Honda CB200X వర్సెస్ Hero XPulse 200: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

జపనీస్ టూవీలర్ బ్రాండ్ Honda Motorcycle ఇటీవల భారత మార్కెట్లో Honda CB200X (హోండా సిబి200ఎక్స్) పేరుతో ఓ సరికొత్త ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. దేశీయ విపణిలో ఈ బైక్ ధర రూ.1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కంపెనీ నుండి లభిస్తున్న అత్యంత చవకైన అడ్వెంచర్ బైక్ ఇది.

Honda CB200X వర్సెస్ Hero XPulse 200: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

భారత ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగంలో Honda CB200X బైక్ నేరుగా Hero XPulse 200 బైక్‌తో పోటీ పడుతుంది. మరి ఈ రెండు మోటార్‌సైకిళ్ల మధ్య ప్రధానంగా ఉన్న వ్యత్యాసాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Honda CB200X వర్సెస్ Hero XPulse 200: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

కొత్త Honda CB200X ను ఇటు సిటీ ప్రయాణానికి మరియు అటు ఆఫ్-రోడ్ ప్రయాణానికి అనువుగా ఉండేలా డ్యూయెల్ పర్పస్ టైర్లు మరియు అల్లాయ్ వీల్స్‌తో రూపొందించబడింది. కాగా, Hero XPulse 200 ను ప్రత్యేకించి ఆఫ్-రోడ్ ప్రయోజనాల కోసం నాబీ టైర్స్ మరియు స్పోక్స్ వీల్స్‌తో రూపొందించినట్లుగా అనిపిస్తుంది. అయితే, ఈ రెండు మోడళ్లను కూడా డ్యూయెల్ పర్పస్ బైక్‌లుగా ఉపయోగించుకోవచ్చు.

Honda CB200X వర్సెస్ Hero XPulse 200: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ధరలు:

ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ రెండు మోటార్‌సైకిళ్ల ఎక్స్-షోరూమ్ ధరలను గమనిస్తే, కొత్త Honda CB200X బైక్ ధర రూ.1.44 లక్షలు కాగా, Hero XPulse 200 బైక్ ధర రూ.1.20 లక్షలుగా ఉంది. ధర పరంగా చూసుకుంటే, CB200X కన్నా XPulse 200 రూ.24,000 తక్కువ ధరను కలిగి ఉంటుంది మరియు ఇది CB200X కంటే మెరుగైన ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది.

Honda CB200X వర్సెస్ Hero XPulse 200: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

కొలతలు:

ఇక కొలతల విషయానికి వస్తే, Hero XPulse 200 అడ్వెంచర్ బైక్‌తో కొత్త Honda CB200X అడ్వెంచర్ బైక్‌ను పోల్చినప్పుడు పొడవు, వెడల్పు, ఎత్తు, వీల్‌బేస్, గ్రౌండ్ క్లియరెన్స్, భూమి నుండి సీటు ఎత్తు, మొత్తం బరువు మరియు పెట్రోల్ ట్యాంక్ వంటి అంశాలలో ఇది కాస్తంత తక్కువగా ఉంటుంది. ఫలితంగా, ఈ రెండింటిని పక్కపక్కనే ఉంచి చూసినప్పుడు Hero XPulse 200 కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది.

Dimensions Honda CB200X Hero Xpulse 200
Length 2035mm 2222mm
Width 843mm 850mm
Height 1248mm 1258mm
Wheelbase 1355mm 1410mm
Ground Clearance 167mm 220mm
Seat Height 810mm 823mm
Kerb Weight 147kg 157kg
Fuel Tank 12-litres 13-litres
Honda CB200X వర్సెస్ Hero XPulse 200: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఇంజన్:

అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఈ రెండు మోటార్‌సైకిళ్లు ఇంచు మించు ఒకేరకమైన పనితీరును కలిగి ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న Hero XPulse 200 బైక్‌లో బిఎస్6 వెర్షన్ 199.6 సిసి, సింగిల్ సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 17.8 బిహెచ్‌పి శక్తిని మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 16.45 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Honda CB200X వర్సెస్ Hero XPulse 200: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఇక, కొత్త Honda CB200X అడ్వెంచర్ బైక్ విషయానికి వస్తే, ఇందులో 184.4 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 17 బిహెచ్‌పి శక్తిని మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 16.1 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న Honda Hornet 2.0 బైక్‌లో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. కాగా, ఈ రెండు మోటార్‌సైకిళ్లు కూడా 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తాయి.

Honda CB200X వర్సెస్ Hero XPulse 200: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఫ్రేమ్ మరియు మెకానికల్స్:

కొత్త Honda CB200X బైక్‌ను కూడా Hornet 2.0 బైక్ మాదిరిగానే ఒకేరకమైన డైమండ్ టైప్ ఛాస్సిస్‌పై రూపొందించారు. అయితే, Hero XPulse 200 బైక్ ను మాత్రం ట్యూబులర్ డైమండ్ ఫ్రేమ్ ఆధారంగా నిర్మించారు. ఈ Honda అడ్వెంచర్ బైక్‌లో ముందు వైపు ఇన్‌వర్టెడ్ ఫోర్కులు మరియు వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది.

Honda CB200X వర్సెస్ Hero XPulse 200: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఇక Hero అడ్వెంచర్ బైక్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో 190 మిమీ ట్రావెల్ తో కూడిన టెలిస్కోపిక్ ఫోర్క్‌లు మరియు వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటాయి. వెనుక సస్పెన్షన్‌ను 10 లెవల్స్‌లో సర్దుబాటు చేసుకోవచ్చు.

Honda CB200X వర్సెస్ Hero XPulse 200: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

వీల్స్ మరియు టైర్లు:

కొత్త Honda CB200X బైక్‌లో ఇరువైపులా 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు వాటిపై ముందు భాగంలో 110/70 సెక్షన్ ట్యూబ్‌లెస్ టైరు మరియు వెనుక భాగంలో 140/70 సెక్షన్ ట్యూబ్‌లెస్ టైరు అమర్చబడి ఉంటాయి. అలాగే, Hero XPulse 200 బైక్‌లో ముందు వైపు 21 ఇంచ్ స్పోక్ వీల్ మరియు దానిపై 90/90 సెక్షన్ టైర్ ఉంటుంది. వెనుక వైపు 18 ఇంచ్ స్పోక్ వీల్ మరియు దానిపై 120/80 సెక్షన్ టైర్ ఉంటుంది.

Honda CB200X వర్సెస్ Hero XPulse 200: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

బ్రేకింగ్ హార్డ్‌వేర్:

బ్రేకింక్ విషయానికి వస్తే, ఇవి రెండూ కూడా ఇరువైపులా డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటాయి. కొత్త Honda CB200X లో ముందు వైపు 276 మిమీ డిస్క్, వెనుక వైపు 220 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. కాగా, Hero XPulse 200 లో కూడా CB200X మాదిరిగానే ముందు వైపు 276 మిమీ డిస్క్, వెనుక వైపు 220 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఈ రెండు మోడళ్లు కూడా సింగిల్ ఛానెల్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ను సపోర్ట్ చేస్తాయి.

Most Read Articles

English summary
Comparison between honda cb200x and hero xpluse 200 price specs and features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X