BSA Gold Star 650 క్లాసిక్ బైక్ ఆవిష్కరణ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లకు గట్టి పోటీ..

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా యాజమాన్యంలో ఉన్న మోటార్‌సైకిల్ బ్రాండ్ క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends) ఐకానిక్ బ్రిటీష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బిఎస్ఏ మోటార్‌సైకిల్స్‌ను (BSA Motorcycles) తిరిగి బారతదేశానికి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు ఈ బ్రాండ్ పునరుద్ధరణ తర్వాత తమ మొట్టమొదటి మోటార్‌సైకిల్ 'బిఎస్ఏ గోల్డ్ స్టార్ 650' (BSA Gold Star 650) ని అధికారికంగా ఆవిష్కరించింది.

BSA Gold Star 650 క్లాసిక్ బైక్ ఆవిష్కరణ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లకు గట్టి పోటీ..

బిఎస్ఏ తన లెజెండ్రీ క్లాసిక్ లుక్ ని అలానే కొనసాగిస్తూ అధునాతన టెక్నాలజీతో తమ కొత్త గోల్డ్ స్టార్ 650 ని పరిచయం చేసింది. ఈ కొత్త మోటార్‌సైకిల్ ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ (కాంటినెంటల్ జిటి, ఇంటర్‌సెప్టర్) వంటి మోడల్లకు ధీటుగా నిలుస్తుంది. యూకే లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో బిఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటార్‌సైకిల్ ను ప్రదర్శించారు. బిఎస్ఏ మోటార్‌సైకిల్ హక్కులను క్లాసిక్ లెజెండ్స్ 2016 లో దాదాపు రూ. 28 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

BSA Gold Star 650 క్లాసిక్ బైక్ ఆవిష్కరణ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లకు గట్టి పోటీ..

ఈ క్లాసిక్ లుకింగ్ గోల్డ్ స్టార్ 650 మోటార్‌సైకిల్ రెట్రో-స్టైల్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇది పాత కాలపు ఏబిఎస్ మోటార్‌సైకిళ్లను గుర్తుకు తెస్తుంది. ఈ 650 సిసి రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్ యొక్క కొన్ని కీలకమైన డిజైన్ హైలైట్‌లను గమనిస్తే, బీహైవ్ సైడ్ ప్యానెల్‌లు, సింగిల్ పీస్ హ్యాండిల్‌బార్లు, సింగిల్ పీస్ బెంచ్ సీట్, గుండ్రటి హెడ్‌ల్యాంప్‌ మరియు టర్న్ ఇండికేటర్స్, ఫోర్క్ గేటర్స్, క్రోమ్ తో మెరిసిపోయే స్టీల్ స్పోక్ వీల్స్, పెద్ద రేడియేటర్ గ్రిల్ మరియు గుండ్రటి సైడ్ మిర్రర్స్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ క్లాసిక్ బైక్ కు మరింత అందాన్ని తెచ్చిపెడుతాయి.

BSA Gold Star 650 క్లాసిక్ బైక్ ఆవిష్కరణ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లకు గట్టి పోటీ..

గోల్డ్ స్టార్ 650 మోటార్‌సైకిల్ యొక్క ప్రీమియంనెస్ ను మరింత పెంచేందుకు ఈ బైక్ చుట్టూ ఎక్కువగా క్రోమ్ గార్నిష్ కనిపిస్తుంది. హెడ్‌ల్యాంప్ మొదలుకొని టెయిల్ పైప్ (సైలెన్సర్) వరకూ ఈ క్రోమ్ గార్నిష్ కనిపిస్తుంది. దాని టియర్‌డ్రాప్ ఆకారపు ఫ్యూయల్ ట్యాంక్ మరియు విశాలమైన ఫ్రంట్ అండ్ రియర్ ఫెండర్స్ ఈ బైక్ రెట్రో అప్పీల్‌ను మరింత పెంచుతాయి. ఈ డిజైన్ అంశాలలో చాలా వరకు క్లాసిక్ బోన్నెవిల్ ట్విన్స్ నుండి ప్రేరణ పొందినట్లు కూడా అనిపిస్తుంది.

BSA Gold Star 650 క్లాసిక్ బైక్ ఆవిష్కరణ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లకు గట్టి పోటీ..

ఇందులోని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డ్యూయల్-పాడ్ అనలాగ్ డయల్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది కూడా క్లాసిక్ గానే ఉంటుంది. దీని విస్తృతమైన హ్యాండిల్‌బార్లు, మిడ్-సెట్ ఫుట్ పెగ్స్ మరియు వెడల్పాటి సీట్ రైడర్ కు సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని కల్పిస్తాయని కంపెనీ తెలిపింది. సింగిల్ ఎగ్జాస్ట్ పైప్ తో వచ్చిన ఈ కొత్త బిఎస్ఏ గోల్డ్‌స్టార్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. నిజానికి ఈ ఇంజన్ ఈ బైక్ యొక్క అతిపెద్ద హైలైట్ అవుతుంది.

BSA Gold Star 650 క్లాసిక్ బైక్ ఆవిష్కరణ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లకు గట్టి పోటీ..

ఈ క్లాసిక్ మోటార్‌సైకిల్ లో ఉపయోగించిన సింగిల్ సిలిండర్ 652 సిసి ఇంజన్ గరిష్టంగా 45 బిహెచ్‌పి శక్తిని మరియు 55 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ 5 స్పీడ్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్‌ని నిశితంగా పరిశీలిస్తే, దాని కేసింగ్ డిజైన్ బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్650 ఫన్‌డ్యూరో (BMW F650 Funduro) అడ్వెంచర్ బైక్‌కు శక్తినిచ్చే రోటాక్స్ యూనిట్‌ని కొంతవరకు గుర్తు చేస్తుంది. ఈ 650 సిసి సింగిల్-సిలిండర్ డిఓహెచ్‌సి ఇంజన్ కూలింగ్ వింగ్స్ ఉండటం కూడా గమనించదగ్గ విషయం.

BSA Gold Star 650 క్లాసిక్ బైక్ ఆవిష్కరణ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లకు గట్టి పోటీ..

ఇంజన్ వేడిని తగ్గించేందుకు ఈ మోటార్‌సైకిల్ లో చాలా పెద్ద రేడియేటర్ ఉంటుంది. ఇంకా ఇందులో ఫ్యూయెల్ ఇంజెక్టర్ కవర్ కూడా కనిపిస్తుంది. కంపెనీ దీనిని ఎయిర్-కూల్డ్ యూనిట్ మాదిరిగా చూపించాలనే ప్రయత్నం చేసినప్పటికీ, దాని ఫ్రేమ్ డౌన్ ట్యూబ్ దగ్గర లిక్విడ్ కూలింగ్ కోసం అమర్చిన పైపింగ్ ను చూస్తే, అది లిక్విడ్-కూల్డ్ మోటార్ అని తెలిసిపోతుంది. ఇది సింగిల్ సిలిండర్ యూనిట్ అయినప్పటికీ, ఇంజన్ నుండి ఎక్కువ శక్తిని వెలికితీసేందుకు బైక్‌కి సహాయపడుతుంది.

BSA Gold Star 650 క్లాసిక్ బైక్ ఆవిష్కరణ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లకు గట్టి పోటీ..

ఇక ఈ బైక్ లోని ఇతర హార్డ్‌వేర్‌లను గమనిస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లు మరియు వెనుక వైపు డ్యూయల్ పిన్ షాక్ అబ్జార్బర్‌లు ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి, ఇవి రెండూ కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ను సపోర్ట్ చేయనున్నాయి. ఇందులోని ట్రెడిషనల్ స్పోక్ వీల్స్ పై పిరెల్లీ ఫాంటమ్ స్పోర్ట్ స్కాంబ్ ట్యూబ్ టైర్‌లను అమర్చారు. ఇదే సెటప్ మనకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్విన్ మోటార్‌సైకిళ్లలో కూడా కనిపిస్తుంది.

BSA Gold Star 650 క్లాసిక్ బైక్ ఆవిష్కరణ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లకు గట్టి పోటీ..

భారతదేశంలో, మహీంద్రా గ్రూప్ ఇప్పటికే బిఎస్ఏ మోటార్‌సైకిళ్లను పూణేలో పరీక్షిస్తున్నట్లు గతంలో గుర్తించబడింది. ఈ కొత్త శ్రేణి మోటార్‌సైకిళ్లను భారతదేశంలో క్లాసిక్ లెజెండ్స్ ఇప్పటికే అభివృద్ధి చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా, బిఎస్ఏ మోటార్‌సైకిల్స్ ఇండియా ఇప్పుడు తమ కొత్త సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను కూడా ప్రారంభించాయి. సోషల్ మీడియా వేదికగా, ఇప్పుడు ఈ కంపెనీ తమ అధికారిక ఆగమనాన్ని ధృవీకరించింది.

BSA Gold Star 650 క్లాసిక్ బైక్ ఆవిష్కరణ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లకు గట్టి పోటీ..

చరిత్రలో కలిసిపోయిన జావా, యెజ్ది మరియు బిఎస్ఏ వంటి ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్లకు తిరిగి జీవం పోసేందుకు క్లాసిక్ లెజెండ్స్ బ్రాండ్ శ్రీకారం చుట్టింది. ఈ బ్రాండ్ ఇప్పటికే జావా మోటార్‌సైకిళ్లను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. కాగా, ఇప్పుడు బిఎస్ఏ బ్రాండ్ ను మరియు రాబోయే రోజుల్లో యెజ్ది బ్రాండ్ ను కూడా భారతదేశానికి తీసుకురావాలని క్లాసిక్ లెజెండ్స్ భావిస్తోంది.

Most Read Articles

English summary
Classic legends unveils bsa gold star 650 iconic motorcycle feature specs engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X