ఈ ఫంకీ ఫోల్డబిల్ ఇ-బైక్‌ను చూశారా? దీని ధరెంతో తెలిస్తే షాక్ అవుతారు!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు అనేక కొత్త ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు మరియు సరికొత్త బ్రాండ్‌లు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా, క్యూబిట్ అనే ఇ-బైక్ బ్రాండ్ రెండు విశిష్టమైన ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

ఈ ఫంకీ ఫోల్డబిల్ ఇ-బైక్‌ను చూశారా? దీని ధరెంతో తెలిస్తే షాక్ అవుతారు!

క్యూబిఎట్ ఎక్స్1 మరియు క్యూబిఎట్ ఎక్స్2 పేర్లతో కంపెనీ రెండు ఎలక్ట్రిక్ బైక్స్‌ను విడుదల చేసింది. ఫంకీగా కనిపించే ఈ లైట్ వెయింట్ ఇ-బైక్స్‌ను అవసరం లేదనుకుంటే ఫోల్డ్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.52,490 మరియు రూ.69,990గా ఉన్నాయి.

ఈ ఫంకీ ఫోల్డబిల్ ఇ-బైక్‌ను చూశారా? దీని ధరెంతో తెలిస్తే షాక్ అవుతారు!

ఇలాంటి కాంపాక్ట్ మరియు ఫోల్డబిల్ ఇ-బైక్‌లు యూరప్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా ఎక్కువగా అమ్ముడవుతుంటాయి. ఇప్పుడు ఈ తరహా ఇ-బైక్స్ మన దేశంలో కూడా అందబాటులోకి వచ్చాయి. సరదాగా బయటకు వెళ్లటానికి, విహార యాత్రలకు వెళ్లినప్పుడు లేదా మెట్రో రైళ్లలో ప్రయాణించేటప్పు మీ వెంట తీసుకువెళ్లటానికి వీలుగా ఇది ఫోల్డింగ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:హోండా గ్రాజియా 125 స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్.. ఇప్పుడే కోనేయండి

ఈ ఫంకీ ఫోల్డబిల్ ఇ-బైక్‌ను చూశారా? దీని ధరెంతో తెలిస్తే షాక్ అవుతారు!

క్యూబిట్ ఎక్స్1 మరియు ఎక్స్2 ఇ-బైక్‌లు చాలా తక్కువ బరువును కలిగి ఉంటుంది. వీటిలో ఎక్స్1 బరువు 15.5 కిలోలు కాగా, ఎక్స్2 బరువు 18.5 కిలోలుగా ఉంటుంది. మడిచినప్పుడు వీటిని రోడ్డుపై రోల్ చేసుకుంటూ కానీ లేదా మీ భజంపై కానీ సులువుగా మోసుకుంటూ కానీ వెళ్లిపోవచ్చు. ఇవి కారు బూట్ స్పేస్‌లో కూడా సులువుగా ఇమిడిపోయేలా ఉంటాయి.

ఈ ఫంకీ ఫోల్డబిల్ ఇ-బైక్‌ను చూశారా? దీని ధరెంతో తెలిస్తే షాక్ అవుతారు!

మరి ఈ చిన్న ఎలక్ట్రిక్ బైక్‌లో బ్యాటరీ ఎక్కడ ఉందో ఊహించగలరా? వీటిలో బ్యాటరీని సీట్ క్రింది భాగంలో ఉండే పోల్‌లో అమర్చారు. ఈ రెండు ఇ-బైక్‌లు కూడా ఒకే రకమైన 36వి 5.8ఎహెచ్ బ్యాటరీతో పనిచేస్తాయి. ఇందులో పెడల్స్ సహాయంతో, ఈ చిన్న బ్యాటరీ ప్యాక్ పూర్తి చార్జ్‌పై సుమారు 30-35 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

MOST READ:90 వసంతాలు పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్, ఇదే

ఈ ఫంకీ ఫోల్డబిల్ ఇ-బైక్‌ను చూశారా? దీని ధరెంతో తెలిస్తే షాక్ అవుతారు!

క్యూబిట్ ఎక్స్1 మరియు ఎక్స్2 మోడళ్లు రెండూ ఒకే డిజైన్ మరియు ఒకే బ్యాటరీని కలిగి ఉంటాయి. మరి వీటిలో ప్రధాన వ్యత్యాసం ఏంటంటే, వాటి చక్రాలు, గేర్స్ మరియు హబ్ మోటార్ ప్లేస్‌మెంట్‌లు వేర్వేరుగా ఉంటాయి. క్యూబిట్ ఎక్స్1 ఇ-బైక్ 16 ఇంచ్ వీల్స్‌ను కలిగి ఉంటే, క్యూబిట్ ఎక్స్2 పెద్ద 20 ఇంచ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఫంకీ ఫోల్డబిల్ ఇ-బైక్‌ను చూశారా? దీని ధరెంతో తెలిస్తే షాక్ అవుతారు!

అలాగే, క్యూబిట్ ఎక్స్2 ఇ-బైక్‌లో 7-స్పీడ్ షిమనో టోర్నీ రియర్ డెరైల్లూర్ గేర్ సిస్టమ్‌ను మరియు వెనుక చక్రంలో హబ్-మౌంటెడ్ మోటారును కలిగి ఉంటుంది. ఇకపోతే, ఎక్స్1 మోడల్‌లో సింగిల్ గేర్ మరియు ముందు చక్రంలో హబ్-మౌంటెడ్ మోటార్ ఉంటుంది. ఈ రెండు మోడళ్లు కూడా ఇరు వైపులా డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటాయి.

MOST READ:ఇకపై హెల్మెట్స్ వినియోగంపై కొత్త రూల్స్.. అవేంటో ఇక్కడ చూడండి

ఈ ఫంకీ ఫోల్డబిల్ ఇ-బైక్‌ను చూశారా? దీని ధరెంతో తెలిస్తే షాక్ అవుతారు!

క్యూబిట్ ఇ-బైక్స్ ప్యూర్ ఎలక్ట్రిక్ మోడ్‌లో గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటిని రైడ్ చేయడానికి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. వీటి ధరలు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్టాండర్డ్ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో సమానంగా ఉన్నాయి. అయితే, వీటి ఫంకీ, ఫోల్డబిల్ కాంపాక్ట్ డిజైన్ కోసం ఆ మాత్రం ధర చెల్లించవచ్చు. మీరేమంటారు?

Most Read Articles

English summary
Coppernicus Mobility Launches Qubit X1 And X2 Foldable E-bikes In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X