ఉపయోగించారు. ఈ టైర్లు పెద్ద బటన్లతో ఉండి, ఏ రకమైన రహదారికైనా అనువుగా ఉండేలా డిజైన్ చేయబడ్డాయి. బ్రేకింగ్ విషయానికి వషయానికి వస్తే ఫ్రంట్ వీల్‌పై 300 మి.మీ డిస్క్ మరియు వెనుక వైపు 260 మి.మీ డిస్క్ బ్రేక్‌లను ఉపయోగించారు. అయితే, ఇందులో ఏబిఎస్ ఫీచర్ ఉందో లేదో తెలియదు.

మరొక పాపులర్ బైక్ డిజైన్‌ని కాపీ కొట్టిన చైనీస్.. వీళ్లు ఇక మారరా..!?

పీకెన్ టిటి 250 బైక్‌లో 249 సిసి 4-వాల్వ్, లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 28 హెచ్‌పి పవర్‌ను మరియు 21.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ చైనా కంపెనీ జెజియాంగ్ చుంగ్ఫెంగ్ నుండి తీసుకోబడింది.

మరొక పాపులర్ బైక్ డిజైన్‌ని కాపీ కొట్టిన చైనీస్.. వీళ్లు ఇక మారరా..!?

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది సిఎఫ్ మోటో యొక్క మాతృ సంస్థ. పీకెన్ టిటి 250 కాపీకాట్ టూవీలర్ అయినప్పటికీ, ఇది హుస్క్వర్నా స్వార్ట్‌పిలెన్ 250 బైక్ యొక్క ప్రీమియం డిజైన్ మరియు క్వాలిటీతో ఏమాత్రం సరిపోలదు.

Most Read Articles

English summary
Check Out This Chinese Version Husqvarna Svartpilen 250 Bike. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X