Yamaha R15M వర్సెస్ Yamaha R15 V4.0: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా మోటార్ ఇండియా (Yamaha Motor India) తాజాగా రెండు కొత్త మోటార్‌సైకిళ్లు Yamaha R15M మరియు Yamaha R15 V4.0 మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. వీటితో పాటుగా కంపెనీ తమ మొట్టమొదటి మాక్సీ స్కూటర్ యమహా ఏరోక్స్ 155 (Yamaha Aerox 155) ని కూడా విడుదల చేసింది. ఈ కథనంలో మనం యమహా ఆర్15ఎమ్ మరియు ఆర్15 వెర్షన్ 4.0 మోడళ్ల మధ్య ఉన్న తేడాలు ఏంటో తెలుసుకుందాం రండి.

Yamaha R15M వర్సెస్ Yamaha R15 V4.0: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

కొత్తగా వచ్చిన Yamaha R15M మరియు R15 V4.0 రెండూ కూడా ఫుల్ ఫెయిర్డ్ మోటార్‌సైకిళ్లు. ఇప్పటి వరకూ కంపెనీ విక్రయిస్తూ వచ్చిన Yamaha R15 V3.0 స్థానాన్ని రీప్లేస్ చేస్తూ కంపెనీ కొత్త 2021 Yamaha R15 V4.0 ని విడుదల చేసింది. కాగా, ఇందులో మరింత స్పోర్టీయర్ వేరియంట్ కోరుకునే వారి కోసం కంపెనీ కొత్త Yamaha R15M వేరియంట్‌ను విడుదల చేసింది.

Yamaha R15M వర్సెస్ Yamaha R15 V4.0: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

నిజానికి ఈ రెండు మోటార్‌సైకిళ్లు పూర్తిగా ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయబడ్డాయి మరియు వీటిలోని పరికరాలు, టెక్నాలజీ, ఇంజన్ ఆప్షన్స్ మొదలైనవి అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. కాకపోతే, ఈ రెండు మోడళ్ల మధ్య డిజైన్ మరియు ఫీచర్ల పరంగా స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. మరి ఆ వ్యత్యాసాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Yamaha R15M వర్సెస్ Yamaha R15 V4.0: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

Yamaha R15M వర్సెస్ Yamaha R15 V4.0: ధర

కొత్త Yamaha R15 V4 మరియు R15M మోటార్‌సైకిళ్ల ధరలు వాటి కలర్ ఆప్షన్లను బట్టి వేర్వేరుగా ఉంటాయి. ఈ రెండు మోడళ్ల మధ్య వ్యత్యాసాలను చూపేందుకు కంపెనీ ఈ రెండింటినీ వేర్వేరు కలర్ ఆప్షన్లలో విక్రయిస్తోంది. ఇందులో గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ బైక్స్ లో క్విక్‌షిఫ్టర్ ఫీచర్‍‌ను కంపెనీ దాని రేసింగ్ బ్లూ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంచింది. Yamaha R15 V4 మరియు R15M రెండు బైకులు కూడా ఈ రేసింగ్ బ్లూ కలర్‌తో మరింత ప్రీమియంగా మారుతాయి.

Yamaha R15M వర్సెస్ Yamaha R15 V4.0: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

Yamaha R15 V4 మెటాలిక్ రెడ్ మరియు డార్క్ నైట్ కలర్ ఆప్షన్ల ధర రూ. 1,67,800 మరియు రూ. 1,68,800 (ఎక్స్-షోరూమ్)గా ఉంటే, ఇందులోని రేసింగ్ బ్లూ షేడ్ ధర రూ. 1,72,800 (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఈ సిరీస్‌లో అగ్రస్థానంలో ఉన్న Yamaha R15M ధర రూ. 1,77,800 (ఎక్స్-షోరూమ్) కాగా, మోన్‌స్టర్ ఎనర్జీ మోటోజిపి ఎడిషన్ ధర రూ. 1,79,800 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Yamaha R15M వర్సెస్ Yamaha R15 V4.0: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

Yamaha R15M వర్సెస్ Yamaha R15 V4.0: కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్ విషయానికి వస్తే, Yamaha R15 V4.0 బైక్‌ని కంపెనీ మొత్తం మూడు కలర్ ఆప్షన్‌లలో విడుదల చేసింది. వీటిలో రేసింగ్ బ్లూ, డార్క్ నైట్ మరియు మెటాలిక్ రెడ్ ఉన్నాయి. Yamaha R15 V4.0 రేసింగ్ బ్లూ కలర్‌లో మాత్రమే క్విక్‌షిఫ్టర్ ఫీచర్‌తో లభిస్తుంది.

Yamaha R15M వర్సెస్ Yamaha R15 V4.0: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

ఇక Yamaha R15M యొక్క కలర్ ఆప్షన్‌ల విషయానికి వస్తే, కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను మెటాలిక్ గ్రే కలర్ ఆప్షన్‌లో విడుదల చేసింది. దీనితో పాటు, ఈ రేస్-ప్రేరేపిత మోన్‌స్టర్ ఎనర్జీ మోటోజిపి ఎడిషన్‌లో కూడా లభిస్తుంది. ఈ బైక్‌లో క్విక్‌షిఫ్టర్ ఫీచర్ స్టాండర్డ్‌గా లభిస్తుంది.

Yamaha R15M వర్సెస్ Yamaha R15 V4.0: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

Yamaha R15M వర్సెస్ Yamaha R15 V4.0: డిజైన్ మరియు స్టైల్

ఈ రెండు ఎంట్రీ-లెవల్ సూపర్ స్పోర్ట్ మోటార్‌సైకిళ్ల డిజైన్ మరియు స్టైలింగ్ అంశాలను పరిశీలిస్చే, ఈ రెండు బైకులు దాదాపు ఒకేలా కనిపిస్తాయి. కొత్త Yamaha R15 V4 మరియు R15M మోడళ్లలోని బై-ఫంక్షనల్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, అత్యంత ఏరోడైనమిక్ ఫెయిరింగ్‌లు, ఎల్ఈడి పొజిషన్ ల్యాంప్‌లు వంటి మరెన్నో డిజైన్ అంశాలు ఒకేలా ఉంటాయి.

Yamaha R15M వర్సెస్ Yamaha R15 V4.0: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

అయితే, ఇందులో ప్రధాన వ్యత్యాసాలను గమనిస్తే, Yamaha R15 V4 బైక్‌లో అధునాతన పూర్తి డిజిటల్ ఎల్‌సిడి మీటర్ కన్సోల్ లభిస్తుంది. కాగా, Yamaha R15M మోడల్‌లో, కంపెనీ యొక్క లేటెస్ట్ Y-కనెక్ట్ ఫీచర్లతో కూడిన రెగ్యులర్ డిస్‌ప్లే లభిస్తుంది. ఈ రెండింటి డిజైన్‌లో అతి పెద్ద వ్యత్యాసం వాటి కలర్ ఆప్షన్లు అని చెప్పవచ్చు.

Yamaha R15M వర్సెస్ Yamaha R15 V4.0: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, Yamaha R15 V4 భారతదేశంలో మొదటిసారిగా అప్-సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్‌లతో లాంచ్ చేయబడింది, ఎందుకంటే ఇవి ఇప్పటివరకు గ్లోబల్-స్పెక్ మోడల్‌లో మాత్రమే అందుబాటులో ఉండేవి. కొత్త Yamaha R15M మోడల్‌లో కార్బన్ ఫైబర్ లాంటి సీట్ కవర్ మెటీరియల్ (రైడర్ మరియు పిలియన్ రైడర్ కోసం) మరియు వెనుక సీటుపై ఎంబ్రాయిడరీ లోగోను కలిగి ఉంటుంది.

Yamaha R15M వర్సెస్ Yamaha R15 V4.0: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

Yamaha R15M వర్సెస్ Yamaha R15 V4.0: ఫీచర్లు

Yamaha R15 V4.0 బైక్‌లో లభించే ఫీచర్లను గమనిస్తే, ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ ఫీచర్ ఉంటుంది. ఇది ఎస్ఎమ్ఎస్, ఇ-మెయిల్, కాల్ అలెర్ట్, ఫోన్ బ్యాటరీ స్థాయి, మెయింటినెన్స్ రిమైండర్, ఇంధన వినియోగ ట్రాకర్ వంటి అనేక రకాల నోటిఫికేషన్ లను తెలియజేస్తుంది.

Yamaha R15M వర్సెస్ Yamaha R15 V4.0: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

ఇంకా ఇందులో రెండు రైడింగ్ మోడ్‌లు (ట్రాక్ మోడ్, స్ట్రీట్ మోడ్) కూడా ఉంటాయి. కొత్త 2021 R15 V4.0 బైక్‌లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఫీచర్‌ కూడా లభిస్తుంది. ఇది రోడ్డుపై మంచి హ్యాండ్లింగ్‌ను అందించడంలో సహకరిస్తుంది. ఇందులోని ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో గేర్‌షిఫ్ట్ సూచిక కూడా కనిపిస్తుంది.

Yamaha R15M వర్సెస్ Yamaha R15 V4.0: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

ఇక Yamaha R15M లో కనిపించే ఫీచర్‌ల విషయానికి వస్తే, ఈ స్పోర్టీ వెర్షన్ బైక్‌లో కూడా స్టాండర్డ్ R15 V4 లో లభించే అన్ని ఫీచర్లు లభిస్తాయి. అంతేకాకుండా, ఈ మోడల్‌లో స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి.

Yamaha R15M వర్సెస్ Yamaha R15 V4.0: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

Yamaha R15M వర్సెస్ Yamaha R15 V4.0: ఇంజన్ మరియు స్పెసిఫికేషన్‌లు

ఈ రెండు మోడళ్లలో (R15M, R15 V4.0) ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులోని 155 సిసి ఎస్ఓహెచ్‌సి ఎఫ్ఐ సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.4 బిహెచ్‌పి శక్తిని మరియు 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 14.2 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు బైకులు 6-స్పీడ్ కాన్స్టాంట్ మెష్ గేర్‌బాక్స్ మరియు వెట్ మల్టీ-డిస్క్ క్లచ్‌తో లభిస్తాయి.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Comparison between new yamaha r15m and r15 v4 engine specs features price details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X