BSA మోటార్‌సైకిళ్లను తిరిగి భారత మార్కెట్‌కు తీసుకురానున్న మహీంద్రా గ్రూప్!

మీకు క్లాసిక్ మోటార్‌సైకిళ్లు అంటే ఇష్టమా? అయితే, ఈ వార్త మీకోసమే. మహీంద్రా అండ్ మహీంద్రా యాజమాన్యంలో ఉన్న మోటార్‌సైకిల్ బ్రాండ్ క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends) మరోసారి యూకేకి చెందిన మరొక ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బిఎస్ఏ మోటార్‌సైకిల్స్‌ను (BSA Motorcycles) తిరిగి బారతదేశానికి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. బ్రిటీష్ హయాంలో భారతదేశానికి వచ్చిన ఈ ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్, 1972 సంవత్సరం తర్వాత భారతదేశంలో తమ వ్యాపారాన్ని నిలిపివేసింది.

BSA మోటార్‌సైకిళ్లను తిరిగి భారత మార్కెట్‌కు తీసుకురానున్న మహీంద్రా గ్రూప్!

వచ్చే ఏడాది మధ్య నాటికి యూకేలో BSA మోటార్‌సైకిళ్ల అసెంబ్లీని ప్రారంభించాలని క్లాసిక్ లెజెండ్స్ భావిస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, క్లాసిక్ లెజెండ్స్‌ సంస్థలో 60 శాతం వాటాను కలిగి ఉన్నారు మరియు ఈ ప్రాజెక్ట్‌కు ప్రాథమిక మద్దతుదారుగా నివేదించబడ్డారు. అమెరికాలో టెక్నాలజీ మరియు డిజైన్ సెంటర్ ను అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఆ తర్వాత మిడ్‌ల్యాండ్స్‌లోని BSA యొక్క ప్లాంట్ లో కొత్త మోటార్‌సైకిళ్ల తయారీని ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.

BSA మోటార్‌సైకిళ్లను తిరిగి భారత మార్కెట్‌కు తీసుకురానున్న మహీంద్రా గ్రూప్!

భారతదేశంలో, మహీంద్రా గ్రూప్ ఇప్పటికే BSA మోటార్‌సైకిల్స్‌ను పూణేలో పరీక్షిస్తున్నట్లు గతంలో గుర్తించబడింది. ఈ కొత్త శ్రేణి మోటార్‌సైకిళ్లను భారతదేశంలో క్లాసిక్ లెజెండ్స్ ఇప్పటికే అభివృద్ధి చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా, బిఎస్ఏ మోటార్‌సైకిల్స్ ఇండియా ఇప్పుడు తమ కొత్త సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను కూడా ప్రారంభించాయి. సోషల్ మీడియా వేదికగా, ఇప్పుడు ఈ కంపెనీ తమ అధికారిక ఆగమనాన్ని ధృవీకరించింది.

BSA మోటార్‌సైకిళ్లను తిరిగి భారత మార్కెట్‌కు తీసుకురానున్న మహీంద్రా గ్రూప్!

యూకే ప్రభుత్వం ఇప్పటికే క్లాసిక్ లెజెండ్స్‌కు 4.6 మిలియన్ల యూరోలు (సుమారు రూ. 45.2 కోట్ల) నిధులను మంజూరు చేసింది, ఇది కోవెంట్రీకి సమీపంలో ఉన్న బాన్‌బరీలో ఓ ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మొత్తంలో దాదాపు సగం. దీనివల్ల దాదాపు 255 కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయని భావిస్తున్నారు. ఈ సదుపాయం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లతో బైక్‌లను అభివృద్ధి చేయడానికి ఉపయోగించబడుతుంది, వీటిలో మొదటిది వచ్చే ఏడాది చివరిలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.

BSA మోటార్‌సైకిళ్లను తిరిగి భారత మార్కెట్‌కు తీసుకురానున్న మహీంద్రా గ్రూప్!

బర్మింగ్‌హామ్ స్మాల్ ఆర్మ్స్ అనే బిఎస్‌ఏ నిజానికి 1861 లో బర్మింగ్‌హామ్‌లోని స్మాల్ హీత్‌లో ఆయుధాల తయారీ యూనిట్‌గా స్థాపించబడింది. స్మాల్ హీత్ సెట్టింగ్ ప్రముఖ బిబిసి నెట్‌వర్క్ షో పీకీ బ్లైండర్స్‌లో ప్రదర్శించబడింది. ఈ కంపెనీ 1910 సంవత్సరంలో మోటార్‌సైకిళ్ల ఉత్పత్తిని ప్రారంభించింది మరియు 1960 ల మధ్యకాలం వరకు బాగానే పనిచేసింది.

BSA మోటార్‌సైకిళ్లను తిరిగి భారత మార్కెట్‌కు తీసుకురానున్న మహీంద్రా గ్రూప్!

అయితే, మార్కెట్లోకి జపనీస్ తయారీదారులు ప్రవేశించినప్పుడు బిఎస్ఏ చివరకు 1972లో తమ అన్ని కార్యకలాపాలను నిలిపివేయవలసి వచ్చింది. కాగా, ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ప్రోత్సాహంతో పాటు, మహీంద్రా యూకేలోని బిఎస్ఏ మోటార్‌సైకిళ్లను పునరుద్ధరించడానికి మరొక ప్రధాన కారణం ఏంటంటే, ఈ బ్రాండ్ యొక్క వారసత్వాన్ని పదిలంగా కొనసాగించడమే. మహీంద్రా యొక్క క్లాసిక్ లెజెండ్స్ అనుబంధ సంస్థ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ తరేజా ఈ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్నారు.

BSA మోటార్‌సైకిళ్లను తిరిగి భారత మార్కెట్‌కు తీసుకురానున్న మహీంద్రా గ్రూప్!

ప్రస్తుతం క్లాసిక్ లెజెండ్స్ భారత మార్కెట్‌లో జావా బ్రాండ్‌ క్రింద మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు కొత్తగా తమ బిఎస్ఏ బ్రాండ్‌ను కూడా భారత్‌లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా వచ్చే ఏడాది చివరి నాటికి తమ డీలర్‌షిప్‌లను రెట్టింపు చేసే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. క్లాసిక్ లెజెండ్స్ నుండి జావా, పెరక్ మరియు 42 మోడళ్లు మార్కెట్లో లభిస్తున్నాయి. కాగా, బిఎస్‌ఏ బ్రాండ్ వచ్చేలోగా కంపెనీ తమ డీలర్‌షిప్‌లను రెట్టింపు చేయాలని కంపెనీ భావిస్తోంది.

BSA మోటార్‌సైకిళ్లను తిరిగి భారత మార్కెట్‌కు తీసుకురానున్న మహీంద్రా గ్రూప్!

కేవలం బిఎస్ఏ బ్రాండ్ ని మాత్రమే కాకుండా, 1990 కాలానికి చెందిన ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ యెజ్ది (Yezdi) మోటార్‌సైకిళ్లను తిరిగి భారత మార్కెట్లోకి తీసుకురావాలని క్లాసిక్ లెజెండ్స్ భావిస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే భారతదేశంలో యెజ్ది రోడ్‌కింగ్ పేరును కూడా ట్రేడ్ మార్క్ చేసింది. జావా మరియు బిఎస్ఏ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే యెజ్ది మోటార్‌సైకిళ్లు కూడా ఒకప్పుడు బాగా పాపులర్ అయిన క్లాసిక్ టూవీలర్లు. యెజ్ది రోడ్‌కింగ్ మోడల్‌లో కూడా జావా క్లాసిక్ మరియు ఫోర్టీ టూ మోటార్‌సైకిళ్లలో ఉపయోగించిన అదే ఇంజన్‌ను ఉపయోగిస్తుందని భావిస్తున్నారు.

BSA మోటార్‌సైకిళ్లను తిరిగి భారత మార్కెట్‌కు తీసుకురానున్న మహీంద్రా గ్రూప్!

క్లాసిక్ లెజెండ్స్ యొక్క డీలర్‌షిప్ ల సంఖ్య గత లాక్‌డౌన్లకు ముందు 188 కాగా, ప్రస్తుతం ఈ సంఖ్య 257 కి పెరిగింది. ఈ డిసెంబరు నాటికి ఈ సంఖ్యను 300 కు మరియు వచ్చే ఏడాది చివరి నాటికి 500 కు పెంచాలని క్లాసిక్ లెజెండ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ కంపెనీ డీలర్‌షిప్‌లు ఎక్కువగా నగర ప్రాంతాల్లోనే ఉన్నప్పటికీ, తమ తర్వాతి ఔట్‌లెట్లను మాత్రం చిన్న నగరాల్లో ఏర్పాటు చేయాలని కంపెనీ చూస్తోంది.

BSA మోటార్‌సైకిళ్లను తిరిగి భారత మార్కెట్‌కు తీసుకురానున్న మహీంద్రా గ్రూప్!

బిఎస్‌ఏ మోటార్‌సైకిళ్ల గురించి క్లాసిక్ లెజెండ్స్ సరైన ఆవిష్కరణ లేదా లాంచ్ డేట్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, యెజ్ది బ్రాండ్ మాత్రం అతి త్వరలోనే భారత మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది. క్లాసిక్ లెజెండ్స్ సంస్థ చరిత్రలో కలిసిపోయిన జావా, యెజ్ది బ్రాండ్‌లతో పాటుగా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మోటారుసైకిల్ బ్రాండ్లలో ఒకటైన బిఎస్ఏను కూడా పునరుద్ధరించాలని చూస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Classic legends to re launch bsa motorcycles in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X