దేశీయ మార్కెట్లో ఎక్కువ మైలేజ్ అందించే బైకులు: వాటి వివరాలు

భారతదేశంలో రోజురోజుకి కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తున్నాయి. ప్రతి సంవత్సరం దేశంలో మిలియన్ల కొద్దీ వాహనాలు అమ్ముడవుతున్నాయి. అయితే ఆ సంఖ్యకు అనుగుణంగా రోడ్లు విస్తరించడం లేదు. వాహన వినియోగాలు పెరుగుతున్న సమయంలో రోడ్లు చాలా రోడ్లు చాలా రద్దీగా మారుతున్నాయి. ఈ కారణంగా ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రతరం అవుతుంది.

దేశీయ మార్కెట్లో ఎక్కువ మైలేజ్ అందించే బైకులు: వాటి వివరాలు

భారతదేశంలోని దాదాపు అన్ని నగరాలలోనూ ట్రాఫిక్ రద్దీ అనేది ఇప్పుడు చాలా సర్వ సాధారణంగా మారింది. ఈ రకమైన ట్రాఫిక్ మధ్య రోజూ చాలా మంది బైక్‌పై ఆఫీసులకు మరియు ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ట్రాఫిక్‌ రద్దీతో పాటు ప్రస్తుతం పెట్రోల్‌ ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి.

దేశీయ మార్కెట్లో ఎక్కువ మైలేజ్ అందించే బైకులు: వాటి వివరాలు

ప్రస్తుత పరిస్థితిలో ప్రతి రోజూ ద్విచక్రవాహనదారులు ట్రాఫిక్‌ రద్దీ, పెట్రోల్‌ ధరల పెరుగుదలతో సతమతమవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో వాహనదారులు ఎక్కువ మైలేజీనిచ్చే బైక్‌లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. భారతీయ రోడ్లపై నడపడానికి ఉత్తమమైన బైక్‌లు మరియు మంచి మైలేజ్ అందించే బైకుల గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

అంతే కాకుండా భారతదేశంలో ప్రారంభమైన ఈ పండుగ సీజన్లో ఎక్కువ మంది కొత్త బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు, కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ఎక్కువ మైలేజ్ అందించే బైకులు: వాటి వివరాలు

హీరో స్ప్లెండర్ (Hero Splendor):

Hero Splendor బైక్ Hero MotoCorp యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన బైక్. ఇది దేశీయ మార్కెట్లో చాలాకాలంగా తన ఉనికిని చాటుకుంటోంది. హీరో స్ప్లెండర్ బైక్ రోజువారీ నగర వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో ప్రతి నెలా అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో హీరో స్ప్లెండర్ కూడా ఒకటి. దీన్ని బట్టి చూస్తే ఈ బైక్ కి దేశీయ మార్కెట్లో ఎలాంటి ఆదరణ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

దేశీయ మార్కెట్లో ఎక్కువ మైలేజ్ అందించే బైకులు: వాటి వివరాలు

దేశీయ విపణిలో లభించే అత్యంత తేలికైన బైక్‌లలో హీరో స్ప్లెండర్ ఒకటి. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు దాదాపు 60 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. భారతదేశంలో ప్రస్తుత పెట్రోల్ ధర చాలా ఎక్కువగా ఉంది, కావున ఈ బైక్ రోజూవారీ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది, అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

దేశీయ మార్కెట్లో ఎక్కువ మైలేజ్ అందించే బైకులు: వాటి వివరాలు

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe):

Hero HF Deluxe బైక్ కూడా కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణపొందిన మోడల్. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ యొక్క మొత్తం బరువు 110 కేజీల వరకు ఉంటుంది. అంతే కాకుండా ఈ బైక్ ఒక లీటరు పెట్రోల్ కు దాదాపుగా 65 కి.మీ మైలేజీని అందిస్తుంది. పెట్రోల్ ధరల పెంపుతో బాధపడుతున్న వారికి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ బెస్ట్ ఛాయిస్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

దేశీయ మార్కెట్లో ఎక్కువ మైలేజ్ అందించే బైకులు: వాటి వివరాలు

హోండా షైన్ (Honda Shine):

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో Honda కంపెనీ యొక్క Honda Shine (హోండా షైన్) ఒకటి. ఈ బైక్ బరువు 114 కేజీలు. హోండా షైన్ బైక్ రద్దీగా ఉండే భారతీయ రోడ్లపై ప్రయాణించడానికి ఉత్తమమైన ఎంపిక. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు దాదాపు 55 కి.మీ మైలేజీని అందిస్తుంది. కావున వినియోగదారులకు మంచి మైలేజ్ అందించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

దేశీయ మార్కెట్లో ఎక్కువ మైలేజ్ అందించే బైకులు: వాటి వివరాలు

హోండా యునికార్న్ (Honda Unicorn):

Honda Unicorn (హోండా యునికార్న్) బైక్ కంపెనీ యొక్క మరొక్క అద్భుతమైన అత్యంత అదరణ పొందిన బైక్. ఈ బైక్ భారతదేశంలో విడుదలై దాదాపు 10 సంత్సరాలు పూర్తి చేసుకుంది. హోండా యునికార్న్ వినియోగదారుల యొక్క నమ్మదగిన మరియు మన్నికైన బైక్. 10 ఏళ్ల నాటి హోండా యునికార్న్ బైక్ ఇప్పటికీ భారతీయ రోడ్లపై కనిపిస్తుంది.

దేశీయ మార్కెట్లో ఎక్కువ మైలేజ్ అందించే బైకులు: వాటి వివరాలు

హోండా యునికార్న్ బైక్ లీటర్ పెట్రోల్‌కు 45 కి.మీ మైలేజీని అందిస్తుందని హోండా అధికారికంగా పేర్కొంది. హోండా యునికార్న్ అద్భుతమైన పనితీరుతో పాటు అద్భుతమైన మైలేజీని అందించే బైక్. ఇది ఇప్పటికి కూడా బ్రాండ్ యొక్క మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న బైక్, అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

దేశీయ మార్కెట్లో ఎక్కువ మైలేజ్ అందించే బైకులు: వాటి వివరాలు

బజాజ్ ప్లాటినా (Bajaj Platina):

Bajaj Platina (బజాజ్ ప్లాటినా) బైక్ భారతీయ మార్కెట్లో ఎక్కవమంది మనసు దోచిన బైక్. అంతే కాకుండా, ఇది దేశంలోనే అత్యధిక మైలేజీనిచ్చే బైక్‌లలో ఒకటి. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 75 కి.మీ మైలేజీని ఇస్తుంది. దీనికంటే ఎక్కువ మైలేజీ వస్తుందని కొందరు వినియోగదారులు ప్రస్తావించారు. పెట్రోల్ ధరల పెరుగుదలతో బాధపడుతున్న వారు ఈ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ అద్భుతమైన మైలేజ్ పొందవచ్చు.

దేశీయ మార్కెట్లో ఎక్కువ మైలేజ్ అందించే బైకులు: వాటి వివరాలు

బజాజ్ సిటి 100 (Bajaj CT 100):

బజాజ్ కంపెనీ యొక్క అత్యంత అదరణపొందిన బైక్ ఈ Bajaj CT 100. ఇది మంచి మైలేజ్ ఇస్తుంది. నివేదికల ప్రకారం ఒక లీటరు పెట్రోల్ తో కంపెనీ యొక్క బజాజ్ ప్లాటినా మాదిరిగా 75 కి.మీ మైలేజ్ అందిస్తుందని తెలుస్తుంది. Bajaj CT 100 బైక్ యొక్క బరువు 115 కేజీల అరకు ఉంటుంది. ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి బజాజ్ CT 100 బైక్ నిజంగా మంచి ఎంపిక. ఉత్తమైన మైలేజ్ అందించే బైకులు కొనాలని వేచి చూస్తున్నవారికి ఇది చాలా మంచి ఎంపిక అవుతుంది.

దేశీయ మార్కెట్లో ఎక్కువ మైలేజ్ అందించే బైకులు: వాటి వివరాలు

బజాజ్ పల్సర్ 150 (Bajaj Pulsar 150):

భారతదేశంలో మొట్టమొదటి స్పోర్ట్స్ బైక్ అయిన బజాజ్ పల్సర్ 2001లో విడుదలైంది. దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటినుంచి కూడా బజాజ్ పల్సర్ సిరీస్ బైక్‌లు పెద్ద సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఇందులో కూడా బజాజ్ పల్సర్ 150 బైకులు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.

దేశీయ మార్కెట్లో ఎక్కువ మైలేజ్ అందించే బైకులు: వాటి వివరాలు

బజాజ్ పల్సర్ 150 దాని ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉండి, చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.దేశీయ మార్కేలో మంచి ఇంధన సామర్థ్యం కలిగిన బైకులలో ఇది కూడా ఒకటి. పల్సర్ 150 బైక్ లీటరు పెట్రోల్‌కు 50 కి.మీ కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుందని బజాజ్ పేర్కొంది. ప్రతి రోజూ ఎక్కువ దూరం ప్రయాణించేవారికి ఇది ఇది మంచి ఎంపిక.

Most Read Articles

English summary
Commuter bikes with more mileage in domestic market details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X