TVS Raider 125 వర్సెస్ Bajaj Pulsar NS 125 : కంపారిజన్

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ భారతీయ టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) నేడు (సెప్టెంబర్ 16) తమ సరికొత్త 125 సిసి మోటార్‌సైకిల్ టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125) ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం ఇది టీవీఎస్ నుండి లభిస్తున్న ఏకైక 125 సిసి మోటార్‌సైకిల్. ఇది ఈ విభాగంలో అనేక ఇతర 125 సిసి బైక్‌లతో పోటీ పడనుంది.

TVS Raider 125 వర్సెస్ Bajaj Pulsar NS 125 : కంపారిజన్

వీటిలో ప్రధానంగా కెటిఎమ్ 125 డ్యూక్ (KTM 125 Duke), కెటిఎమ్ ఆర్‌సి 125 (KTM RC 125) మరియు బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 (Bajaj Pulsar NS 125) మోడళ్లు ఉన్నాయి. ఇవే కాకుండా, కొత్త టీవీఎస్ రైడర్ ఈ విభాగంలోని హోండా ఎస్‌పి 125 (Honda SP 125), బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar 125), హోండా సిబి షైన్ (Honda CB Shine) మరియు హీరో గ్లామర్ ఐ3ఎస్‌ (Hero Glamour i3S) వంటి మోడళ్లతో కూడా పోటీపడుతుంది.

TVS Raider 125 వర్సెస్ Bajaj Pulsar NS 125 : కంపారిజన్

ఈ నేపథ్యంలో కొత్త TVS Raider 125 ఈ విభాగంలో అత్యంత పాపులర్ అయిన Bajaj Pulsar NS 125 బైక్‌తో ఏ విధంగా పోటీ పడుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

TVS Raider 125 వర్సెస్ Bajaj Pulsar NS 125 : కంపారిజన్

Raider 125 వర్సెస్ Pulsar NS 125: ధర

టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ కొత్త రైడర్ 125 మోటార్‌సైకిల్‌ని రూ. 77,500 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇందులో టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 85,469 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ బైక్ రెండు వేరియంట్‌లలో డ్రమ్ బ్రేక్ మరియు డిస్క్ బ్రేక్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటుంది.

TVS Raider 125 వర్సెస్ Bajaj Pulsar NS 125 : కంపారిజన్

ఇక బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 విషయానికి వస్తే, ఇది కేవలం ఒకేఒక వేరియంట్ (స్టాండర్డ్‌)లో మాత్రమే అమ్ముడవుతోంది. దేశీయ విపణిలో ఎక్స్-షోరూమ్ ధర రూ. 98,234 లుగా ఉంటుంది. ధర పరంగా చూసుకుంటే, పల్సర్ ఎన్ఎస్ 125 ధర టీవీఎస్ రైడర్ 125 ధర కంటే సుమారు రూ. 20,000 అధికంగా ఉంటుంది. కాబట్టి, ధర విషయంలో ఇది పల్సర్ ఎన్ఎస్ 125ను ఓవర్‌టేక్ చేసింది.

TVS Raider 125 వర్సెస్ Bajaj Pulsar NS 125 : కంపారిజన్

Raider 125 వర్సెస్ Pulsar NS 125: ఇంజన్ మరియు గేర్‌బాక్స్

కొత్తగా వచ్చిన TVS Raider 125 బైక్‌లో 124.8 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ 3వి ఇంజన్‌ను ఉపయోగించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 11.2 బిహెచ్‌పి పవర్‌ను మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 11.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కంపెనీ ఇందులో ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని ఉపయోగించింది మరియు ఇందులో కిక్ స్టార్ట్ ఆప్షన్ లేదు. కేవలం సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్‌తోనే లభిస్తుంది.

TVS Raider 125 వర్సెస్ Bajaj Pulsar NS 125 : కంపారిజన్

ఇక Bajaj Pulsar NS 125 విషయానికి వస్తే, కంపెనీ ఈ బైక్‌లో 124.4 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ డిటిఎస్-ఐ ఇంజన్‌ను ఉపయోగించింగి. ఈ ఇంజన్ గరిష్టంగా 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 11.9 బిహెచ్‌పి పవర్‌ను మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 11 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కిక్ మరియు ఎలక్ట్రిక్ స్టార్ట్ రెండు ఆప్షన్లను కలిగి ఉంటుంది.

TVS Raider 125 వర్సెస్ Bajaj Pulsar NS 125 : కంపారిజన్

Raider 125 వర్సెస్ Pulsar NS 125: పరిమాణం మరియు సామర్థ్యం

కొత్త TVS Raider 125 కొలతలను గమనిస్తే, ఇది 2,025 మిమీ పొడవు, 705 మిమీ వెడల్పు, 1,080 మిమీ ఎత్తు మరియు 1,265 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్‌ 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో లభిస్తుంది మరియు దీని మొత్తం బరువు 123 కిలోలుగా ఉంటుంది. ఈ బైక్‌లో 10 లీటర్ల ఇంధన ట్యాంక్ మరియు అండర్‌సీట్ స్టోరేజ్‌ను కూడా కలిగి ఉంటుంది.

TVS Raider 125 వర్సెస్ Bajaj Pulsar NS 125 : కంపారిజన్

అలాగే, Bajaj Pulsar NS 125 కొలతలను గమనిస్తే, ఇది 2,012 మిమీ పొడవు, 810 మిమీ వెడల్పు, 1,078 మిమీ ఎత్తు, 1,353 మిమీ వీల్‌బేస్ మరియు 179 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ మొత్తం బరువు144 కిలోలుగా ఉంటుంది. ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 12 లీటర్లుగా ఉంటుంది. కొలతల పరంగా ఈ రెండు మోడళ్లు ఇంచిమించు ఒకేలా ఉన్నాయి. కాకపోతే, పల్సర్ చూడటానికి కాస్తంత పెద్దదిగా అనిపిస్తుంది.

TVS Raider 125 వర్సెస్ Bajaj Pulsar NS 125 : కంపారిజన్

Raider 125 వర్సెస్ Pulsar NS 125: ఫీచర్లు

కొత్త TVS Raider 125 లో లభించే ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్, కన్సోల్ మరియు టాకో మీటర్ మొదలైనవి పూర్తిగా డిజిటల్‌గా ఉంటాయి. ఇంకా ఇందులో రెండు రైడింగ్ మోడ్‌లు, 5 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే, స్మార్ట్ఎక్స్‌కనెక్ట్, వాయిస్ అసిస్ట్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

TVS Raider 125 వర్సెస్ Bajaj Pulsar NS 125 : కంపారిజన్

ఇక Bajaj Pulsar NS 125 విషయానికి వస్తే, ఇందులో కూడా స్పీడోమీటర్, అనలాగ్ టాకోమీటర్, అనలాగ్ మరియు డిజిటల్ కన్సోల్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ మరియు ఫ్యూయల్ గేజ్ పూర్తిగా డిజిటల్‌ రూపంలో ఉంటాయి. కాకపోతే, ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ అందుబాటులో లేదు. కాబట్టి, ఈ విషయంలో టీవీఎస్ రైడర్ 125 ధరకు మించిన ఫీచర్లను అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

TVS Raider 125 వర్సెస్ Bajaj Pulsar NS 125 : కంపారిజన్

Raider 125 వర్సెస్ Pulsar NS 125: మైలేజ్, పెర్ఫార్మెన్స్

కొత్త టీవీఎస్ రైడర్ 125 లీటరు పెట్రోల్‌కు గరిష్టంగా 67 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే, ఇంకా దీని మైలేజ్ అధికారికంగా పరీక్షించబడలేదు. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ బైక్ కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 99 కిమీగా ఉంటుంది.

TVS Raider 125 వర్సెస్ Bajaj Pulsar NS 125 : కంపారిజన్

మరోవైపు బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 లీటరు పెట్రోల్‌కు నగరంలో 64.75 కిలోమీటర్ల మైలేజీని మరియు హైవేపై 56.46 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ బైక్ కేవలం 6.60 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 103 కిమీగా ఉంటుంది. మైలేజ్ మరియు పెర్ఫార్మెన్స్ విషయంలో రైడర్ 125, పల్సర్ ఎన్ఎస్ 125ని ఓవర్‌టేక్ చేసింది.

TVS Raider 125 వర్సెస్ Bajaj Pulsar NS 125 : కంపారిజన్

Raider 125 వర్సెస్ Pulsar NS 125: లైట్స్ అండ్ బ్రేక్స్

కొత్త TVS Raider 125 లో, కంపెనీ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన త్రీ-పాడ్ హెడ్‌లైట్ యూనిట్‌ను అందిస్తుంది. అలాగే, ఇందులోని టెయిల్ లైట్ ఎల్ఈడి లైట్‌తో మరియు టర్న్ ఇండికేటర్లు హాలోజన్ లైట్లతో లభిస్తాయి. ఈ బైక్ ముందు భాగంలో 240 మిమీ సింగిల్ పెటల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. అల్లాయ్ వీల్స్‌తో ట్యూబ్‌లెస్ టైర్‌లను కలిగి ఉంటుంది.

TVS Raider 125 వర్సెస్ Bajaj Pulsar NS 125 : కంపారిజన్

ఇక Bajaj Pulsar NS 125 విషయానికి వస్తే, ఈ బైక్ హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి టెయిల్ లైట్లు మరియు హాలోజన్ టర్న్ ఇండికేటర్లు ఉంటాయి. బ్రేకింగ్ సెటప్‌ను గమనిస్తే, దీని ముందు భాగంలో 240 మిమీ సింగిల్ పెటల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్ ఉంటాయి. ఈ బైక్‌లో కూడా అల్లాయ్ వీల్స్‌తో పాటు ట్యూబ్‌లెస్ టైర్లు అందుబాటులో ఉంటాయి. లైటింగ్ పరంగా చూసుకుంటే, ఎల్‌ఈడి యూనిట్‌తో రైడర్, పల్సర్ కన్నా మెరుగ్గా ఉంటుంది.

TVS Raider 125 వర్సెస్ Bajaj Pulsar NS 125 : కంపారిజన్

ఓవరాల్‌గా చూస్తే.. ధర, ఫీచర్లు, మైలేజ్ మరియు పెర్ఫార్మెన్స్ వంటి పలు అంశాల పరంగా కొత్త TVS Raider 125 ఈ విభాగంలో లభిస్తున్న Bajaj Pulsar NS 125 కన్నా అనేక రెట్లుగా మెరుగ్గా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Most Read Articles

English summary
Comparison between tvs raider 125 and bajaj pulsar ns 125 price features engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X