Yezdi బ్రాండ్‌ను రీలాంచ్ చేయనున్న క్లాసిక్ లెజెండ్స్, మీటియోర్ 350 కి గట్టి పోటీ ఇవ్వనుందా..?

భారతదేశపు ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న పాపులర్ మీటియోర్ 350 మోటార్‌సైకిల్ కు పోటీగా క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends) ఓ సరికొత్త క్రూజర్ మోటార్‌సైకిల్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ ఓ అధికారిక టీజర్ రూపంలో విడుదల చేసింది. ఇటీవలే జావా (Jawa) బ్రాండ్ కి పునఃజ్జీవం కల్పించిన క్లాసిక్ లెజెండ్స్, ఇప్పుడు ఐకానిక్ మోటార్‌సైకిల్ యెజ్ది (Yezdi)ని తిరిగి మార్కెట్లో విడుదల చేయాలని నిర్ణయించింది.

Yezdi బ్రాండ్‌ను రీలాంచ్ చేయనున్న క్లాసిక్ లెజెండ్స్, మీటియోర్ 350 కి గట్టి పోటీ ఇవ్వనుందా..?

మహీంద్రా గ్రూప్ (Mahindra Group) క్రింద పనిచేస్తున్న క్లాసిక్ లెజెండ్స్ ఇటీవల యూకేలో బిఎస్ఏ గోల్డ్ స్టార్ 650 (BSA Gold Star 650) ను ఆవిష్కరించింది. జావా మరియు బిఎస్ఏ బ్రాండ్ల పునరుద్ధరణ తర్వాత క్లాసిక్ లెజెండ్స్ ఇప్పుడు యెజ్ది (Yezdi) బైక్‌ను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, యెజ్ది బ్రాండ్ కోసం ఇప్పటికే సామాజిక వెబ్‌సైట్లలో అధికారిక పేజీలు కూడా సృష్టించబడ్డాయి.

Yezdi బ్రాండ్‌ను రీలాంచ్ చేయనున్న క్లాసిక్ లెజెండ్స్, మీటియోర్ 350 కి గట్టి పోటీ ఇవ్వనుందా..?

భారత రోడ్లపై పరీక్షిస్తున్న యెజ్ది మోటార్‌సైకిల్ చిత్రాలు కూడా ఇటీవల ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. తాజాగా, ఈ కొత్త బైక్ కోసం కంపెనీ విడుదల చేసిన తాజా టీజర్ లో 'త్వరలో మరో పునర్జన్మ' అంటూ టీజ్ చేసింది. ఇది పరోక్షంగా యెజ్ది బ్రాండ్‌ ను సూచిస్తున్నట్లుగా ఉంది. ఈ చిత్రంలో ఉన్న బైక్‌ని నంబర్ల ద్వారా నీడగా చూపడం వల్ల అది ఎలాంటి బైక్‌గా ఉంటుందో తెలియడం లేదు. అయితే, ఇది ఖచ్చితంగా యెజ్ది బ్రాండ్ క్రూజర్ బైక్ అని మాత్రం తెలుస్తోంది.

Yezdi బ్రాండ్‌ను రీలాంచ్ చేయనున్న క్లాసిక్ లెజెండ్స్, మీటియోర్ 350 కి గట్టి పోటీ ఇవ్వనుందా..?

క్లాసిక్ లెజెండ్స్ తమ జావా మోటార్‌సైకిళ్లను 2018 లో విడుదల చేసినప్పుడు, కంపెనీ ఇందులో మూడు రకాల మోడళ్లను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో యెజ్ది బ్రాండ్‌ ను కూడా మూడు మోటార్‌సైకిళ్లతో విడుదల చేసే బాగుంటుందని మేము భావిస్తున్నాము. ఎందుకంటే, ఇప్పటి వరకు లీకైన యెజ్ది స్పై చిత్రాలను గమనిస్తే, అవి మూడు రకాలుగా ఉన్నాయి. కాబట్టి, యెజ్ది బ్రాండ్ కూడా మూడు మోడళ్లను కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. క్లాసిక్ లెజెండ్స్ భారత మార్కెట్ కోసం 'రోడ్‌కింగ్' అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసింది, బహుశా ఈ మూడు మోడళ్లలో ఒక దానికి రోడ్‌కింగ్ అనే పేరును పెట్టే అవకాశం ఉంది.

Yezdi బ్రాండ్‌ను రీలాంచ్ చేయనున్న క్లాసిక్ లెజెండ్స్, మీటియోర్ 350 కి గట్టి పోటీ ఇవ్వనుందా..?

BSA Gold Star 650 ఆవిష్కరణ..

ఇదిలా ఉంటే, క్లాసిక్ లెజెండ్స్ ఇటీవల యూకేలో ఆవిష్కరించిన 'బిఎస్ఏ గోల్డ్ స్టార్ 650' (BSA Gold Star 650) మోటార్‌సైకిల్ ను కూడా కంపెనీ భారతదేశంలో విడుదల చేయాలని చూస్తోంది. క్లాసిక్ లెజెండ్స్ ఈ కొత్త మోటార్‌సైకిల్ యొక్క లెజెండ్రీ క్లాసిక్ లుక్ ని అలానే కొనసాగిస్తూ అధునాతన టెక్నాలజీతో తమ కొత్త గోల్డ్ స్టార్ 650 ని పరిచయం చేసింది. ఈ కొత్త మోటార్‌సైకిల్ ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ (కాంటినెంటల్ జిటి, ఇంటర్‌సెప్టర్) వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Yezdi బ్రాండ్‌ను రీలాంచ్ చేయనున్న క్లాసిక్ లెజెండ్స్, మీటియోర్ 350 కి గట్టి పోటీ ఇవ్వనుందా..?

గోల్డ్ స్టార్ 650 మోటార్‌సైకిల్ రెట్రో-స్టైల్ డిజైన్ ను కలిగి ఉండి, పాత కాలపు బిఎస్ఏ మోటార్‌సైకిళ్లను గుర్తుకు తెస్తుంది. ఈ బైక్ లోని కొన్ని కీలకమైన డిజైన్ హైలైట్‌లను గమనిస్తే, ఇందులో బీహైవ్ సైడ్ ప్యానెల్‌లు, సింగిల్ పీస్ హ్యాండిల్‌బార్లు, సింగిల్ పీస్ బెంచ్ సీట్, గుండ్రటి హెడ్‌ల్యాంప్‌ మరియు టర్న్ ఇండికేటర్స్, ఫోర్క్ గేటర్స్, క్రోమ్ తో మెరిసిపోయే స్టీల్ స్పోక్ వీల్స్, పెద్ద రేడియేటర్ గ్రిల్ మరియు గుండ్రటి సైడ్ మిర్రర్స్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ క్లాసిక్ బైక్ కు మరింత అందంగా మారుస్తాయి.

Yezdi బ్రాండ్‌ను రీలాంచ్ చేయనున్న క్లాసిక్ లెజెండ్స్, మీటియోర్ 350 కి గట్టి పోటీ ఇవ్వనుందా..?

ఇంజన్ విషయానికి వస్తే, ఈ క్లాసిక్ మోటార్‌సైకిల్ లో 652 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 45 బిహెచ్‌పి శక్తిని మరియు 55 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లు మరియు వెనుక వైపు డ్యూయల్ పిన్ షాక్ అబ్జార్బర్‌లు ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి, ఇవి రెండూ కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ను సపోర్ట్ చేయనున్నాయి. ఇందులోని ట్రెడిషనల్ స్పోక్ వీల్స్ పై పిరెల్లీ ఫాంటమ్ స్పోర్ట్ స్కాంబ్ ట్యూబ్ టైర్‌లను అమర్చారు. ఇదే సెటప్ మనకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్విన్ మోటార్‌సైకిళ్లలో కూడా కనిపిస్తుంది.

Yezdi బ్రాండ్‌ను రీలాంచ్ చేయనున్న క్లాసిక్ లెజెండ్స్, మీటియోర్ 350 కి గట్టి పోటీ ఇవ్వనుందా..?

క్లాసిక్ లెజెండ్స్ ఇప్పటికే బిఎస్ఏ మోటార్‌సైకిళ్లను పూణేలో పరీక్షిస్తున్నట్లు గతంలో గుర్తించబడింది. ఈ కొత్త శ్రేణి మోటార్‌సైకిళ్లను భారతదేశంలో క్లాసిక్ లెజెండ్స్ ఇప్పటికే అభివృద్ధి చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా, బిఎస్ఏ మోటార్‌సైకిల్స్ ఇండియా ఇప్పుడు తమ కొత్త సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను కూడా ప్రారంభించాయి. సోషల్ మీడియా వేదికగా, ఇప్పుడు ఈ కంపెనీ తమ అధికారిక ఆగమనాన్ని ధృవీకరించింది. చరిత్రలో కలిసిపోయిన జావా, యెజ్ది మరియు బిఎస్ఏ వంటి ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్లకు క్లాసిక్ లెజెండ్స్ తిరిగి జీవం పోస్తోంది.

Most Read Articles

English summary
Classic legends plans to launch yezdi cruiser motorcycle in india soon will rival meteor 350
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X