2021 డాకర్ ర్యాలీలో గాయపడిన సిఎస్ సంతోష్ కోలుకున్నాడు.. కానీ..!!

ఎంతో హోరా హోరీగా జరిగిన 2021 డాకర్ ర్యాలీలో అద్భుతమైన ప్రతిభకనపరిచిన సిఎస్ సంతోష్ డాకర్ ర్యాలీ నాలుగో దశలో గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. 2021 డాకర్ ర్యాలీ నాల్గవ దశలో వే పాయింట్ 4 ను దాటిన తర్వాత ఇండియన్ రైడర్ హీరో మోటార్‌స్పోర్ట్ యొక్క సిఎస్ సంతోష్ కుప్పకూలడంతో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.

2021 డాకర్ ర్యాలీలో గాయపడిన సిఎస్ సంతోష్ కోలుకున్నాడు.. కానీ..!!

హీరో మోటోస్పోర్ట్ రైడర్ డాకర్ ర్యాలీలో గాయపడిన తర్వాత అతను కొంతకాలంగా గాయంతో బాధపడ్డాడు. ఇప్పుడు ఇప్పుడు సిఎస్ సంతోష్ గాయం నుంచి కోలుకున్నట్లు సమాచారం అందింది. ఈ డాకర్ ర్యాలీలో, బైక్ నుండి కిందపడి అతని తల గాయమవ్వడం వల్ల అతడు కోమాలోకి వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే.

2021 డాకర్ ర్యాలీలో గాయపడిన సిఎస్ సంతోష్ కోలుకున్నాడు.. కానీ..!!

సిఎస్ సంతోష్ ఆసుపత్రిలో చాలాకాలం కోమాలో ఉన్నారు. అయితే ఇది అతని ప్రాణనానికి ఏమి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. సౌదీ అరేబియాలోని ఒక ఆసుపత్రిలో చాలా వారాలు గడిపిన తరువాత, అతన్ని బెంగళూరుకు తీసుకువచ్చారు, అక్కడ అతను తన కుటుంబాన్ని మరియు స్నేహితులను మళ్ళీ కలుసుకోగలిగాడు.

MOST READ:వేగవంతమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్‌ 650 నిర్మిస్తున్న మంత్ర రేసింగ్; పూర్తి వివరాలు

2021 డాకర్ ర్యాలీలో గాయపడిన సిఎస్ సంతోష్ కోలుకున్నాడు.. కానీ..!!

సిఎస్ సంతోష్ బెంగళూరుకు వచ్చిన తర్వాత, అతని పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. అతను ప్రస్తుతం బిగ్ రాక్ డర్ట్‌పార్క్‌లో పాల్గొనటానికి, మళ్లీ సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నాడు. దాని గురించి సిఎస్ సంతోష్ తండ్రి శివశంకర్ మాట్లాడుతూ, 2021 డాకర్ ర్యాలీ గురించి తనకు ఏమీ గుర్తు లేదని ఆయన అన్నారు.

2021 డాకర్ ర్యాలీలో గాయపడిన సిఎస్ సంతోష్ కోలుకున్నాడు.. కానీ..!!

సిఎస్ సంతోష్ తలకి దెబ్బ తగిలిన తర్వాత పెద్ద శారీరక గాయం లేనప్పటికీ, తలకు గాయం కావడం అతడు కొంత జ్ఞాపకశక్తిని కోల్పోతున్నాడు. అంతే కాకుండా ఈ ప్రమాదంలో అతని కుడి భుజం కూడా కొంత స్థానభ్రంశం చెందింది.

MOST READ:గుండె తరుక్కుపోయే వీడియో.. ముందు బాక్స్‌లో పాప, వెనుక డెలివరీ మెటీరియల్

2021 డాకర్ ర్యాలీలో గాయపడిన సిఎస్ సంతోష్ కోలుకున్నాడు.. కానీ..!!

సిఎస్ సంతోష్ కోలుకున్నాక అతనికి గుర్తున్నదల్లా, డాకర్ ర్యాలీ 2021 కోసం స్పెయిన్లో ట్రైనింగ్ లో ఉండటం. ప్రమాదం తర్వాత మెదడుకి గాయం కావడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. ఏడు రోజుల క్రితం సంతోష్‌కు ఏమీ గుర్తులేదు. అంతే కాకుండా ఏమీ గుర్తుంచుకోడు, కానీ మాట్లాడటం ద్వారా అతను ఈ విషయాలను అంగీకరించడం ప్రారంభించాడు.

2021 డాకర్ ర్యాలీలో గాయపడిన సిఎస్ సంతోష్ కోలుకున్నాడు.. కానీ..!!

ప్రస్తుతం సిఎస్ సంతోష్ కి గుర్తు చేస్తుంటే, ఇది జరిగిందా? అది ఎలా జరిగింది? అని ప్రశ్నిస్తున్నాడు. అతనికి తన పాత విషయాలు గుర్తుచేస్తున్నప్పుడు మెల్లీ ఏమైనా గుర్తుకు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా సిఎస్ సంతోష్ మళ్ళీ త్వరగా కోలుకుని మళ్ళీ మునుపటిలాగే రైడింగ్ లో పాల్గొనాలని ఆశిద్దాం..

MOST READ:భారత్‌లో 6 కొత్త బైకులను విడుదల చేసిన ట్రయంఫ్, పూర్తి వివరాలు

Most Read Articles

English summary
CS Santosh Recovers From Injury. Read in Telugu.
Story first published: Saturday, April 3, 2021, 18:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X